SNP
New Zealand vs Uganda, T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్‌లో మరో సంచలనం నమోదైంది. ఓ జట్టు అత్యంత దారుణంగా కేవలం 40 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ మ్యాచ్‌కు సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి..
New Zealand vs Uganda, T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్‌లో మరో సంచలనం నమోదైంది. ఓ జట్టు అత్యంత దారుణంగా కేవలం 40 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ మ్యాచ్‌కు సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి..
SNP
టీ20 వరల్డ్ కప్ 2024లో క్రికెట్ అభిమానులు కలలో కూడా ఊహించని ఫలితాలు వస్తున్నాయి. పెద్ద పెద్ద టీమ్స్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక జట్టు గ్రూప్ స్టేజ్‌లో ఇంటి బాటపట్టాయి. తాజాగా సౌతాఫ్రికాను నేపాల్ జట్టు ఓడించినంత పనిచేసింది. ఒక్క పరుగుతో గెలిచిన సౌతాఫ్రికా ఘోర అవమానం నుంచి కొద్దిలో తప్పించుకుంది. తాజాగా ఓ జట్టు కేవలం 40 పరుగులకే కుప్పకూలింది. ట్రినిడాడ్‌లోని బ్రియన్ లారా స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉగాండ జట్టు 40 పరుగులకే ఆలౌట్ అయింది. ఏకంగా 10 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్‌కే అవుట్ అయ్యారు.
గ్రూప్-సీలో ఉన్న న్యూజిలాండ్, ఉగాండ జట్లు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఈ రెండు జట్ల మధ్య జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో కివీస్ బౌలర్లు రెచ్చిపోయారు. టోర్నీ నుంచి గ్రూప్ స్టేజ్‌లో ఇంటి బాట పట్టామనే కోపమో ఏమో కానీ.. ఉగాండ బ్యాటర్లతో ఒక ఆట ఆడుకున్నారు న్యూజిలాండ్ బౌలర్లు. కివీస్ దెబ్బకు ఉగాండ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఉగాండ 18.4 ఓవర్లలో 40 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టులోని ఒకే ఒక్క బ్యాటర్ వైస్వా 18 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేశాడు. మిగిలిన 10 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్‌కే పెవిలియన్ చేరారు.
న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 4 ఓవర్లలో 7 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. అలాగే టిమ్ సౌథీ 4 ఓవర్లలో 4 రన్స్ ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. సాంట్నర్ 2, ఫెర్గుసన్ 1, రచిన్ రవీంద్ర 2 వికెట్లు తీసుకున్నారు. ఇక 41 పరుగుల స్వల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 5.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఊదిపారేసింది. ఓపెనర్ ఫిన్ అలెన్ 9 పరుగులు చేసి అవుటైనా.. మరో ఓపెనర్ డెవాన్ కాన్వె 22, రచిన్ రవీంద్ర ఒక పరుగు చేసి నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను ముగించారు. అయితే.. ఇంత భారీ విజయం సాధించినా.. న్యూజిలాండ్‌కు ఏ మాత్రం ఉపయోగం లేదు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆఫ్ఘనిస్థాన్, వెస్టిండీస్ చేతుల్లో ఓడిన కివీస్ టోర్నీ నుంచి ఆల్రెడీ నిష్క్రమించింది. మరి ఉగాండపై న్యూజిలాండ్ సాధించిన విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
New Zealand get their first points on the board at #T20WorldCup 2024 with a big win over Uganda 👏
📝 #NZvUGA: https://t.co/FZ3U2sS7Np pic.twitter.com/QwtdozW47j
— ICC (@ICC) June 15, 2024