SNP
SNP
మన బళ్లెం వీరుడు నీరజ్ చోప్రా మరో కొత్త చరిత్ర సృష్టించాడు. 2020లో టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలిచి దేశంగా గర్వపడేలా చేసిన నీరజ్.. తాజాగా వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి గోల్డ్ మెడల్ సాధించాడు. హంగేరిలోని బుడాపెస్ట్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్‌లో 88.17 మీటర్లు జావిలిన్ విసిరి పసిడి పతకం గెలిచాడు. ఈ మెడల్‌తో వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడిగా నీరజ్ కొత్త చరిత్ర లిఖించాడు.
ఈ టోర్నీ క్వాలిఫయర్స్‌లో తొలి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 88.77 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌కు అర్హత సాధించిన నీరజ్ చోప్రా.. ఫైనల్లో తొలి ప్రయత్నంలో విఫలమైనా.. రెండో ప్రయత్నంలో జావిలిన్‌ను 88.17 మీటర్లు, మూడో సారి 86.32 మీటర్లు, నాలుగో సారి 84.64 మీటర్లు, ఐదో సారి 87.73 మీటర్లు, ఆరో సారి 83.98 మీటర్లు విసిరాడు. అత్యుత్తమంగా 88.17 మీటర్లతో టాప్ పేస్‌లో నిలిచి గోల్డ్ మెడల్ సాధించాడు. గత వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ రజతంతోనే సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. కానీ ఆ సారి బంగారు పతకం సాధించాడు.
ఇక నీరజ్‌తో పాటు ఫైనల్లో పోటీపడ్డ ఇతర భారత అథ్లెట్స్ కిషోర్ జెనా 84.77 మీటర్లతో ఐదో స్థానంలో, డీపీ మను 84.14 మీటర్లతో ఆరోస్థానంలో నిలిచారు. పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ 87.82 మీటర్లు విసిరి సిల్వర్ మెడల్ సాధించాడు. చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకబ్ వడ్లెచ్ 86.67 మీటర్ల విసిరి బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నాడు. ఒలింపిక్ మెడల్ సాధించి ఇప్పటికే.. భారత కీర్తిని పతాక స్థాయికి తీసుకెళ్లిన నీరజ్ చోప్రా.. ఇప్పుడు వరల్డ్ అథ్లెట్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారత అథ్లెట్‌గా నిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Neeraj Chopra is the GOAT 🇮🇳
First Indian to win a Gold Medal in the World Athletics Championships….!!!!!!pic.twitter.com/SyE0TtzDsX
— Johns. (@CricCrazyJohns) August 27, 2023
3 Indians in the Top 6 list.
Neeraj Chopra securing the Gold! pic.twitter.com/M3Dl4XnhsC
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 27, 2023
ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిలు! తొలి గోల్డ్ మెడల్ మనదే