SNP
Mohammed Siraj, Range Rover, Cricketer Success Story: మన హైదరాబాదీ కుర్రాడు.. అంతర్జాతీయ స్థాయిలో టీమిండియా తరఫున ఆడే స్థాయికి ఎదిగాడు. పాత బైక్ నుంచి రేంజ్ రోవర్ స్థాయికి వచ్చాడు. సిరాజ్ సక్సెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Mohammed Siraj, Range Rover, Cricketer Success Story: మన హైదరాబాదీ కుర్రాడు.. అంతర్జాతీయ స్థాయిలో టీమిండియా తరఫున ఆడే స్థాయికి ఎదిగాడు. పాత బైక్ నుంచి రేంజ్ రోవర్ స్థాయికి వచ్చాడు. సిరాజ్ సక్సెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
మొహమ్మద్ సిరాజ్.. మూడు ఫార్మాట్లలోనూ టీమిండియాకు కీ బౌలర్. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లాంటి బిగ్ టీమ్‌కి ప్రధాన అస్త్రం. తనదైన రోజున ఎలాంటి జట్టునైనా.. పేకమేడలో కూల్చే సత్తా ఉన్న బౌలర్. టీమిండియా మోడ్రన్ గ్రేట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అత్యంత ప్రియ సన్నిహితుడిగా.. టీమిండియాకు మియా భాయ్‌గా మారిన సిరాజ్.. తాజాగా అత్యంత ఖరీదైన రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్‌లో ఆడుతూ.. కోట్లు సంపాదిస్తున్నాడు. వాటితో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌తో కూడా బాగానే వెనకేస్తున్నాడు.. కానీ, మనోడు ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చాడో చెప్పడానికి మాటలు సరిపోవు. కానీ, ఒక టార్గెట్‌ను అందుకోవడానికి ఎంత కష్టమైనా సరే పడి, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే దాటుకుంటూ.. శ్రమిస్తే కచ్చితంగా సక్సెస్ అవుతాం అని చెప్పాడానికి సిరాజ్ జీవితం ఒక గొప్ప ఎగ్జాంపుల్.
చిన్న చిన్న సమస్యలకే కుంగిపోతూ.. తమ పేదరికాన్ని తిట్టుకుంటూ.. అనుకున్నది సాధించలేకపోతున్నాం అని బాధపడే యువత కోసం.. ఇవాళ నెడితే గానీ స్టార్ట్ కానీ ‘డొక్కు ప్లాటినా టూ రేంజ్ రోవర్’లో సిరాజ్ లైఫ్ స్టోరీ గురించి తెలుసుకుందాం..
హైదరాబాద్ అంటే మహానగరం అంటారు కానీ, ఇక్కడ కూడా చాలా పేద వాడలు, స్లమ్ ఏరియాలు ఉంటాయి. అలాంటి ఏరియానే అయినా.. ఖాజానగర్‌లోని ఓ అద్దె ఇంట్లో ఉండేవాడు సిరాజ్. ఈ ఖాజానగర్ మాసబ్‌ట్యాంక్ పరిధిలో ఉంటుంది. సిరాజ్ తండ్రి ఒక ఆటో డ్రైవర్. రోజూ ఆటో నడిపితే కానీ.. ఇంట్లో గడవదు. భార్య, ఇద్దరు కొడుకులను పోషించేందుకు సిరాజ్ తండ్రి.. పగలు రాత్రి తేడా లేకుండా ఆటో నడిపేవాడు. అంత కష్టపడుతూనే.. పెద్ద కొడుకు మొహమ్మద్ ఇస్మాయిల్‌ను ఇంజనీరింగ్ వరకు చదవించారు. కానీ, చిన్నోడు సిరాజ్‌కు చదువు పెద్దగా ఎక్కలేదు. ఎంత సేపు క్రికెట్ గోలే. మనోడికి క్రికెట్ అంటే పిచ్చి. ఎప్పటికైనా.. టీమిండియాకు ఆడాలని కలలు కంటూ ఉండేవాడు. కేవలం కలలు మాత్రమే కాదు.. అందుకోసం చాలా కష్టపడేవాడు.
ఇంట్లో ఉండే ఓ డొక్కు ప్లాటినా వేసుకొని గ్రౌండ్‌కి వెళ్లి ప్రాక్టీస్ చేసేవాడు. ప్రాక్టీస్ కోసం సరైన షూ కూడా ఉండేవి కావు సిరాజ్ దగ్గర. నాన్నని అడుగుదాం అంటే.. పాపం ఆయనే కుటుంబ పోషణ కోసం ఇప్పటికే ఎంతో కష్టపడుతున్నాడు. దీంతో.. డబ్బుల కోసం తండ్రిని మరింత ఇబ్బంది పెట్టడం సిరాజ్‌కు ఇష్టముండేది కాదు. తన ఖర్చుల కోసం పెయింటింగ్ పనికి కూడా వెళ్లేవాడు సిరాజ్. దాంతో వచ్చిన డబ్బులతో ఆ పాత ప్లాటినా బైక్‌లో పెట్రోల్‌తో పాటు.. షూ కొనుక్కునేవాడు. అప్పుడప్పుడు చిన్న చిన్న టోర్నమెంట్‌లో కూడా ఆడేవాడు. సిరాజ్‌ను డబ్బులిచ్చి మరీ తీసుకెళ్లేవాళ్లు బెట్ మ్యాచ్‌ల కోసం. అంతర్జాతీయ క్రికెట్ ఆడేబోయే కుర్రాడు.. తన ఖర్చుల కోసం బెట్ మ్యాచ్‌లు కూడా ఆడాడు.
అంత పేదరికంలో మగ్గుతున్నా.. ఏనాడు తన లక్ష్యాన్ని మర్చిపోలేదు సిరాజ్. ఈ క్రికెట్ ఎందుకులే.. ఏదైన ఉద్యోగం చూసుకుందాం.. అని అనుకోలేదు. క్రికెట్ కావాలనే కసితోనే ఎదిగాడు. అందుకోసం గ్రౌండ్‌లో తన చెమట, రక్తం చిందించాడు. అలా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుల కంట్లో పడ్డాడు. స్టేట్ టీమ్‌కు సెలెక్ట్ అయి.. అంచెలంచెలుగా రంజీలు ఆడుతూ.. 2017లో తన జీవితకాల లక్ష్యాన్ని సాధించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అంతకంటే ముందే.. ఏప్రిల్‌లో ఐపీఎల్‌లో సన్‌రైజర్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగాడు. ఇక్కటి నుంచి సిరాజ్ జీవితం మారిపోయింది.
టీ20ల్లో అంత మెరుగైన ప్రదర్శన చేయకపోయినా.. టెస్టుల్లో మాత్రం అదరగొట్టాడు. 2020 డిసెంబర్ 26న ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ ఆడిన సిరాజ్.. తన సత్తా ఏంటో చూపించాడు. ఆడిన తొలి టెస్టులోనే ఏకంగా 5 వికెట్లతో అదరగొట్టాడు. ఇక అక్కడి నుంచి సిరాజ్ జర్నీ సూపర్ సక్సెస్‌గా దూసుకుపోతుంది. మూడు ఫార్మాట్లలో కూడా టీమిండియాకు కీలక బౌలర్‌గా మారిపోయాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ నుంచి ఆర్సీబీకి మారిపోయి.. విరాట్ కోహ్లీకి తమ్ముడైపోయాడు. ఆసియా కప్ 2023 ఫైనల్‌లో తన కెరీర్‌లోనే అత్యంత అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. తన పేరు వింటనే శ్రీలంకకు ముచ్చెమటలు పట్టేలా చేశాడు. టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచిన టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. వన్డే క్రికెట్‌లో వరల్డ్ నంబర్ వన్ బౌలర్‌గా కూడా కొంత కాలం కొనసాగి.. కెరీర్ పీక్స్‌ను చూశాడు. ఇంత సక్సెస్ వచ్చినా.. సిరాజ్‌లో ఎక్కడా గర్వం ఉండదు. ఆన్ ది ఫీల్డ్‌లో అగ్రెసివ్‌గా ఉన్నా.. ఆఫ్ ది ఫీల్డ్ ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ.. డౌన్ టూ ఎర్త్ ఉంటాడు. చాలా హంబుల్‌గా వ్యవహరిస్తూ ఉంటాడు. కష్టం చూసి వచ్చిన వాడు కదా అలాగే ఉంటాడు. తాజాగా తన డ్రీమ్ కార్ రేంజ్ రోవర్ కొన.. తల్లితో పాటు ఫొటోలకు ఫోజులిస్తూ సంతోషడిపోయాడు. కష్టం పెట్టుబడిగా ఇంత ఎదిగిన సిరాజ్.. మరింత ఎదిగి క్రికెట్‌లో ఇండియా పేరు మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని ఆశిద్దాం. మరి సిరాజ్ సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.