వరల్డ్ కప్ 2023.. మరికొన్ని రోజుల్లో ఈ విశ్వ సమరానికి తెరలేవనుంది. దీంతో టోర్నీలో పాల్గొనే అన్ని జట్లు తమ తమ టీమ్స్ ను ప్రకటిస్తూ వస్తున్నాయి. కాగా.. ఇటీవలే ఆస్ట్రేలియా కూడా 15 మందితో కూడిన ప్రపంచ కప్ జట్టును ప్రకటించింది. ఇక వరల్డ్ కప్ లో పాల్గొనే పసికూన జట్లు సైతం ఒక్కొక్కటిగా తమ టీమ్స్ ను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నీకి తమ జట్టును ప్రకటించింది నెదర్లాండ్స్ టీమ్. 15 మంది సభ్యులతో కూడిన జట్టులో విజయవాడ కుర్రాడికి కూడా చోటు దక్కింది. కీలక మ్యాచ్ లో సెంచరీతో చెలరేగాడు ఆంధ్రా మూలాలు ఉన్న తేజ నిడమనూరు.
అనిల్ తేజ నిడమనూరు.. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో పుట్టి న్యూజిలాండ్ లో పెరిగి.. అంతర్జాతీయ క్రికెట్ లో నెదర్లాండ్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అద్భుతమైన ప్రదర్శనతో నెదర్లాండ్స్ జట్టులో తేజ కీలక ఆటగాడిగా మారిపోయాడు. ఈ క్రమంలోనే తాజాగా నెదర్లాండ్స్ తన వన్డే ప్రపంచ కప్ 2023 టీమ్ ను ప్రకటించింది. 15 మంది సభ్యులతో వరల్డ్ కప్ లో పాల్గొనబోయే సభ్యుల పేర్లను గురువారం వెల్లడించింది. ఇద్దరు రిజర్వ్ ప్లేయర్లను కూడా ఎంపిక చేసింది. కాగా.. ఈ జట్టులో తెలుగు మూలాలు ఉన్న తేజ నిడమనూరుకు కూడా చోటు దక్కడం విశేషం.
ఇక వరల్డ్ కప్ కు అర్హత సాధించేందుకు తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో స్కాట్లాండ్ పై అనూహ్య రీతిలో నెగ్గింది నెదర్లాండ్స్ జట్టు. దీంతో ఐదోసారి వరల్డ్ కప్ లో అడుగుపెట్టబోతోంది. 2011 తర్వాత మళ్లీ భారత్ లోనే నెదర్లాండ్ జట్టు బరిలోకి దిగడం విశేషం. నెదర్లాండ్ జట్టును స్కాట్ ఎడ్వర్డ్స్ నడిపించనున్నాడు. కాగా.. నెదర్లాండ్స్ తన తొలి మ్యాచ్ ను పాకిస్థాన్ తో తలపడనుంది. హైదరాబాద్ లో ఈ మ్యాచ్ జరుగుతుండగా.. నవంబర్ 11న టీమిండియాతో నెదర్లాండ్స్ ఢీకొంటుంది. మరి డచ్ టీమ్ లో తెలుగు మూలాలు ఉన్న కుర్రాడికి చోటు దక్కడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Netherlands have unveiled their 15-member squad for the highly anticipated ODI World Cup 2023. pic.twitter.com/X6DKl9oL3f
— CricTracker (@Cricketracker) September 7, 2023