SNP
SNP
టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా పేరు ప్రస్తుతం మారుమోగిపోతుంది. అతను ప్రస్తుతం టీమిండియాలో లేకపోయినా.. అతనే టాక్ ఆఫ్ ది ఇండియన్ క్రికెట్ టౌన్‌గా ఉన్నాడు. ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో భాగంగా జరుగుతున్న మెట్రో బ్యాంక్ వన్డే కప్‌లో నార్తాంప్టన్‌షైర్-సోమర్‌సెట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా సంచలన ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. కేవలం 153 బంతుల్లోనే 28 ఫోర్లు, 11 సిక్సులతో 244 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు పృథ్వీ షా అలాగే టీమిండియాలోకి తిరిగి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది.
అయితే.. పృథ్వీ షా ఆడిన సంచలన ఇన్నింగ్స్ గురించే అంతా మాట్లాడుకుంటుంటే.. కొంతమంది మాత్రం పృథ్వీ షాపై బాడీ షేమింగ్‌కు దిగారు. ‘బట్ట, పొట్టతో ఉన్న ఈ క్రికెటర్ ఎవరూ’ అంటూ కొంతమంది తమ కుసంస్కారాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రదర్శించారు. 23 ఏళ్ల యువ క్రికెటర్ ఏంటి ఇలా లావుగా, బట్టతలతో ఉన్నాడంటూ హేళగా కామెంట్ల చేశారు. అయితే ఇలాంటి వారికి భారత క్రికెట్ అభిమానులు, కొంతమంది నెటిజన్లు గట్టిగా బుద్ధి చెప్పారు. టాలెంట్‌ను చూడకుండా బాడీ షేమింగ్‌కు దిగుతున్నందకు సిగ్గుపడాలని ఘాటుగానే బుదులిచ్చారు.
తన వెకిల్ పోస్టులకు తీవ్ర వ్యతిరేకత రావడంతో కొంతమంది తమ తప్పు తెలుసుకుని, పృథ్వీ షా గురించి అలా మాట్లాడినందుకు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. అయితే.. పృథ్వీ షా కొట్టిన సంచలన డబుల్ సెంచరీ తర్వాత.. అతనికి తిరిగి టీమిండియాలోకి తలుపులు తెరుచుకున్నాయని పలువురు క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్న వన్డే వరల్డ్ కప్ కోసం టీమిండియాలో ప్లేస్ కోసం పృథ్వీ షా రేస్‌లోకి వచ్చాడని కూడా క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. షా ఆడిన ఇన్నింగ్స్ గురించి పక్కనపెడితే.. అతనిపై వచ్చిన బాడీ షేమింగ్ కామెంట్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
I realize my mistake after people’s responses.
This pic is Prithvi Shaw’s who lost his mother at the age of 4.
Which makes my post extremely insensitive and not something I am proud of.In an attempt to invoke my mom’s natural reaction to my fitness levels in my 20s, I… https://t.co/j99adWLKIY
— Ankur Warikoo (@warikoo) August 10, 2023
ఇదీ చదవండి: VIDEO: క్యాచ్ మిస్ అయ్యాడు.. వెంటనే సూపర్‌గా రియాక్ట్ అయ్యాడు!