iDreamPost
android-app
ios-app

సక్సెస్ సీక్రెట్ చెప్పిన కోహ్లీ.. అది వింటే తన రోమాలు నిక్కబొడుచుకుంటాయంటూ..!

  • Author Soma Sekhar Published - 04:50 PM, Mon - 6 November 23

విరాట్ తన సక్సెస్ సీక్రెట్ ఏంటో రివీల్ చేశాడు. ఆ శక్తే నన్ను నడిపిస్తోందని, గ్రౌండ్ లో అది వింటే నా రోమాలు నిక్కబొడుచుకుంటాయని చెప్పుకొచ్చాడు. మరి విరాట్ ను అంతలా ప్రేరేపించిన శక్తి ఏంటో ఇప్పుడు చూద్దాం.

విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం వరల్డ్ కప్ లో మారుమ్రోగుతున్న పేరు. తన వరల్డ్ క్లాస్ ఆటతీరుతో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ.. దూసుకెళ్తున్నాడు రన్ మెషిన్ కింగ్ కోహ్లీ. ఇక ఇంతలా బ్యాటింగ్ లో రెచ్చిపోతున్న విరాట్ తన సక్సెస్ సీక్రెట్ ఏంటో రివీల్ చేశాడు. ఆ శక్తే నన్ను నడిపిస్తోందని, గ్రౌండ్ లో అది వింటే నా రోమాలు నిక్కబొడుచుకుంటాయని చెప్పుకొచ్చాడు విరాట్ భాయ్. మరి విరాట్ ను అంతలా ప్రేరేపించిన శక్తి ఏంటో ఇప్పుడు చూద్దాం.
వరల్డ్ కప్ లో అత్యద్భుతమైన ఆటతీరుతో దూసుకెళ్తున్నాడు టీమిండియా రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ. తాజాగా జరిగిన సౌతాఫ్రికా మ్యాచ్ లో 49వ సెంచరీ సాధించి.. క్రికెట్ దేవుడు సచిన్ రికార్డును సమం చేశాడు. ఇక ఈ వరల్డ్ కప్ లో ఇప్పటికే 543 పరుగులు చేసి టాప్ స్కోరర్స్ లిస్ట్ లో దూసుకెళ్తున్నాడు. ఇక తన సక్సెస్ ఫుల్ బ్యాటింగ్ కు కారణం అయిన సీక్రెట్ ఏంటో చెప్పుకొచ్చాడు విరాట్ భాయ్. తాజాగా స్టార్ స్పోర్ట్స్ తో విరాట్ మాట్లాడుతూ..
“నేను బ్యాటింగ్ చేస్తుంటే గ్రౌండ్ లో జాతీయ గీతం వినిపిస్తే చాలు.. అది నాలో ఎంతో శక్తిని నింపుతుంది. జాతీయ గీతం వింటే నాకు గూస్ బమ్స్ వస్తాయి. నన్ను ఆ శక్తే నడిపిస్తోంది” అంటూ తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేశాడు కింగ్ విరాట్ కోహ్లీ. కాగా.. కోహ్లీ గ్రౌండ్ లోకి అడుగుపెడితే.. స్టేడియం మెుత్తం అతడి పేరుతో మారుమ్రోగిపోతుంది. ఇక అదే టైమ్ లో జాతీయ గీతం వింటే తనలో శక్తి రెట్టింపు అవుతుందని, ఆ శక్తే తనను ఇంతలా ప్రేరేపిస్తుందని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు విరాట్ కోహ్లీ. మరి కోహ్లీ చెప్పిన సక్సెస్ సీక్రెట్ పై మీ అభిప్రాయాను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.