SNP
వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. ఇటీవల వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్స్‌లో ఇండియాపై గెలిచి ఆస్ట్రేలియా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఆ జట్టును కెప్టెన్ కమిన్స్ అద్భుతంగా నడిపించాడు. కానీ, అంత మంచి కెప్టెన్సీతో వరల్డ్ కప్ అందించిన కమిన్స్‌కు ఘోర అవమానం ఎదురైంది.
వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. ఇటీవల వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్స్‌లో ఇండియాపై గెలిచి ఆస్ట్రేలియా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఆ జట్టును కెప్టెన్ కమిన్స్ అద్భుతంగా నడిపించాడు. కానీ, అంత మంచి కెప్టెన్సీతో వరల్డ్ కప్ అందించిన కమిన్స్‌కు ఘోర అవమానం ఎదురైంది.
SNP
ఇండియాపై ఫైనల్స్‌లో గెలిచి.. వన్డే వరల్డ్ కప్ 2023ను ఆస్ట్రేలియా సాధించింది. ఈ అద్భుత విజయం తర్వాత ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు స్వదేశానికి చేరుకున్నారు. వారిలో ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ఉన్నాడు. అయితే.. వరల్డ్ కప్ లాంటి అతి పెద్ద టోర్నమెంట్‌లో గెలిచి, ప్రపంచ ఛాంపియన్లుగా గెలిచిన తమకు స్వదేశంలో అఖండ ఘనస్వాగతం లభిస్తుందని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భావించాడు. వరల్డ్ కప్ విజయం సాధించిన తర్వాత.. ఆ దేశ మీడియా ప్యాట్ కమిన్స్‌ను ఆకాశానికి ఎత్తేసింది. లక్ష మందికి పైగా ప్రేక్షకులను సైలెంట్‌గా ఉంచుతానని చెప్పి మరీ అలాగే చేశాడంటూ కమిన్స్ పొగడ్తలతో ముంచెత్తింది.
ఇవన్నీ చూసిన ప్యాట్ కమిన్స్ అండ్ కో.. స్వదేశానికి వెళ్తే తమక బ్రహ్మరథం పడతారని ఆశ పడ్డారు. ఎన్నో కలలు కన్నారు. కానీ, తీరా వాళ్ల దేశానికి వెళ్లి చూస్తూ.. ఒక్కడు కూడా పట్టించుకోలేదు. ఎయిర్ పోర్టులో ఒకరిద్దరు మీడియా వాళ్లు మినహా కమిన్స్‌ను పట్టించుకున్న వాళ్లే లేరు. ఏదో ఓ సాధారణ ఆటగాడు వచ్చినట్లు, లేదా టోర్నీలో ఓటమి పాలై వచ్చినట్లు ఆస్ట్రేలియన్లు లైట్ తీసుకున్నారు. దీంతో కమిన్స్ ఫేస్‌లో ఒకింత నిరాశ కనిపించింది. అదే ఇండియాలో అయితే.. వరల్డ్ కప్ గెలిచిన టీమ్‌లోని ప్రతి ఒక్కరిని హీరోల్లా చూస్తూ.. అడుగడుగునా నీరాజనం పలుకుతారు.
అయితే.. ఆస్ట్రేలియా కప్పు గెలవడం కొత్త కాదని, ఇప్పటికే చాలా సార్లు వాళ్లు ప్రపంచ ఛాంపియన్లుగా నిలవడంతో ఆస్ట్రేలియన్లకు ఇది పెద్ద విషయం కాదంటూ మరికొంత మంది పేర్కొంటున్నారు. కప్పులు చూసి చూసి ఉన్న వాళ్లకు ఇది పెద్ద విజయంలా అనిపించడం లేదని, ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏం లేదంటున్నారు. ఏది ఏమైనా.. వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా అద్భుతంగా ఆడింది. పైగా పిచ్ కండీషన్, వాతావరణ పరిస్థితులు అన్ని వాళ్లకే కలిసొచ్చాయి. అయితే.. ఇండియా ఫైనల్లో ఓడిపోవడం మాత్రం భారత క్రికెట్ అభిమానులు హృదయాలను ముక్కలు చేసింది. మరి ఇంత గొప్ప విజయం సాధించిన తర్వాత కూడా జట్టు కెప్టెన్‌కు స్వదేశంలో మంచి స్వాగతం లభించకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
This is Pat Cummins’ welcome at airport. 😭 Looks like cricket World Cup wasn’t telecasted in Australia.#cricket #BB17 #dwts pic.twitter.com/ncPO7op12e
— Fourth Umpire (@UmpireFourth) November 22, 2023