నేపాల్.. క్రికెట్ లో పసికూనే కానీ.. క్రికెట్ ను ఆదరించే విషయంలో మాత్రం ప్రపంచ దేశాలకు కంటే ఎంతో ముందుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారడంతో.. క్రికెట్ అంటే ఇంత పిచ్చా? ఇండియన్ ఫ్యాన్స్ కంటే పిచ్చిగా ఉన్నారేంట్రా మీరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
నేపాల్.. క్రికెట్ లో పసికూనే కానీ.. క్రికెట్ ను ఆదరించే విషయంలో మాత్రం ప్రపంచ దేశాలకు కంటే ఎంతో ముందుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారడంతో.. క్రికెట్ అంటే ఇంత పిచ్చా? ఇండియన్ ఫ్యాన్స్ కంటే పిచ్చిగా ఉన్నారేంట్రా మీరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
క్రికెట్ ను ఆరాధించే దేశాలలో ముందు వరుసలో ఉంటుంది భారత్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇండియాలో ఎక్కడ మ్యాచ్ లో జరిగినా గానీ.. స్టేడియాలు కిటకిటలాడుతాయి. అయితే భారత్ కు పోటీగా మరో దేశం.. తమకు క్రికెట్ పై అలాగే తమ దేశ జట్టుపై ఉన్న ప్రేమను సందర్భం చిక్కినప్పుడల్లా వెల్లడిస్తూనే ఉంది. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. క్రికెట్ అంటే ఇంత పిచ్చా? అని షాక్ అవుతున్నారు చూసిన వారంతా. ఇంతకీ ఆ దేశం ఏదో కాదు.. మన పక్కనే ఉండే నేపాల్. క్రికెట్ లో ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న నేపాల్ జట్టుకు అండగా ఉంటున్నారు ఆ దేశ ప్రజలు.
నేపాల్.. క్రికెట్ లో పసికూనే కానీ.. క్రికెట్ ను ఆదరించే విషయంలో మాత్రం ప్రపంచ దేశాలకు కంటే ఎంతో ముందుంది. సాధారణంగా క్రికెట్ అనగానే ముందుగా ఇండియన్ ఫ్యాన్సే గుర్తుకు వస్తారు. అయితే గత కొంతకాలంగా భారత్ కు ధీటూగా క్రికెట్ ను ప్రేమిస్తూ.. ముందుకెళ్తోంది నేపాల్. తాజాగా జరుగుతున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ క్వాలిఫైయర్స్ టోర్నీలో భాగంగా శుక్రవారం యూఏఈతో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో నేపాల్ జయభేరి మోగించింది. దీంతో టీ20 వరల్డ్ కప్ కు క్వాలిఫై అయ్యింది నేపాల్ టీమ్. ఖాట్మాండ్ లోని మాల్పని మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ కు అభిమానులు పోటెత్తారు. గ్రౌండ్ నిండటంతో.. మైదానాని ఆనుకుని ఉన్న భవనాలపై కూర్చుని, నిల్చుని మరీ తమ దేశ ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. ఇసుక వేస్తే రాలనంత జనం ఈ మ్యాచ్ ను చూడ్డానికి వచ్చారు.
అయితే నేపాల్ ప్రేక్షకులు ఇలా క్రికెట్ మ్యాచ్ లు చూడ్డం ఇదే మెుదటిసారి కాదు.. గతంలో నేపాల్ ఆడే అన్ని మ్యాచ్ లను గ్రౌండ్ కు ఆనుకుని ఉన్న చెట్లపై, భవనాలపై నుంచి చూస్తూ.. నేపాల్ ప్లేయర్లకు అండగా నినాదాలు చేశారు. తాజాగా మరోసారి తమ దేశంపై ఉన్న ప్రేమను ఇలా వ్యక్తం చేస్తూ వస్తున్నారు ఫ్యాన్స్. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారడంతో.. క్రికెట్ అంటే ఇంత పిచ్చా? ఇండియన్ ఫ్యాన్స్ కంటే ఎక్కువగా ఉన్నారేంట్రా మీరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అభిమానానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం ఉంటుంది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తూ వచ్చారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. జట్టులో వికెట్ కీపర్ అరవింద్ 64 పరుగులతో రాణించాడు. అనంతరం నేపాల్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 17 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. నేపాల్ ప్లేయర్ అసిఫ్ షేక్ 64 రన్స్ తో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. మరి నేపాల్ ఫ్యాన్స్ క్రికెట్ పై చూపిస్తున్న ప్రేమపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
We are into the World Cup. Yeah!! Let’s cheer. We waited for 10 years and now this gonna fulfill our dream of the World Cup. Hats off to all Nepali men’s cricket team and huge respect to coach Monti Desai.#NepalCricket #nepalvsuae #jayanepal#intotheworldcup#WorldCup2024 pic.twitter.com/MGHA7dSZ5S
— देव simkhada. (@sujandevsimkha2) November 3, 2023