iDreamPost
android-app
ios-app

గొప్ప మనసు చాటుకున్న BCCI.. నేపాలీ క్రికెటర్లకు ప్రత్యేక సన్మానం!

  • Author singhj Published - 02:48 PM, Tue - 5 September 23
  • Author singhj Published - 02:48 PM, Tue - 5 September 23
గొప్ప మనసు చాటుకున్న BCCI.. నేపాలీ క్రికెటర్లకు ప్రత్యేక సన్మానం!

ఆసియా కప్​-2023లో పసికూన నేపాల్​తో జరిగిన మ్యాచ్​లో భారత్ విజయం సాధించింది. దాయాది పాకిస్థాన్​తో మ్యాచ్​ను రద్దు చేయించిన వరుణుడు.. నేపాల్​తో మ్యాచ్​కూ ఆటంకం కలిగించాడు. అయినా మ్యాచ్​లో మాత్రం రిజల్ట్ వచ్చింది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన నేపాల్ అద్భుతంగా ఆడింది. ఆ జట్టు ఓపెనర్లు ఆసిఫ్ షేక్ (58), కుశాల్ బుర్టేల్ (38) భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. వీళ్లిద్దరూ క్రీజు వదిలి ముందుకొచ్చి మరీ బౌండరీలు, సిక్సులు కొడుతూ టీమిండియా బౌలర్లను కంగారు పెట్టారు. ఆఖర్లో సోంపాల్ కామి (48) కూడా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో నేపాల్ 230 పరుగులు చేసింది.

భారత బ్యాటింగ్​కు వరుణుడు పలుమార్లు అడ్డు తగలడంతో డక్​వర్త్ లూయిస్ పద్ధతిలో టార్గెట్​ను 23 ఓవర్లలో 145గా నిర్ణయించారు. ఈ లక్ష్యాన్ని టీమిండియా వికెట్లేమీ కోల్పోకుండా 20.1 ఓవర్లలో ఛేదించింది. పాక్​పై ఫెయిలైన భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (74 నాటౌట్), శుబ్​మన్ గిల్ (67 నాటౌట్) ఈసారి మాత్రం అదరగొట్టారు. ఈ గెలుపుతో సూపర్-4లో మరోమారు దాయాది పాక్​తో పోరుకు భారత్ అర్హత సాధించింది. ఇదిలా ఉంటే.. నేపాల్​తో మ్యాచ్​ను టీమిండియా కాస్త లైట్​గా తీసుకున్నట్లు అనిపించింది. నేపాల్ ఇన్నింగ్స్​లో మొదట్లో ఫీల్డర్లు పలు క్యాచులు జారవిడవం చర్చనీయాంశంగా మారింది.

టీమిండియాతో మ్యాచ్​ను నేపాల్ మాత్రం సీరియస్​గా తీసుకుంది. అందుకు ఆ జట్టు బ్యాటర్లు ఆసిఫ్ షేక్, బుర్టేల్, సోంపాల్​ల ఆటతీరును ఉదాహరణగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఆసిఫ్​, బుర్టేల్​లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. బౌలింగ్​లోనూ నేపాల్ తమవంతుగా ప్రయత్నించింది. టీమిండియాకు గట్టిపోటీని ఇచ్చినందుకు నేపాల్​ క్రికెటర్లను బీసీసీఐ సత్కరించింది. మంచి మనసు చాటుకున్న భారత క్రికెట్ బోర్డు.. మ్యాచ్ తర్వాత నేపాల్ ప్లేయర్లను సన్మానించింది. నేపాల్ ఆటగాళ్ల ప్రదర్శనకు గౌరవంగా వారికి.. భారత్ కోచ్ ద్రావిడ్​తో పాటు కోహ్లీ, హార్దిక్ పాండ్యా తదితరులు మెడల్స్ అందించారు. దీంతో బీసీసీఐపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇదీ చదవండి: వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI