భారత జట్టు ఫైనల్లో ఓడిపోవడానికి కారణం అద్భుత ఫామ్ లో ఉన్న మహ్మద్ షమీ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు ఇంగ్లాండ్ దిగ్గజ ప్లేయర్ నాసిర్ హుస్సేన్.
భారత జట్టు ఫైనల్లో ఓడిపోవడానికి కారణం అద్భుత ఫామ్ లో ఉన్న మహ్మద్ షమీ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు ఇంగ్లాండ్ దిగ్గజ ప్లేయర్ నాసిర్ హుస్సేన్.
వరల్డ్ కప్ 2023లో టీమిండియా వరుస విజయాలతో ఫైనల్ కు దూసుకొచ్చింది. కానీ.. టైటిల్ పోరులో బోల్తాపడి ప్రపంచ కప్ ను కంగారూల చేతిలో పెట్టింది. ఇక ఈ పరాజయంతో యావత్ భారతదేశం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక ఈ ఓటమికి కారణాలు వెతికే పనిలో పడ్డారు వరల్డ్ వైడ్ గా ఉన్న దిగ్గజ క్రికెటర్లు. ఈ క్రమంలోనే టీమిండియా పరాజయానికి కారణాలను వెల్లడిస్తూ వస్తున్నారు. మెరుగైన పిచ్ ను తయ్యారు చేసుకుంటే టీమిండియా విజయం సాధించేదని పాక్ దిగ్గజ బౌలర్ షోయబ్ అక్తర్ చెప్పుకురాగా.. భారత జట్టు ఫైనల్లో ఓడిపోవడానికి కారణం అద్భుత ఫామ్ లో ఉన్న మహ్మద్ షమీ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు ఇంగ్లాండ్ దిగ్గజ ప్లేయర్ నాసిర్ హుస్సేన్.
మహ్మద్ షమీ.. తాజాగా జరిగిన వరల్డ్ కప్ లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు. తన అద్భుతమైన బౌలింగ్ తో జట్టును ఫైనల్ వరకూ చేర్చాడు. కానీ టీమిండియా కలను మాత్రం నెరవేర్చలేకపోయాడు. ఈ మెగాటోర్నీలో రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు సాగాడు ఈ స్పీడ్ స్టర్. అయితే ఫైనల్లో మాత్రం తన జోరును కొనసాగించలేకపోయాడు. దీంతో భారత జట్టు ఓటమిచవిచూడక తప్పలేదు. కాగా.. టీమిండియా ఫైనల్లో ఓడిపోవడానికి కారణం మహ్మద్ షమీ అని షాకింగ్ కామెంట్స్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ లెజెండ్ నాసిర్ హుస్సేన్. అతడు మాట్లాడుతూ..
“టీమిండియా ఈ మెగాటోర్నీలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. కానీ జట్టులో ఉన్న నలుగురు బౌలర్లు ఏ మాత్రం బ్యాటింగ్ చేయలేని వాళ్లు. ఇది టీమ్ కు పెద్ద సమస్య. దీంతో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో బౌలర్లలో బ్యాటింగ్ చేసే ప్లేయర్లు లేకపోవడంతో.. కోహ్లీ, రాహుల్ జోడీ నెమ్మదిగా ఆడాల్సి వచ్చింది. ఇక 8వ స్థానంలో మహ్మద్ షమీ బ్యాటింగ్ కు వస్తాడని, అతడికి సరిగ్గా ఆడటం రాదనే ఉద్దేశంతోనే వారిద్దరు నెమ్మదిగా ఆడారు. ఒక విధంగా టీమిండియా ఓటమికి కారణం షమీనే” అంటూ చెప్పుకొచ్చాడు ఈ ఇంగ్లాండ్ దిగ్గజం. షమీ కూడా ధాటిగా బ్యాటింగ్ చేయగలిగితే.. కోహ్లీ, రాహుల్ కూడా ఫాస్ట్ గా ఆడేవాళ్లు. అప్పుడు ఆసీస్ ముందు మరింత పెద్ద లక్ష్యం ఉండేదని నాసిర్ హుస్సేన్ అభిప్రాయపడ్డాడు. మరి ఇంగ్లాండ్ మాజీ లెజెండ్ షమీపై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.