iDreamPost
android-app
ios-app

Narayan Jagadeesan: KKR వద్దని గెంటేసింది.. కట్ చేస్తే వరుసగా రెండు డబుల్ సెంచరీలతో కోహ్లీ రికార్డు సమం!

  • Published Jan 27, 2024 | 8:39 PM Updated Updated Jan 27, 2024 | 8:39 PM

ఐపీఎల్ 2024 వేలానికంటే ముందు ఓ ప్లేయర్ ను కేకేఆర్ వదులుకుంది. ఇప్పుడు ఆ ప్లేయరే రంజీల్లో దుమ్మురేపుతున్నాడు. వరుసగా రెండు డబుల్ సెంచరీలు చేసి.. ఏకంగా విరాట్ కోహ్లీ రికార్డునే సమం చేశాడు.

ఐపీఎల్ 2024 వేలానికంటే ముందు ఓ ప్లేయర్ ను కేకేఆర్ వదులుకుంది. ఇప్పుడు ఆ ప్లేయరే రంజీల్లో దుమ్మురేపుతున్నాడు. వరుసగా రెండు డబుల్ సెంచరీలు చేసి.. ఏకంగా విరాట్ కోహ్లీ రికార్డునే సమం చేశాడు.

Narayan Jagadeesan: KKR వద్దని గెంటేసింది.. కట్ చేస్తే వరుసగా రెండు డబుల్ సెంచరీలతో కోహ్లీ రికార్డు సమం!

టీమిండియా యువ క్రికెటర్లు రంజీ ట్రోఫీ 2024 సీజన్ లో దుమ్మురేపుతున్నారు. అద్బుతమైన బ్యాటింగ్ తో అదరగొడుతూ.. రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతున్నారు. తాజాగా కూడా ఓ రికార్డు నమోదైంది. ఓ యువ బ్యాటర్ వరుసగా రెండు డబుల్ సెంచరీలు బాది.. టీమిండియా రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ రికార్డును సమం చేసి.. అతడి సరసన చేరాడు. 2024 ఐపీఎల్ వేలానికి ముందు ఈ ప్లేయర్ ను కేకేఆర్ యాజమాన్యం వేలంలోకి విడుదల చేసింది. కానీ అమ్ముడుపోలేదు ఈ ఆటగాడు. దాంతో రెచ్చిపోయి ఆడుతున్నాడు. మరి ఆ ఆటగాడు ఎవరు? అతడు సాధించిన రికార్డు ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

తమిళనాడు కు చెందిన వికెట్ కీపర్ నారాయణ్ జదీషన్ తాజాగా జరుగుతున్న రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. వరుసగా రెండు డబుల్ సెంచరీలు సాధించి.. అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. చంఢీగడ్ తో జరుగుతున్న మ్యాచ్ లో అద్భుతమైన ట్రిపుల్ సెంచరీతో అదరగొట్టాడు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ.. 23 ఫోర్లు, 5 సిక్సర్లతో 321 పరుగులు చేశాడు దీంతో తమిళనాడు తమ ఫస్ట్ ఇన్నింగ్స్ ను 610/4 వద్ద డిక్లేర్ చేసింది. ఇది జగదీషన్ కు వరుసగా రెండో డబుల్ సెంచరీ. ఇటీవలే రైల్వేస్ తో జరిగిన మ్యాచ్ లో సైతం 245 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో అరుదైన రికార్డు సాధించిన బ్యాటర్ల జాబితాలోకి ఎక్కాడు ఈ యువ క్రికెటర్.

రంజీ క్రికెట్ చరిత్రలో వరుసగా రెండు డబుల్ సెంచరీలు సాధించిన 18వ ఇండియన్ ప్లేయర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ క్రమంలోనే టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. కోహ్లీ కూడా గతంలో రంజీల్లో వరుసగా రెండు ద్విశతకాలు బాది రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ లిస్ట్ లో మిలింద్ కుమార్, సర్ఫరాజ్ ఖాన్ లతో సమా మరికొందరు ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఇంతటి అద్భుతమైన ఆటగాడిని కేకేఆర్ టీమ్ వదులుకుంది. ఐపీఎల్ 2024 వేలానికంటే ముందు జగదీషన్ ను వదులుకుంది కేకేఆర్. అయితే వేలంలో చోటు దక్కించుకోలేకపోయాడు. గతంలో కేకేఆర్ తరఫున 6 మ్యాచ్ ల్లో 89 రన్స్ చేశాడు జగదీషన్. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కూడా ప్రాతినిథ్యం వహించాడు ఈ తమిళనాడు ప్లేయర్. మరి రంజీల్లో రెచ్చిపోతూ.. వరుసగా రెండు డబుల్ సెంచరీలు బాది, కోహ్లీ రికార్డు సమం చేసిన జగదీషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.