iDreamPost

VIDEO: క్యాచ్‌ మిస్‌ అయ్యాడు.. వెంటనే సూపర్‌గా రియాక్ట్‌ అయ్యాడు!

  • Published Aug 11, 2023 | 1:22 PMUpdated Aug 11, 2023 | 1:22 PM
  • Published Aug 11, 2023 | 1:22 PMUpdated Aug 11, 2023 | 1:22 PM
VIDEO: క్యాచ్‌ మిస్‌ అయ్యాడు.. వెంటనే సూపర్‌గా రియాక్ట్‌ అయ్యాడు!

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ది హండ్రెడ్ టోర్నీలో ఓ క్యాచ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గురువారం బర్మింగ్‌హాం ఫోనిక్స్-వెల్ష్ ఫైర్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో వెటరన్ ఆల్‌రౌండర్ రోలాఫ్ వాన్ డర్ మెర్వ్ పట్టిన క్యాచ్‌ ముందుగా చాలా సింపుల్‌ క్యాచ్‌లా అనిపించినా.. అది కాస్త మిస్‌ అయింది. అయితే దాన్ని మళ్లీ ఎంతో అద్భుతంగా, వేగంగా రియాక్ట్‌ అయి క్యాచ్‌ పూర్తి చేశాడు. అయితే.. ఆ మధ్యలో జరిగిన గందరగోళం చూస్తే.. కచ్చితంగా ఆ క్యాచ్‌ మిస్‌ అయి ఉండాల్సిందే అని ఎవరైనా అనుకుంటారు. కానీ, రోలాఫ్‌ క్యాచ్‌ పూర్తి చేయడంతో అంతా ఆశ్చర్యపోయారు. మిస్‌ అయ్యే క్యాచ్‌ చాలా లక్కీగా మళ్లీ అందుకున్నాడంటూ ఫ్యాన్స్‌ అంటున్నారు.

బర్మింగ్‌హాం ఫోనిక్స్ కెప్టెన్‌ మొయిన్‌ అలీ, వెల్ష్‌ ఫైర్‌ బౌలర్‌ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ డేవిడ్ పేన్ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. దీంతో లాంగాన్ దిశలో భారీ ఎత్తుకు లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న వాన్ డర్ మెర్వ్ వేగంగా పరిగెత్తుకొచ్చి ఆ క్యాచ్ అందుకునేందుకు ప్రయత్నించాడు. అయితే బాగా ఎత్తుగా వెళ్లిన ఆ బంతి.. అతని చేతుల్లో పడి నిలువలేదు.. బౌన్స్‌ అయి అతని ఛాతీపై పడి ముందుకు వెళ్లిపోయింది. ఈ సమయంలో చాలా వేగంగా కదిలిన వాన్ డర్ బంతి నేలకు తాకకముందే ఒంటిచేత్తో క్యాచ్ పూర్తి చేశాడు. చూసేందుకు ఆ క్యాచ్‌ నమ్మశక్యంగా లేదని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు.

వాన్‌ డర్‌తో పాటు మిగతా ఫీల్డర్లు సైతం అద్భుతంగా ఫీల్డింగ్‌ చేయడంతో ఫోనిక్స్‌ జట్టు 100 బంతుల్లో 7 వికెట్లు కోల్పోయి 112 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని వెల్ష్ ఫైర్ జట్టు కేవలం 85 బంతుల్లోనే నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మరి ఈ మ్యాచ్‌లో వాన్‌ డర్‌ పట్టిన క్యాచ్‌ మాత్రం మ్యాచ్‌ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. మరి ఆ క్యాచ్‌కు సంబంధించిన వీడియో కింద ఉంది. ఆ వీడియో చూసి.. ఆ క్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ప్రపంచ క్రికెట్‌లో ఈ రికార్డ్‌ మరే క్రికెటర్‌కు లేదు! పృథ్వీ షా ఒక్కడే ఘనుడు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి