iDreamPost

వీడియో: గ్రౌండ్​లోకి దూసుకొచ్చిన ఎద్దు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని..!

  • Published Feb 20, 2024 | 12:44 PMUpdated Feb 20, 2024 | 12:44 PM

క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న గ్రౌండ్​లోకి ఓ ఎద్దు దూసుకొచ్చింది. అది విధ్వంసం సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న గ్రౌండ్​లోకి ఓ ఎద్దు దూసుకొచ్చింది. అది విధ్వంసం సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Published Feb 20, 2024 | 12:44 PMUpdated Feb 20, 2024 | 12:44 PM
వీడియో: గ్రౌండ్​లోకి దూసుకొచ్చిన ఎద్దు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని..!

క్రికెట్​ ఫీల్డ్​లో అనూహ్య ఘటనలు చోటుచేసుకోవడం చూస్తూనే ఉంటాం. అప్పుడప్పుడూ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలోనూ తెగ వైర​ల్ అవుతుంటాయి. ఆటగాళ్లకు బంతులు తగలడం, ఫీల్డింగ్ లేదా బౌలింగ్ టైమ్​లో గాయాలపాలవడం లాంటి వీడియోలు ఎక్కువ వైరల్ అవుతాయి. అదే టైమ్​లో గ్రౌండ్​లోకి ఏవైనా జంతువులు వచ్చి మ్యాచ్ ఆగిన వీడియోలు, ఫొటోలు కూడా నెట్టింట హల్​చల్​ చేస్తుంటాయి. తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్​ మీడియాను షేక్ చేస్తోంది. దీన్ని చూసిన నెటిజన్స్ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటివి జరగడం మామూలేనని అంటున్నారు. కానీ ఆ ఎద్దు ఏదో పగబట్టిన తీరులో ఆటగాళ్లను వెంటపడి మరీ భయపెట్టడం ఎప్పుడూ చూడలేదని కామెంట్స్ చేస్తున్నారు. గ్రౌండ్​లోకి ఎద్దు దూసుకొచ్చిన ఘటన గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న ఒక మైదానంలోకి రెండు ఎడ్లు దూసుకొచ్చాయి. అందులో ఒకటి అందరికీ దూరంగా వేరే వైపు నుంచి సైలెంట్​గా వెళ్లిపోయింది. అయితే మరొకటి మాత్రం ఏకంగా పిచ్​ మీదకు దూసుకొచ్చింది. అప్పటికే ఒక వైపు నుంచి కొందరు ఆడియెన్స్ మ్యాచ్​ను తిలకిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు పెవిలియన్​లో బ్యాటింగ్ టీమ్, టోర్నీ నిర్వాహకులు కూర్చున్నారు. మైదానంలో బౌలింగ్​ టీమ్​తో పాటు ఇద్దరు బ్యాటర్లు, అంపైర్లు ఉన్నారు. మ్యాచ్ సీరియస్​గా జరుగుతుండగా ఒక ఎద్దు ఎంట్రీ ఇచ్చింది. దాన్ని చూసి ఆఫ్ సైడ్ ఫీల్డింగ్ చేస్తున్న క్రికెటర్ భయపడి పరుగు అందుకున్నాడు. అతడు ఎలాగోలా దాని నుంచి తప్పించుకున్నాడు. దీంతో అది వెంటనే పిచ్​ పైకి దూసుకొచ్చింది.

ఎద్దు పిచ్​ మీదకు రాగానే అక్కడ ఉన్న బ్యాటర్, అంపైర్, బౌలర్ పరుగు అందుకున్నారు. బ్యాట్స్​మన్ వెంట పడిందా ఎద్దు. అతడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్యాట్​తో దాన్ని అదిలిస్తూ తప్పించుకున్నాడు. ఆ తర్వాత బౌలర్​ను వెంటాడిందా ఎద్దు. వేగంగా పరిగెత్తుతూ అతడ్ని సమీపించింది. కానీ అతడు కూడా ఎలాగోలా దాని బారి నుంచి బయటపడ్డాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎద్దు వల్ల మ్యాచ్ చాలా సేపు ఆగిపోయింది. అది గ్రౌండ్​లో ఉన్నంత సేపు రెండు జట్ల ఆటగాళ్లు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకున్నారు. అది వెళ్లిపోయినా వాళ్లు తేరుకునేందుకు చాలా టైమ్ పట్టింది. ఇదెక్కడ జరిగిందో తెలియదు గానీ ఎద్దు వల్ల మ్యాచ్ ఆగిపోయిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి.. క్రికెట్ మ్యాచ్​లో ఎద్దు విధ్వంసం సృష్టించిన ఘటనపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఒక శకం ముగిసింది.. రిటైర్మెంట్ ప్రకటించిన డొమెస్టిక్ లెజెండ్స్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి