ఆసియా గేమ్స్-2023 గత శనివారం చైనాలోని హాంగ్జౌ వేదికగా గ్రాండ్‌గా ఆరంభమయ్యాయి. ఈ ప్రతిష్టాత్మక క్రీడలకు డ్రాగన్ కంట్రీ ఆతిథ్యం ఇస్తోంది. ఈ టోర్నమెంట్లో ఈసారి క్రికెట్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. మెన్స్‌తో పాటు విమెన్ క్రికెట్ టీమ్స్ కూడా టోర్నీలో ఆడటం విశేషమనే చెప్పాలి. అంతేగాక క్రికెట్లో పలు అరుదైన రికార్డులు ఆసియా గేమ్స్‌లో నమోదవుతున్నాయి. నేపాల్-మంగోలియాకు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 3 రికార్డులు బద్దలయ్యాయి. అందులో ఒకటి టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ. ఈ మ్యాచ్‌లో నేపాల్ బ్యాటర్ కుశాల్ మల్లా సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 34 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. మొత్తంగా 50 బంతులు ఆడిన అతడు.. 137 రన్స్ చేశాడు.
కుశాల్ మల్లా ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 12 సిక్సులు ఉన్నాయి. దీన్ని బట్టే అతడి బ్యాటింగ్ ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ టీ20 ఫార్మాట్లో తక్కువ బంతుల్లోనే వంద పరుగుల మార్క్‌ను అందుకొని చరిత్ర సృష్టించాడు. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో సెంచరీ) పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డును కుశాల్ మల్లా బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో అతడితో పాటు మరో బ్యాటర్ దీపేంద్ర సింగ్ ఆరీ (10 బంతుల్లో 52 పరుగులు) కూడా చెలరేగి ఆడాడు.
దీపేంద్ర సింగ్ ఆరీ మంగోలియా బౌలర్లను ఉతికి ఆరేశాడు. 9 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కును చేరుకున్న అతడు.. టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును బ్రేక్ చేశాడు. కుశాల్ మల్లా, దీపేంద్రలు బ్యాటుతో విధ్వంసం సృష్టించడంతో నేపాల్ 314 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే ఛేజింగ్‌లో మంగోలియా కేవలం 41 రన్స్‌కే కుప్పకూలింది. దీంతో టీ20 క్రికెట్లో నేపాల్ చరిత్ర సృష్టిస్తూ.. ఏకంగా 273 రన్స్ భారీ తేడాతో విక్టరీ కొట్టింది. నేపాల్-మంగోలియా మ్యాచ్‌లో నమోదైన రికార్డులను చూస్తే.. 34 బంతుల్లోనే సెంచరీ, 9 బంతుల్లో ఫిఫ్టీ, వరుసగా 6 సిక్సులు, టీ20 క్రికెట్ హిస్టరీలో హయ్యెస్ట్ స్కోరు, పొట్టి ఫార్మాట్లో భారీ విజయం నమోదయ్యాయి. మరి.. ఈ మ్యాచ్‌లో నేపాల్ పెర్ఫార్మెన్స్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రోహిత్, కోహ్లీ కాదు.. ఈ వరల్డ్ కప్‌లో అతడే టాప్ స్కోరర్: డివిలియర్స్
Records created by Nepal today in Asian Games in T20I history:
– First team ever to score 300 runs.
– Kushal Malla scored the fastest ever T20I hundred: 34 balls.
– Dipendra Singh scored the fastest ever T20I fifty: 9 balls. pic.twitter.com/oV0rQYRh6R
— Johns. (@CricCrazyJohns) September 27, 2023