iDreamPost

చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిలు! తొలి గోల్డ్‌ మెడల్‌ మనదే

  • Published Aug 27, 2023 | 5:39 PMUpdated Dec 11, 2023 | 11:31 AM

మొట్టమొదటి గోల్డ్‌ మెడల్‌ సాధించింది. అంధుల క్రికెట్ వరల్డ్ కప్‌లో భారత అమ్మాయిల జట్టు గోల్డ్ మెడల్ గెలిచింది. దీంతో భారత అమ్మాయిలు క్రికెట్ జట్టుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ గేమ్స్ 2023లో అద్భుతంగా రాణించిన మన అమ్మాయిలు ఫైనల్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి గోల్డ్ మెడల్ తమ ఖాతాలో వేసుకున్నారు.

టీమిండియా చరిత్ర సృష్టించింది. దేశం గర్వపడేలా.. మొట్టమొదటి గోల్డ్‌ మెడల్‌ సాధించింది. అంధుల క్రికెట్ వరల్డ్ కప్‌లో భారత అమ్మాయిల జట్టు గోల్డ్ మెడల్ గెలిచింది. దీంతో భారత అమ్మాయిలు క్రికెట్ జట్టుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ గేమ్స్ 2023లో అద్భుతంగా రాణించిన మన అమ్మాయిలు ఫైనల్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి గోల్డ్ మెడల్ తమ ఖాతాలో వేసుకున్నారు.

వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో డీఎల్ఎస్ విధానంలో భారత అమ్మాయిలు నెగ్గారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను టీమిండియా అద్భుతంగా కట్టడి చేసింది. భారత బౌలర్ల ధాటికి ఆసీస్ అమ్మాయిలు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 114 పరుగులకే పరిమితం అయ్యారు. ఈ స్వల్ప టార్గెట్‌ను ఛేదించే క్రమంలో వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. చివరకు టీమిండియా ముందు 42 పరుగుల టార్గెట్ ఛేదించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ టార్గెట్‌ను కేవలం 3.3 ఓవర్లలోనే భారత్‌ ఛేదించి ఘన విజయం సాధించి బంగారు పథకం సాధించింది. ఈ అద్భుత విజయం తర్వాత భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత మహిళల జట్టును సోషల్‌ మీడియా వేదికగా అభినందించారు. మరి అమ్మాయిల జట్టు తొలి గోల్డ్‌ మెడల్‌ సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: VIDEO: బుల్లెట్‌లా దూసుకొచ్చిన బంతి.. తగిలితే హెల్మెట్‌ ఎగిరిపడింది!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి