Somesekhar
Yashasvi Jaiswal: యశస్వీ జైస్వాల్ బజ్ బాల్ ఆటతీరులో మాకూ క్రెడిట్ ఇవ్వాలన్న ఇంగ్లాండ్ ప్లేయర్ కు ఆ జట్టు మాజీ కెప్టెన్ చురకలు అంటించాడు. జైస్వాల్ కు మీరేం నేర్పలేదని, వీలైతే అతడి నుంచి మీరే నేర్చుకోవాలని కౌంటర్ ఇచ్చాడు.
Yashasvi Jaiswal: యశస్వీ జైస్వాల్ బజ్ బాల్ ఆటతీరులో మాకూ క్రెడిట్ ఇవ్వాలన్న ఇంగ్లాండ్ ప్లేయర్ కు ఆ జట్టు మాజీ కెప్టెన్ చురకలు అంటించాడు. జైస్వాల్ కు మీరేం నేర్పలేదని, వీలైతే అతడి నుంచి మీరే నేర్చుకోవాలని కౌంటర్ ఇచ్చాడు.
Somesekhar
టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వీ జైస్వాల్ అసలైన బజ్ బాల్ ను ఇంగ్లాండ్ జట్టుకు చూపిస్తున్నాడు. వరుస మ్యాచ్ ల్లో డబుల్ సెంచరీలతో టీమ్ విజయాలు అందించడమే కాకుండా.. డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ ను మించి బౌలర్లను దడదడలాడిస్తున్నాడు. టెస్ట్ క్రికెట్ ను కాస్త టీ20లా ఆడుతూ.. అసలైన బజ్ బాల్ అంటే ఏంటో చూపించి, వణికించాడు. అయితే జైస్వాల్ అలా ఆడటంలో క్రెడిట్ మాదే అని ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ బెన్ డకెట్ కొన్ని కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై తాజాగా కౌంటర్ ఇచ్చాడు వారి దేశానికే చెందిన మాజీ కెప్టెన్ నాజిర్ హుస్సేన్. మీరేం జైస్వాల్ కు నేర్పించలేదు అంటూ డకెట్ కు చురకలంటించాడు.
“ఇతర టీమ్స్ కంటే భిన్నంగా మా ప్రత్యర్థులు టెస్ట్ క్రికెట్ ఆడుతుంటే(బజ్ బాల్).. వారి ఆటలో కొంత క్రెడిట్ మాకు ఇవ్వాల్సిందే” అంటూ మూడో టెస్ట్ మధ్యలో టీమిండియా యువ సంచలనం యశస్వీ జైస్వాల్ సెంచరీ చేసిన తర్వాత మాట్లాడుకొచ్చాడు ఇంగ్లాండ్ ప్లేయర్ బెన్ డకెట్. అయితే ఈ వ్యాఖ్యలు అతిగా అనిపించడంతో.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడా దిగ్గజలు డకెట్ కు చురకలు అంటించారు. తాజాగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజిర్ హుస్సేన్ సైతం ఈ లిస్ట్ లో చేరాడు. డకెట్ కామెంట్స్ పై కాస్త ఘాటుగానే స్పందించాడు.
“యశస్వీ బ్యాటింగ్ పై బెన్ డకెట్ చేసిన కామెంట్స్ చూస్తుంటే.. జైస్వాల్ ఇంగ్లాండ్ నుంచే దూకుడైన ఆట నేర్చుకున్నాడనే అర్థం వస్తోంది. అయితే ఈ వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను. అతడికి మీరేమీ నేర్పలేదు. లైఫ్ లో ఎదురైన కష్టనష్టాల నుంచి అతడెంతో నేర్చుకున్నాడు. పైగా ఐపీఎల్ టోర్నీ ద్వారా మరింతగా రాటుదేలాడు. బజ్ బాల్ అంటూ ఊరికే డబ్బా కొట్టుకోకుండా.. విమర్శలకు ఇంగ్లాండ్ మరింత దూరంగా ఉండాలి. వీలైతే జైస్వాల్ నుంచి మీరు నేర్చుకోండి” అంటూ చురకలు అంటించాడు నాజిర్ హుస్సేన్. మరి సొంత టీమ్ ఆటగాడికే మాజీ కెప్టెన్ కౌంటర్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదికూడా చదవండి: వీడియో: గ్రౌండ్లోకి దూసుకొచ్చిన ఎద్దు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని..!