iDreamPost

క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ సృష్టించిన ఆ చెరగని చరిత్రకు నేటితో 12 ఏళ్లు!

క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ సరిగ్గా ఇదే రోజున(మార్చి 16, 2012) ప్రపంచ క్రికెట్ లో చెరగని చరిత్రను సృష్టించాడు. ఆ ఘనతకు నేటిలో సరిగ్గా 12 సంవత్సరాలు పూర్తైంది. ఈ రేర్ ఫీట్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ సరిగ్గా ఇదే రోజున(మార్చి 16, 2012) ప్రపంచ క్రికెట్ లో చెరగని చరిత్రను సృష్టించాడు. ఆ ఘనతకు నేటిలో సరిగ్గా 12 సంవత్సరాలు పూర్తైంది. ఈ రేర్ ఫీట్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ సృష్టించిన ఆ చెరగని చరిత్రకు నేటితో 12 ఏళ్లు!

సచిన్ టెండుల్కర్, క్రికెట్.. ఈ రెండింటిని వేరుచేసి చూడలేం. అంతలా ప్రపంచ క్రికెట్ పై తన ముద్రను వేశాడు లిటిల్ మాస్టర్. టన్నుల కొద్ది పరుగులు, వందల కొద్ది రికార్డులు సచిన్ పేరు చెప్పగానే మనకు గుర్తుకు వస్తాయి. ఎంతటి బౌలర్ నైనా సునాయసంగా ఉతికారేయడం మాస్టర్ బ్లాస్టర్ కు అలవాటు. అందుకే అతడిని చూడగానే కాదు.. పేరు చెబితేనే కొందరు బౌలర్లకు చెమటలు పడతాయి. అయితే క్రికెట్ గాడ్ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. కానీ ఇప్పటి వరకు చెక్కుచెదరని ఓ రికార్డును ఇదే రోజున(మార్చి 16) సృష్టించి.. చరిత్రకెక్కాడు. ఆ చెరగని చరిత్రకు నేటితో 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ మ్యాచ్ ను, ఆ రికార్డును ఓసారి గుర్తుచేసుకుందాం పదండి.

అది 2012 సరిగ్గా ఇదే రోజు (మార్చి 16) ఆసియా కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో సచిన్ టెండుల్కర్ సరికొత్త చరిత్రకు నాందిపలికాడు. అప్పటి వరకు మాస్టర్ బ్లాస్టర్ సాధించిన రికార్డులన్నీ ఒకెత్తు అయితే.. ఈ రికార్డు మరోఎత్తు. ఈ మ్యాచ్ లో 138 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఓవరాల్ గా 147 బంతుల్లో 114 రన్స్ చేశాడు సచిన్. ఈ శతకం సచిన్ కెరీర్ లోనే కాదు.. ప్రపంచ క్రికెట్ లో ఓ మైల్ స్టోన్ గా నిలిచింది. లిటిల్ మాస్టర్ కెరీర్ లో ఇది 100వ ఇంటర్నేషనల్ సెంచరీ. టెస్ట్ క్రికెట్ లో 51 సెంచరీలు బాదిన సచిన్.. వన్డేల్లో 49 శతకాలు సాధించాడు. దీంతో తన అంతర్జాతీయ కెరీర్ లో వంద సెంచరీలు పూర్తిచేసుకున్న ఏకైక క్రికెటర్ గా మాస్టర్ బ్లాస్టర్ నిలిచాడు. నేటితో ఈ చెరగని చరిత్రకు 12 సంవత్సరాలు పూర్తైంది.

sachin creates record 2

కాగా.. ఇప్పటి వరకు ఈ ఘనతను ఏ క్రికెటర్ కూడా బద్దలు కొట్టడం కాదుకదా.. దరిదాపుల్లోకి కూడా రాలేదు. ఈ రికార్డు ఒక్కటి చాలు సచిన్ క్రికెట్ పై ఎలాంటి ముద్రవేశాడో తెలియజెప్పడానికి. అయితే దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్ లో ఇండియా ఓడిపోయింది. టీమిండియా నిర్దేశించిన 290 పరుగుల లక్ష్యాన్ని మరో 4 బంతులు ఉండగానే బంగ్లాదేశ్ ఛేదించింది. ఇది కాస్త నిరాశకు గురిచేసే విషయమే అయినప్పటికీ.. సచిన్ సాధించిన వంద వందల రికార్డు ముందు అభిమానులకు పరాజయం పెద్ద విషయంగా కనిపించలేదు. మరి సచిన్ టెండుల్కర్ సాధించిన ఈ తిరుగులేని రికార్డు నేటితో 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ఇది వేరే లెవెల్.. మలింగను ఇమిటేట్ చేసిన ఇషాన్! వీడియో వైరల్..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి