iDreamPost
android-app
ios-app

IND vs ENG: సౌతాఫ్రికా సిరీస్ లో చేసిన తప్పే.. టీమిండియా ఇంగ్లాండ్ పై చేస్తోందా?

  • Published Jan 13, 2024 | 8:43 AM Updated Updated Jan 13, 2024 | 8:43 AM

ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు జట్టు ప్రకటన తర్వాత.. సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ లో చేసిన తప్పే ఇంగ్లాండ్ పై భారత్ చేస్తోందా? అంటే అవుననే అంటున్నారు క్రీడా పండితులు. మరి ఇంతకీ టీమిండియా చేస్తున్న ఆ తప్పు ఏంటి?

ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు జట్టు ప్రకటన తర్వాత.. సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ లో చేసిన తప్పే ఇంగ్లాండ్ పై భారత్ చేస్తోందా? అంటే అవుననే అంటున్నారు క్రీడా పండితులు. మరి ఇంతకీ టీమిండియా చేస్తున్న ఆ తప్పు ఏంటి?

IND vs ENG: సౌతాఫ్రికా సిరీస్ లో చేసిన తప్పే.. టీమిండియా ఇంగ్లాండ్ పై చేస్తోందా?

టీమిండియా-ఇంగ్లాండ్ మధ్య జనవరి 25 నుంచి ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-25లో భాగంగా జరగనున్న ఈ కీలక టోర్నీకి బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది. 16 మంది సభ్యులతో.. సరికొత్త ప్రయోగం చేస్తోంది. అయితే తొలి రెండు మ్యాచ్ లకు మాత్రమే జట్టును ప్రకటించింది మేనేజ్ మెంట్. రోహిత్ శర్మ కెప్టెన్, జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. ఇదిలా ఉండగా.. జట్టు ప్రకటన తర్వాత సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ లో చేసిన తప్పే ఇంగ్లాండ్ పై భారత్ చేస్తోందా? అంటే అవుననే అంటున్నారు క్రీడా పండితులు. మరి ఇంతకీ టీమిండియా చేస్తున్న ఆ తప్పు ఏంటి? ఓసారి పరిశీలిద్దాం పదండి.

ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కోసం ఎవరిని ఎంపిక చేస్తారు? అన్న ఆసక్తి అందరిలో ఉంది. బీసీసీఐ సరికొత్త ప్రయోగాలు చేస్తుందా? లేక నార్మల్ గానే వెళ్లిపోతుందా? అన్న అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో 16 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే తొలి రెండు టెస్ట్ లకు మాత్రమే టీమ్ ను ప్రకటించింది మేనేజ్ మెంట్. ఇక జట్టు కూర్పులో పెద్దగా షాకింగ్ విషయాలు లేవనే చెప్పాలి. 22 ఏళ్ల వికెట్ కీపర్ ధృవ్ జురెల్ ఎంపిక అందరిని ఆశ్చర్యపరిచింది.

is team india doing another mistake

ఇదంతా కొద్దిసేపు పక్కనపెడితే.. ఇటీవల సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ లో చేసిన తప్పునే టీమిండియా మరోసారి చేస్తోంది. సఫారీ గడ్డపై రెండు టెస్ట్ మ్యాచ్ ల పోరులో.. సరికొత్త చరిత్ర సృష్టించే అవకాశాన్ని వదులుకుంది. దాంతో సిరీస్ ను 1-1తో సమం చేసుకుని సగం సంతోషంతో ఇండియాకు తిరిగి వచ్చింది. ఇక ఈ సిరీస్ లో టీమిండియా ఓ తప్పు చేసిందని దిగ్గజ క్రికెటర్లతో పాటుగా చాలా మంది క్రికెట్ అభిమానులు చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆ తప్పు ఏంటంటే? సఫారీ సిరీస్ కు సీనియర్ టెస్ట్ బ్యాటర్లు అయిన చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే లను తీసుకోకపోవడమే. ఇప్పుడు ఇదే తప్పు ఇంగ్లాండ్ తో సిరీస్ లో కూడా చేస్తోంది.

ముఖ్యంగా పుజారాకు ఇంగ్లాండ్ జట్టు బౌలర్లు ఎదుర్కొవడంలో అపార అనుభవం ఉంది. అక్కడి కౌంటీ మ్యాచ్ లు ఎక్కువ ఆడటం, ప్లేయర్ల బౌలింగ్ ను అంచనా వేయడంలో పుజారా సిద్దహస్తుడు. అదీకాక తాజాగా జరుగుతున్న రంజీ ట్రోఫీలో జార్ఖండ్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. తన శతకంతో సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. అయినా గానీ అతడిని పక్కన పెట్టడం ఆశ్చర్యం కలిగించింది. ఇక రహానే సైతం మంచి టెస్ట్ బ్యాటర్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. చాలా సందర్భాల్లో అతడు జట్టుకు సేవియర్ గా నిలిచాడు. జట్టు పరిస్థితులకు తగ్గట్లుగా ఆడటంలో వీరిద్దరు సిద్దహస్తులే. అలాంటిది వీరిని తీసుకోకుండా టీమిండియా మరో తప్పు చేస్తుందని సోషల్ మీడియా వేదికగా క్రీడా పండితులు, అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. జేమ్స్ అండర్సన్, మార్క్ వుడ్ లాంటి బౌలర్లను ఎదుర్కొవడం అంత సులభమైన విషయం కాదని వారు చెప్పుకొస్తున్నారు. మరి పుజారా, రహానేలను ఇంగ్లాండ్ తో సిరీస్ కు ఎంపిక చేయకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.