iDreamPost
android-app
ios-app

George Worker: రిటైర్మెంట్‌ ప్రకటించిన న్యూజిలాండ్‌ క్రికెటర్‌ జార్జ్ వర్కర్

  • Published Aug 13, 2024 | 3:47 PM Updated Updated Aug 13, 2024 | 3:47 PM

క్రికెటర్ల రిటైర్మెంట్ వార్తలు అభిమానులను నిరాశకు, బాధకు లోను చేస్తాయి. ఇన్నాళ్లూ తమ టాలెంట్​తో ఉర్రూతలూగించిన ఆటగాళ్లు ఇక మీద గ్రౌండ్​లో కనిపించరనే న్యూస్ వాళ్లను ఎంతో డిజప్పాయింట్ చేస్తుంది.

క్రికెటర్ల రిటైర్మెంట్ వార్తలు అభిమానులను నిరాశకు, బాధకు లోను చేస్తాయి. ఇన్నాళ్లూ తమ టాలెంట్​తో ఉర్రూతలూగించిన ఆటగాళ్లు ఇక మీద గ్రౌండ్​లో కనిపించరనే న్యూస్ వాళ్లను ఎంతో డిజప్పాయింట్ చేస్తుంది.

  • Published Aug 13, 2024 | 3:47 PMUpdated Aug 13, 2024 | 3:47 PM
George Worker: రిటైర్మెంట్‌ ప్రకటించిన న్యూజిలాండ్‌ క్రికెటర్‌ జార్జ్ వర్కర్

క్రికెటర్ల రిటైర్మెంట్ వార్తలు అభిమానులను నిరాశకు, బాధకు లోను చేస్తాయి. ఇన్నాళ్లూ తమ టాలెంట్​తో ఉర్రూతలూగించిన ఆటగాళ్లు ఇక మీద గ్రౌండ్​లో కనిపించరనే న్యూస్ వాళ్లను ఎంతో డిజప్పాయింట్ చేస్తుంది. తాజాగా ఓ క్రికెటర్ ఆటకు గుడ్​బై చెప్పడం ఫ్యాన్స్​ను నిరాశకు లోనుచేసింది. 17 ఏళ్ల పాటు తన బ్యాటింగ్​తో అందర్నీ ఎంటర్​టైన్ చేసిన ఓ సీనియర్ బ్యాటర్​ క్రికెట్​కు గుడ్​బై చెప్పేశాడు. ఈ ప్లేయర్ మరెవరో కాదు.. న్యూజిలాండ్​కు చెందిన జార్జ్ వర్కర్. కివీస్ డొమెస్టిక్ క్రికెట్​లో విశేషంగా రాణించిన ఈ వెటరన్ బ్యాట్స్​మన్.. సెంట్రల్ డిస్ట్రిక్ట్, ఆక్లాండ్, కాంటర్​బరీ టీమ్స్ తరఫున రాణించి మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు.

34 ఏళ్ల జార్జ్ వర్కర్ న్యూజిలాండ్ తరఫున 10 వన్డేలు, రెండు టీ20లు ఆడాడు. వచ్చిన అవకాశాలను మరింతగా సద్వినియోగం చేసుకొని ఉంటే ఇంటర్నేషనల్ క్రికెట్​లోనూ నోటబుల్ ప్లేయర్ అయ్యేవాడు. కానీ అంతగా రాణించకపోవడంతో ఛాన్సులకు గండి పడింది. ఒక పెట్టుబడి సంస్థలో జాబ్ రావడంతో ప్రొఫెషనల్ క్రికెట్​ నుంచి వర్కర్ తప్పుకున్నాడు. 2015, ఆగస్టు 23న సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్​లోకి డెబ్యూ చేశాడు వర్కర్. 2018, నవంబర్ 11న దుబాయ్ వేదికగా పాకిస్థాన్​తో జరిగిన వన్డే మ్యాచ్​లో ఆఖరిసారి కనిపించాడు. ఆ తర్వాత డొమెస్టిక్ క్రికెట్​కే పరిమితం అయ్యాడు.

దశాబ్దంన్నర కాలం పాటు సుదీర్ఘ క్రికెట్ ఆడాక కెరీర్​కు స్వస్థి పలకడం బాధగా అనిపిస్తోందని వర్కర్ అన్నాడు. అయితే ఈ డెసిషన్ తన లైఫ్​లో ఒక అద్భుతమైన ప్రయాణానికి ముగింపు అని చెప్పాడు. జీవితంలో మరో కొత్త మార్గానికి ఇది దారి చూపిస్తోందని తెలిపాడు. ఇన్నేళ్ల కెరీర్​లో ఎంతో మంది గొప్ప ఫ్రెండ్స్​ను కలిశానని.. డ్రెస్సింగ్ రూమ్​లో వాళ్లతో జ్ఞాపకాలను ఎన్నటికీ మర్చిపోలేనని పేర్కొన్నాడు వర్కర్. కెరీర్​లో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ అతడు థ్యాంక్స్ చెప్పాడు. ఇక, 126 ఫస్ట్​క్లాస్ మ్యాచులు ఆడిన వర్కర్ 6,400 పరుగులు చేశాడు. 169 లిస్ట్​-ఏ మ్యాచుల్లో 6,721 పరుగులు చేశాడు. 154 టీ20ల్లో 3,480 రన్స్ చేశాడు. ఫస్ట్​క్లాస్ క్రికెట్​లో 58, లిస్ట్​-ఏలో 60, టీ20ల్లో 42 వికెట్లు పడగొట్టాడు వర్కర్. అండర్-19 వరల్డ్ కప్​లోనూ కివీస్​కు అతడు ప్రాతినిధ్యం వహించడం విశేషం. ​