iDreamPost
android-app
ios-app

తండ్రి కాబోతున్న టీమిండియా స్టార్ క్రికెటర్ ఇషాంత్ శర్మ! పోస్ట్ వైరల్..

  • Author Soma Sekhar Updated - 02:47 PM, Sat - 9 December 23

2021లో తన చివరి మ్యాచ్ ఆడిన ఈ సీనియర్ పేసర్ కెరీర్ ఇక దాదాపుగా ముగిసినట్లే. దీంతో అతడి అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.

2021లో తన చివరి మ్యాచ్ ఆడిన ఈ సీనియర్ పేసర్ కెరీర్ ఇక దాదాపుగా ముగిసినట్లే. దీంతో అతడి అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.

  • Author Soma Sekhar Updated - 02:47 PM, Sat - 9 December 23
తండ్రి కాబోతున్న టీమిండియా స్టార్ క్రికెటర్ ఇషాంత్ శర్మ! పోస్ట్ వైరల్..

టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ దాదాపు రెండు సంవత్సరాలుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. 2021లో తన చివరి మ్యాచ్ ఆడిన ఈ సీనియర్ పేసర్ కెరీర్ ఇక దాదాపుగా ముగిసినట్లే. దీంతో అతడి అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ చెప్పాడు ఇషాంత్ శర్మ. త్వరలోనే తాను తండ్రి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. తన భార్య ప్రతిమా సింగ్ సీమంతం ఫొటోలను ఢిల్లీ క్యాపిటల్స్ తన సోషల్ మీడియాలో పంచుకుంది. త్వరలోనే మా ఢిల్లీ క్యాపిటల్స్ లోకి ఓ కొత్త వ్యక్తి చేరబోతున్నారు అంటూ పోస్ట్ లో రాసుకొచ్చింది.

జస్ప్రీత్ బుమ్రా ఇటీవలే తండ్రైన విషయం తెలిసిందే. తాజాగా మరో టీమిండియా ఫాస్ట్ బౌలర్ తండ్రి కాబోతున్నాడన్న వార్త వైరల్ గా మారింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇషాన్ కిషన్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. తన భార్య ప్రతిమా సింగ్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో.. తాజాగా ఆమెకు సీమంతం నిర్వహించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల సమక్షంలో సీమంతం వేడుకును నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఢిల్లీ క్యాపిటల్స్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

దాంతో ఈ ఫొటోలు కాస్త వైరల్ గా మారడంతో.. క్రికెట్ అభిమానులు, సహచరులు ఇషాంత్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా.. 2016లో ప్రతిమాతో ఇషాంత్ విహహం జరిగింది. ప్రతిమా సింగ్ కూడా ఆటలకు సంబంధించిన ఆవిడే కావడం గమనార్హం. ఆమె ఇండియన్ బాస్కెట్ బాల్ టీమ్ తరపున వివిధ టోర్నీల్లో పాల్గొంది. ఇక ఇషాంత్ కెరీర్ విషయానికి వస్తే.. 105 టెస్ట్ మ్యాచ్ ల్లో 311 వికెట్లు, 80 వన్డేల్లో 115 వికెట్లు, 14 టీ20ల్లో 8 వికెట్లు తీశాడు.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibomimajbet girişrobinbetjojobet giriştürk pornoMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişJojobetjojobetgrandpashabetcasibomcasibomjojobetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabet