iDreamPost

PAK vs NED: హరీస్ రౌఫ్ ఓవరాక్షన్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన డచ్ ప్లేయర్!

  • Author Soma Sekhar Published - 07:50 AM, Sat - 7 October 23
  • Author Soma Sekhar Published - 07:50 AM, Sat - 7 October 23
PAK vs NED: హరీస్ రౌఫ్ ఓవరాక్షన్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన డచ్ ప్లేయర్!

వరల్డ్ కప్ 2023 అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కు కివీస్ షాకివ్వగా.. రెండో మ్యాచ్ లో పాక్ ను ఓడించినంత పని చేసింది నెదర్లాండ్స్ టీమ్. ఇక ఇలాంటి మెగాటోర్నీలనగానే బ్యాటర్ల విధ్వంసాలు, బౌలర్ల మెరుపులతో పాటు ఆటగాళ్ల కవ్వింపులకు ఏ మాత్రం డోకా ఉండదు. ఇలాంటి కవ్వింపులే పాక్-నెదర్లాండ్స్ మ్యాచ్ లో చేశాడు పాక్ స్టార్ పేసర్ హరీస్ రౌఫ్. డచ్ చివరి బ్యాటర్ అయిన పాల్ వాన్ మెకెరెన్ ను తన బాల్ తో కవ్వించాడు. దీనికి ఎపిక్ రిప్లై ఇచ్చి రౌఫ్ పొగరుదించాడు డచ్ ప్లేయర్. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్ లో పాక్-నెదర్లాండ్స్ టీమ్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో పాక్ 81 పరుగుల తేడాతో పసికూనను ఓడించింది. ఇక ఈ మ్యాచ్ లో మరోసారి తన ఓవరాక్షన్ చూపాడు పాక్ బౌలర్ హరీస్ రౌఫ్. డచ్ బౌలర్ బ్యాటింగ్ కు దిగిన వేళ కవ్వింపు చర్యలు చేశాడు. రౌఫ్ ఓవరాక్షన్ కు ఎపిక్ రిప్లే ఇచ్చాడు డచ్ బౌలర్ పాల్ వాన్ మెకెరెన్. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ 39వ ఓవర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఓవర్ లో 4వ బంతిని రౌఫ్ వేయగా.. అది బౌన్సర్ అనుకుని కిందికి వంగాడు.

అనంతరం బ్యాటర్ దగ్గరికి వచ్చి ఏదో పిచ్చి వాగుడు వాగాడు. దీనికి రౌఫ్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు డచ్ ప్లేయర్. తర్వాత బంతిని అద్భుతమైన షాట్ తో బౌండరీకి తరలించాడు. దీంతో రౌఫ్ కు తగిన బుద్ది చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో రౌఫ్ పై మండిపడుతున్నారు నెటిజన్లు. నువ్వు ఇంక మారవా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జట్టులో రిజ్వాన్(68), సౌద్ షకీల్(68) పరుగులతో రాణించారు. అనంతరం 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 41 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో 81 పరుగులతో జట్టు ఓటమిపాలైంది. జట్టులో బాస్ డీ లీడే ఒక్కడే 67 పరుగులతో రాణించాడు.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి