వరల్డ్ కప్ 2023లో మరో సంచలనం నమోదు అయ్యింది. ఈ సంచలనానికి నాంది పలికింది పసికూన ఆఫ్ఘాన్ అయితే.. ఆ సంప్రదాయాన్ని కొనసాగించి, పెద్ద జట్టు అయిన సౌతాఫ్రికాకు షాకిచ్చింది మరో పసికూన నెదర్లాండ్స్. ప్రపంచ కప్ లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన చిన్న టీమ్స్.. అసాధారణ ప్రదర్శనతో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన జట్లను కంగుతినిపిస్తున్నాయి. మెున్న డిఫెండింగ్ ఛాంపియన్ ను చిత్తు చేసిన ఆఫ్ఘాన్ విజయం గురించి మర్చిపోకముందే.. మరో సంచలనం నమోదు అయ్యింది. భీకరఫామ్ లో ఉన్న సఫారీ జట్టును మట్టికరిపించింది డచ్ టీమ్. సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకున్న నెదర్లాండ్స్ 38 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను మట్టికరిపించింది.
అంచనాలకు తగ్గట్లుగా, ఏకపక్షంగా సాగిపోతున్న వరల్డ్ కప్ కు తొలి సంచలనాన్ని రుచి చూపింది పసికూన ఆఫ్ఘాన్. జగజ్జేతకు ఇంగ్లాండ్ కు షాకిస్తూ.. ప్రపంచ కప్ లో సంచలనానికి నాంది పలికింది. ఇక ఈ విజయం గురించి క్రికెట్ ప్రేమికులు మరచిపోకముందే.. మరో సంచలనం నమోదు అయ్యింది. ఈసారి భీకరఫామ్ లో ఉన్న సౌతాఫ్రికా టీమ్ కు భారీ షాకిచ్చింది నెదర్లాండ్స్ జట్టు. మంగళవారం ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 38 పరుగుల తేడాతో విజయం సాధించింది డచ్ టీమ్. వర్షం కారణంగా మ్యాచ్ ను 43 ఓవర్లకు కుదించగా.. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 43 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 245 పరుగులు చేసింది.
జట్టులో స్కాట్ ఎడ్వర్డ్స్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ.. 69 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్స్ తో 78 రన్స్ తో అజేయంగా నిలిచాడు. మిగతా బ్యాటర్ల నుంచి ఏ మాత్రం సహకారం లేకున్నా.. మెుక్కవోని దీక్షతో అతడు బ్యాటింగ్ సాగించిన తీరు అమోఘం. ఒకదశలో డచ్ టీమ్ 34 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 141 పరుగులే చేసింది. కానీ అనంతరం గొప్పగా పుంజుకుని చివరి 9 ఓవర్లలో 104 పరుగులు చేయడం విశేషం. ఎడ్వర్డ్స్ కు అండగా వాండర్ మోర్వ్(29), ఆర్యన్ దత్(23*) నిలవడంలో ఈ స్కోర్ సాధించగలిగింది.
అనంతరం సులువైన లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టుకు సమష్టిగా షాకిచ్చారు డచ్ బౌలర్లు. ప్రతర్థి బౌలర్ల దెబ్బకు 89 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి ఓటమిని నిర్ణయించుకుంది. డేవిడ్ మిల్లర్(43) కేశవ్ మహరాజ్(40) రాణించినప్పటికీ జట్టుకు మాత్రం విజయాన్ని అందించలేకపోయారు. జట్టులో గత మ్యాచ్ ల్లో సెంచరీ హీరో డికాక్(20) నిరాశపరచగా.. సారథి బవుమా(16) తన ఫూర్ ఫామ్ ను కొనసాగించాడు. చివరికి 42.5 ఓవర్లకు 207 పరుగులకు ఆలౌట్ అయ్యి.. 38 పరుగులతో ఓటమిపాలైంది సఫారీ టీమ్. డచ్ బౌలర్లలో వాన్ బీక్ 3, వాండెర్ మోర్వ్, పాల్ మెకెరన్, బాస్ డి లీడ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. మరి సఫారీ టీమ్ కు షాకిచ్చిన పసికూన నెదర్లాండ్స్ టీమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
One of the greatest ICC Men’s Cricket World Cup upsets of all time in Dharamsala as Netherlands overcome South Africa 🎇#SAvNED 📝: https://t.co/gLgies5ZBv pic.twitter.com/KcbZ10qdAG
— ICC Cricket World Cup (@cricketworldcup) October 17, 2023