iDreamPost
android-app
ios-app

Mushfiqur Rahim: పాక్ ను ఓడించాక.. గొప్ప పని చేసిన ముష్ఫికర్ రహీమ్! బంగ్లా వరద బాధితులకు విరాళం!

  • Published Aug 26, 2024 | 8:30 AM Updated Updated Aug 26, 2024 | 8:30 AM

తొలి టెస్ట్ లో పాకిస్థాన్ ఓటమిని శాసించిన ముష్పికర్ రహీమ్, మ్యాచ్ అనంతరం ఓ గొప్ప పనిచేశాడు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంతకీ రహీమ్ ఏం చేశాడంటే?

తొలి టెస్ట్ లో పాకిస్థాన్ ఓటమిని శాసించిన ముష్పికర్ రహీమ్, మ్యాచ్ అనంతరం ఓ గొప్ప పనిచేశాడు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంతకీ రహీమ్ ఏం చేశాడంటే?

Mushfiqur Rahim: పాక్ ను ఓడించాక.. గొప్ప పని చేసిన ముష్ఫికర్ రహీమ్! బంగ్లా వరద బాధితులకు విరాళం!

రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కోసం బంగ్లాదేశ్ పాకిస్థాన్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సిరీస్ లో భాగంగా రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో 10 వికెట్ల తేడాతో చిరస్మరణీయమైన విజయాన్ని నమోదు చేసింది. ఇక పాకిస్థాన్ గడ్డపై పాక్ ను 10 వికెట్ల తేడాతో ఓడించిన తొలి జట్టుగా బంగ్లా అరుదైన రికార్డును లిఖించింది. ఇక ఈ విజయంలో బంగ్లా స్టార్ బ్యాటర్ ముష్పికర్ రహీమ్ కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్ లో 191 పరుగులతో భారీ శతకం సాధించాడు. కాగా.. మ్యాచ్ ముగిసిన తర్వాత తన గొప్ప మనసును చాటుకున్నాడు. అతడు ఏం చేశాడంటే?

ముష్ఫికర్ రహీమ్.. పాకిస్థాన్ ను వారి గడ్డపైనే 10 వికెట్ల తేడాతో మట్టికరిపించడంలో కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 565 పరుగుల భారీ స్కోర్ చేసిందంటే.. దానికి కారణం రహీమే. పాక్ బౌలర్లు ధీటుగా ఎదుర్కొంటూ 341 బంతుల్లో 22 ఫోర్లు, ఓ సిక్స్ తో 191 పరుగులు చేసి, కొద్దిలో డబుల్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. రహీమ్ మారథాన్ ఇన్నింగ్స్ కారణంగా బంగ్లా 117 పరుగుల కీలక ఆధిక్యాన్ని సంపాదించింది. ఇక పాకిస్థాన్ ఓటమిని ఒంటిచేత్తో శాసించిన రహీమ్.. మ్యాచ్ అనంతరం ఓ గొప్ప పనిచేశాడు. దాంతో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Rahim

పాకిస్థాన్ తో జరిగిన తొలి టెస్ట్ లో బంగ్లాదేశ్ చిరస్మరణీయ విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో భారీ సెంచరీతో చెలరేగి, బంగ్లా విక్టరీకి కారణం అయిన ముష్ఫికర్ రహీమ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అయితే.. ఈ అవార్డును అందుకున్న తర్వాత, తన గొప్ప మనసును చాటుకున్నాడు. తనకు వచ్చిన అవార్డు ప్రైజ్ మనీని బంగ్లాదేశ్ వరద బాధితులకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. “ఈ ప్రైజ్ మనీని నేను బంగ్లాదేశ్ వరద బాధితులకు విరాళంగా ఇస్తున్నాను. అలాగే దేశం విడిచిపెట్టి వెళ్లిన వారు కూడా మన దేశానికి వచ్చి సాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను” ప్లేయర్ ఆఫ్ ది అవార్డు అందుకునే క్రమంలో చెప్పుకొచ్చాడు. దాంతో రహీమ్ గొప్ప మనసుపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. మరి రహీమ్ చేసిన గొప్ప పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.