PAK vs NED: మరోసారి తప్పు చేసిన అంపైర్లు.. ఈసారి ఏం చేశారంటే?

  • Author Soma Sekhar Published - 08:59 AM, Sat - 7 October 23
  • Author Soma Sekhar Published - 08:59 AM, Sat - 7 October 23
PAK vs NED: మరోసారి తప్పు చేసిన అంపైర్లు.. ఈసారి ఏం చేశారంటే?

గత కొంతకాలంగా అంపైర్లు తప్పుల మీద తప్పులు చేస్తూ వస్తున్నారు. ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్ లకు అంపైర్లుగా చేసిన అనుభవం ఉన్నాగానీ.. వారు తప్పులు చేస్తూనే వస్తున్నారు. అయితే కొన్ని రిఫరీలు చేసే కొన్ని తప్పులు మ్యాచ్ ఫలితాన్ని శాసించకపోవచ్చు. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో వారు చేసే చిన్న చిన్న తప్పిదాలే జట్టు విజయావకాశాలను దెబ్బతీస్తాయి. ఇలాంటి సంఘటనలు మనం చరిత్రలో ఎన్నో చూశాం. తాజాగా మరోసారి అంపైర్లు తప్పు చేశారు. వరల్డ్ కప్ లో భాగంగా పాక్-నెదర్లాండ్స్ మ్యాచ్ లో రిఫరీలుగా వ్యవహరించారు అడ్రియన్ హోల్డ్ స్టాక్, క్రిస్ బ్రౌన్.

వరల్డ్ కప్ లో భాగంగా శుక్రవారం పాకిస్థాన్-నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాక్ 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో మరోసారి తప్పిదం చేశారు అంపైర్లు. గత కొంతకాలంగా అంపైర్లు క్రికెట్ మ్యాచ్ ల్లో చేస్తున్న తప్పిదాల గురించి మనం వింటూనే ఉన్నాం. తాజాగా మరోసారి అంపైర్లు పొరపాటు చేశారు. ఈ పొరపాటు పాక్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేయడానికి వచ్చాడు పాల్ వాన్ మెకెరెన్. క్రీజ్ లో రిజ్వాన్-సౌద్ షకీల్ ఉన్నారు. ఇక ఈ ఓవర్లో తొలి మూడు బంతులకు రిజ్వాన్ పరుగులేమీ చేయలేదు. నాలుగో బంతిని సింగిల్ తీసి షకీల్ కు బ్యాటింగ్ ఇచ్చాడు. ఐదో బంతిని షకీల్ బౌండరీకి తరలించగా.. పొరపడిన అంపైర్ ఓవర్ పూర్తి అయినట్లుగా ప్రకటించాడు. ఇద్దరు అంపైర్లు ఈ తప్పును గుర్తించలేదు. దీంతో పాక్ ఓ బంతిని నష్టపోయినప్పటికీ.. దాన్ని వల్ల ఎలాంటి నష్టం కలగలేదు.

ఇక ఈ విషయం తెలిసిన క్రికెట్ ఫ్యాన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. గల్లి క్రికెట్ లో లాగ రాళ్లు పట్టుకుని లెక్క పెట్టండని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. వరల్డ్ కప్ లాంటి టోర్నీలో ఇలాంటి తప్పులు ఏంటి? భయ్యా అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. అంపైర్లు బాల్స్ ను ఇలా తక్కువ, ఎక్కువ గా లెక్కపెట్టడం ఇదే మెుదటిసారి కాదు. గతంలో చాలా మ్యాచ్ ల్లో అంపైర్లు ఈ విధంగా తప్పులు చేశారు. మరి అంపైర్లు గత కొంతకాలంగా చేస్తున్న తప్పులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments