Nidhan
న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. ఆ జట్టు సాధించిన విజయం వరల్డ్ కప్‌ను మించినదనే చెప్పాలి. ఇదంతా కేన్ మామ వల్లే సాధ్యమైంది.
న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. ఆ జట్టు సాధించిన విజయం వరల్డ్ కప్‌ను మించినదనే చెప్పాలి. ఇదంతా కేన్ మామ వల్లే సాధ్యమైంది.
Nidhan
న్యూజిలాండ్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఎన్నో ఏళ్ల కలను ఇవాళ నిజం చేసుకుంది. సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో నెగ్గిన కివీస్.. ఈ సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. 92 ఏళ్ల తర్వాత టెస్టుల్లో సఫారీ టీమ్‌పై న్యూజిలాండ్ సిరీస్ నెగ్గింది. ఇన్నేళ్లలో ఎన్నోసార్లు ఈ రెండు జట్లు తలపడ్డాయి. అందులో కొన్ని సిరీస్‌ల్లో సౌతాఫ్రికా విజయం సాధించింది. కానీ న్యూజిలాండ్ మాత్రం ఒక్కసారి కూడా సిరీస్ నెగ్గలేదు. మ్యాచులు గెలిచినా సిరీస్‌ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. వన్డేలు, టీ20ల్లో సఫారీ టీమ్‌పై న్యూజిలాండ్‌దే హవా. కానీ టెస్టుల్లో మాత్రం సౌతాఫ్రికాదే పైచేయి అవుతూ వచ్చింది. అయితే కేన్ విలియమ్సన్ మహిమతో జట్టు ఎట్టకేలకు చరిత్రను తిరగరాసింది.
కేన్ మామ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 92 ఏళ్లుగా తన జట్టుకు దొరకని సిరీస్‌ను అందించాడు. న్యూజిలాండ్‌కు అందని ద్రాక్షగా ఉన్న సిరీస్‌ను అందించాడు. బ్యాటర్‌గా విలియమ్సన్ సూపర్బ్‌గా రాణించడంతోనే ఇది సాధ్యమైంది. ఇంజ్యురీతో కొన్నాళ్ల పాటు టీమ్‌కు దూరమైన కేన్ మామ.. రీఎంట్రీలో అదరగొడుతున్నాడు. గత 7 టెస్టుల్లో అతడు ఏకంగా 7 సెంచరీలు బాదడం విశేషం. ఓపిక, టెక్నిక్కు సవాల్ విసిరే టెస్టుల్లో ఇలా బ్యాక్ టు బ్యాటక్ సెంచరీలు బాదడం అంత ఈజీ కాదు. కానీ విలియమ్సన్ దాన్ని చేసి చూపించాడు. సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో శతకం బాదాడు. ఇది అతడి కెరీర్లో 32వ సెంచరీ కావడం విశేషం. అతడు ఎంత భీకరమైన ఫామ్‌లో ఉన్నాడనే దానికి ఇదే నిదర్శనం.
సౌతాఫ్రికాతో రెండు మ్యాచుల సిరీస్‌లో 118, 109, 43, 133 నాటౌట్ స్కోర్లు చేశాడు విలియమ్సన్. రెండు మ్యాచుల్లో కలిపి ఏకంగా 3 సెంచరీలు బాదాడు. దీన్ని బట్టే సఫారీ బౌలర్లతో అతడు ఎంత చెడుగుడు ఆడుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. కేన్ మామ ఫామ్‌ను అందుకోవడం, రీఎంట్రీలో అదరగొట్టడం కివీస్‌కు సూపర్ న్యూస్ అనే చెప్పాలి. ఇక, ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 242 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ 211 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత కివీస్ ముందు ప్రొటీస్ 267 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. విలియమ్సన్ సెంచరీకి తోడు విల్ యంగ్ (66) రాణించడంతో రికార్డు లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంపై న్యూజిలాండ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. ఇది వరల్డ్ కప్‌ను మించిన విజయమని.. సిరీస్ నెగ్గడం ఎప్పటికీ గుర్తుండిపోతుందని అంటున్నారు. మరి.. కేన్ మామ కివీస్ కలను నిజం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: మద్యం సేవిస్తూ. మహిళా క్రికెటర్లతో కోచ్ అసభ్య ప్రవర్తన! HCA వేటు..
KANE WILLIAMSON HAS 7 CENTURIES IN THE LAST 12 INNINGS…!!! 🐐pic.twitter.com/14XxPhWSw3
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 16, 2024
NEW ZEALAND HAVE WON A TEST SERIES AGAINST SOUTH AFRICA FOR THE FIRST TIME IN HISTORY…!!!! 🤯 pic.twitter.com/JmxUDOLdxP
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 16, 2024