Nidhan
న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ అరుదైన ఘనత సాధించాడు. ఏకంగా టీమిండియా బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ రికార్డును అతడు బ్రేక్ చేశాడు.
న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ అరుదైన ఘనత సాధించాడు. ఏకంగా టీమిండియా బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ రికార్డును అతడు బ్రేక్ చేశాడు.
Nidhan
క్రికెట్లో ప్రస్తుత తరం ఆటగాళ్లలో బెస్ట్ ఎవరంటే అందరూ విరాట్ కోహ్లీ పేరే చెబుతారు. కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, జో రూట్ రూపంలో కోహ్లీకి గట్టిపోటీ ఉంది. కానీ కోహ్లీ మాత్రం భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ పరుగుల వరద పారిస్తూ.. అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే టెక్నికల్‌గా బెస్ట్ బ్యాట్స్‌మన్ అనే పేరు తెచ్చుకున్నాడు విలియమ్సన్. మ్యాచ్‌లో కేన్ మామ ఆడుతున్నాడంటే చాలు.. అపోజిషన్ టీమ్స్ వణికిపోతాయి. అతనేమీ భారీ సిక్సులు, బౌండరీలతో విరుచుకుపడకపోయినా.. చాప కింద నీరులా చూస్తుండగానే ప్రత్యర్థి చేతి నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంటాడు. గాయాలతో సతమతం అవుతున్నా గ్రౌండ్లోకి దిగిన ప్రతిసారి సూపర్బ్ నాక్స్‌తో అదరగొడుతున్నాడు. తాజాగా కింగ్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు విలియమ్సన్.
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో కివీస్ స్టార్ బ్యాటర్ విలియమ్సన్ చెలరేగిపోయాడు. అద్భుతమైన శతకంతో తన జట్టు భారీ స్కోరు సాధించడంలో గట్టి పునాది వేశాడు. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు దిగిన కేన్ మామ 259 బంతుల్లో 112 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఇది అతడికి టెస్టుల్లో 30వ సెంచరీ కావడం విశేషం. ఈ జనరేషన్ క్రికెటర్స్‌లో 32 సెంచరీలతో స్టీవ్ స్మిత్ ఫస్ట్ ప్లేసులో ఉన్నాడు. ఆ తర్వాత 30 సెంచరీలతో విలియమ్సన్, జో రూట్ రెండో ప్లేసులో కొనసాగుతున్నారు. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ 29 శతకాలతో మూడో ప్లేసులో ఉన్నాడు. ఇంతకుముందు వరకు కోహ్లీతో సమానంగా ఉన్న కేన్ మామ.. తాజా శతకంతో 30 సెంచరీల క్లబ్లో జాయిన్ అయ్యాడు. అయితే ఓవరాల్ సెంచరీస్ జాబితాలో కోహ్లీదే అగ్రస్థానం.
మూడు ఫార్మాట్లలో కలిపి కోహ్లీ 80 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానాల్లో డేవిడ్ వార్నర్ (49), రోహిత్ శర్మ (46), జో రూట్ (46), స్టీవ్ స్మిత్ (44), విలియమ్సన్ (43) కొనసాగుతున్నారు. ఇక, సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో విలియమ్సన్తో పాటు రచిన్ రవీంద్ర (211 బంతుల్లో 118) కూడా సెంచరీతో చెలరేగాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే టైమ్‌కు కివీస్ 86 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో మోర్కీ, పాటెర్సన్ చెరో వికెట్ తీశారు. ఇన్నింగ్స్ మొదట్లో డెవాన్ కాన్వే (1), టామ్ లాథమ్ (20) త్వరగా ఔటవడంతో కివీస్ డిఫెన్స్‌లో పడింది. ఈ సిచ్యువేషన్లో రచిన్, కేన్ మామ టీమ్‌ను ఆదుకున్నారు. ఇద్దరూ కలసి మూడో వికెట్‌కు ఏకంగా 221 పరుగులు జోడించారు. మరి.. విరాట్ రికార్డును విలియమ్సన్ బ్రేక్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Most Test hundreds in Fab 4:
Smith – 32 (107 matches)
Williamson – 30* (97 matches)
Root – 30 (137 matches)
Kohli – 29 (113 matches) pic.twitter.com/XBMXWl6nmr— Johns. (@CricCrazyJohns) February 4, 2024