శ్రీలంక-బంగ్లాదేశ్ మ్యాచ్ లో ఓ అత్యద్భుతమైన క్యాచ్ నమోదు అయ్యింది. లంక ఓపెనర్ ను కళ్లు చెదిరే క్యాచ్ తో పెవిలియన్ కు పంపాడు 36 ఏళ్ల బంగ్లా కీపర్.
శ్రీలంక-బంగ్లాదేశ్ మ్యాచ్ లో ఓ అత్యద్భుతమైన క్యాచ్ నమోదు అయ్యింది. లంక ఓపెనర్ ను కళ్లు చెదిరే క్యాచ్ తో పెవిలియన్ కు పంపాడు 36 ఏళ్ల బంగ్లా కీపర్.
క్రికెట్ చరిత్రలో ఎన్నో అద్భుతమైన క్యాచ్ లు చూశాం. ఇక ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో సైతం ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ.. ఆటగాళ్లు పట్టిన క్యాచ్ లు చూస్తే ఔరా అనాల్సిందే. ఒకదానికి మించి మరో క్యాచ్ పడుతూ ప్లేయర్లు ఫ్యాన్స్ కు కనువిందు చేస్తున్నారు. తాజాగా వరల్డ్ కప్ లో భాగంగా జరుగుతున్న శ్రీలంక-బంగ్లాదేశ్ మ్యాచ్ లో ఓ అత్యద్భుతమైన క్యాచ్ నమోదు అయ్యింది. లంక ఓపెనర్ ను కళ్లు చెదిరే క్యాచ్ తో పెవిలియన్ కు పంపాడు 36 ఏళ్ల బంగ్లా కీపర్. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా.. శ్రీలంక-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లా టీమ్ లంకను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇక బ్యాటింగ్ కు దిగిన లంకకు తొలి ఓవర్ లోనే షాకిచ్చాడు బంగ్లా బౌలర్ ఇస్లాం. ఫస్ట్ ఓవర్ చివరి బంతికి ఓపెనర్ కుశాల్ పెరీరా(4)ను అవుట్ చేశాడు. పెరీరా ఇచ్చిన క్యాచ్ ను అత్యద్భుతంగా ఒంటిచేత్తో ఒడిసిపట్టుకున్నాడు బంగ్లా కీపర్ ముష్మిఫికర్ రహీమ్. ఫస్ట్ స్లిప్ ఫీల్డర్ వైపు వెళ్తున్న బాల్ ను.. గాలిలో పక్షిలా ఎగురుతూ కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్నాడు. దీంతో బిత్తర చూపులు చూస్తూ పెవిలియన్ వైపు వెళ్లాడు పెరీరా.
ఈ క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఏంటి బ్రో అలా ఎలా పట్టావ్ క్యాచ్, పక్షిలా ఎగురుతూ భలే పట్టావ్ అంటూ కితాబిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 45 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది శ్రీలంక. జట్టులో నిస్సాంక(41), సమరవిక్రమ(41) చరిత అసలంక 91 పరుగులు చేసి సెంచరీ వైపు దూసుకెళ్తున్నాడు. మరి బంగ్లా కీపర్ పట్టిన ఈ స్టన్నింగ్ క్యాచ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
What a outstanding catch from Bangladesh’s Mushfiqur Rahim! 👏#BANvSL #BANvsSL #SLvBAN #SLvsBAN #CWC23 #CWC2023pic.twitter.com/VwxIWHUXnu
— Fourth Umpire (@UmpireFourth) November 6, 2023