SNP
SNP
ప్రపంచంలోని క్రికెట్ అభిమానులంతా వరల్డ్ కప్ ఫీవర్‌తో ఊగిపోతున్నారు. రేపటి నుంచి భారత్ వేదికగా ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్ కప్ 2023 ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, 2019 రన్నరప్ న్యూజిలాండ్ జట్ల మధ్య గురువారం అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్‌తో వరల్డ్ కప్ మహా సంగ్రామం ప్రారంభం కానుంది. వరల్డ్ కప్ కోసం ఇప్పటికే అన్ని జట్లు సంసిద్ధంగా ఉన్నాయి. రెండేసి ప్రాక్టీస్ మ్యాచ్‌లు సైతం ఆడేసి.. అసలు సిసలు సమరానికి రెడీగా ఉన్నాయి. అయితే.. వరల్డ్ కప్ టీమ్స్‌లో ఉండాల్సిన కొంతమంది ఆటగాళ్లు.. గాయాల కారణంగా టోర్నీకి దూరమైన విషయం తెలిసిందే. టీమిండియా నుంచి అక్షర్ పటేల్ వరల్డ్ కప్ కోసం ఎంపికై కూడా దురదృష్టవశాత్తు గాయం కారణంగా టోర్నీకి దూరం అయ్యాడు.
అలాగే.. పాకిస్థాన్ టీమ్ నుంచి యువ స్టార్ పేసర్ నసీమ్ షా సైతం గాయం కారణంగా వరల్డ్ కప్ టోర్నీకి దూరం అయ్యాడు. షాహీన్ షా అఫ్రిదీ, హరీస్ రౌఫ్, నసీమ్ షాలతో కూడిన పాక్ పేస్ ఎటాక్ దుర్బేధ్యంగా ఉండేది కానీ, నసీమ్ షా గైర్హాజరీతో పాక్ పేస్ బలం కాస్త తగ్గిందనే చెప్పాలి. కాగా, గాయం కారణంగా పాక్ టీమ్‌కు దూరమైన నసీమ్ షా ప్రస్తుతం తన గాయానికి చికిత్స తీసుకుంటున్నాడు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో ఉన్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. తాను కోలుకుంటున్నట్లు నసీమ్ షా ఓ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భారత్‌లో జరిగే వరల్డ్ కప్ ఆడాల్సిన క్రికెటర్.. ఇలా ఆస్పత్రి బెడ్‌పై పడిఉన్నాడంటూ చాలా మంది క్రికెట్ అభిమానులు నసీమ్ షాపై జాలీ చూపిస్తున్నారు. త్వరగా కోలుకోవాలి ఛాంపియన్ ప్లేయర్ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు. అయితే.. నసీమ్ షా గాయం కారణంగా దూరం కావడంతో అతని స్థానంలో సీనియర్ బౌలర్ హసన్ అలీని జట్టులోకి తీసకున్నారు పాకిస్థాన్ సెలెక్టర్లు. కాగా.. ఈ వరల్డ్ కప్‌లో భాగంగా అక్టోబర్ 14న ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. వరల్డ్ కప్ మ్యాచ్‌లతో పాటు భారత్-పాక్ మ్యాచ్ కోసం సైతం క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి నసీమ్ షా ఆస్పత్రిలో చికిత్ర పొందుతుండటం, వరల్డ్ కప్‌కు దూరం కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Alhamdulillah, I’m recovering well. Your prayers and well wishes have been my strength. Thank you all for your support. 🙏 pic.twitter.com/1oQUgU2KdT
— Naseem Shah (@iNaseemShah) October 4, 2023
ఇదీ చదవండి: KBCలో క్రికెట్‌పై రూ.25 లక్షల ప్రశ్న! ఆన్సర్ క్రికెట్ లవర్స్‌కూ తెలియదు!