Musheer Khan: వీడియో: సెంచరీ బాదిన ముషీర్.. తాను కొట్టినంత సంతోషంలో సర్ఫరాజ్!

Musheer Khan, Duleep Trophy 2024, Sarfaraz Khan, IND B vs IND A: సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు, యంగ్ సెన్సేషన్ ముషీర్ ఖాన్ చెలరేగిపోయాడు. దులీప్ ట్రోఫీ ఓపెనర్​లో అతడు జూలు విదిల్చి ఆడాడు. సెలెక్టర్లు తన వైపు చూసేలా సెంచరీతో విధ్వంసం సృష్టించాడు.

Musheer Khan, Duleep Trophy 2024, Sarfaraz Khan, IND B vs IND A: సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు, యంగ్ సెన్సేషన్ ముషీర్ ఖాన్ చెలరేగిపోయాడు. దులీప్ ట్రోఫీ ఓపెనర్​లో అతడు జూలు విదిల్చి ఆడాడు. సెలెక్టర్లు తన వైపు చూసేలా సెంచరీతో విధ్వంసం సృష్టించాడు.

టీమిండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ చెలరేగిపోయాడు. అన్నలాగే భారత జట్టులోకి రావాలని చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న ఈ యువ కెరటం.. ఈ క్రమంలో దక్కిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. దులీప్ ట్రోఫీ-2024లోనూ ఈ యంగ్ బ్యాటర్ సత్తా చాటాడు. సూపర్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఇండియా-ఏతో జరుగుతున్న మ్యాచ్​లో ముషీర్ (227 బంతుల్లో 105 నాటౌట్) విజృంభించి ఆడాడు. అన్న సర్ఫరాజ్ సహా యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, రిషబ్ పంత్, నితీష్​ కుమార్ రెడ్డి వంటి స్టార్లంతా ఫెయిలైనా ముషీర్ మాత్రం ఒక ఎండ్​లో స్తంభంలా పాతుకుపోయాడు. అవతలి వైపు నుంచి సాయం లేకపోయినా తాను మాత్రం తగ్గేదేలే అంటూ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతడి సెంచరీని సర్ఫరాజ్ సెలబ్రేట్ చేసుకున్న తీరు ఇప్పుడు వైరల్ అవుతోంది.

ముషీర్ సెంచరీ మార్క్​ను అందుకోగానే సర్ఫరాజ్ సంతోషం పట్టలేకపోయాడు. ఒకవైపు గ్రౌండ్​లో ముషీర్ గాల్లోకి ఎగురుతూ, సాధించానంటూ గట్టిగా అరుస్తూ కనిపించాడు. మరోవైపు డ్రెస్సింగ్ రూమ్​లో ఉన్న సర్ఫరాజ్.. తమ్ముడి శతకం పూర్తవగానే రెండు చేతులు పైకి ఎత్తి చప్పట్లు కొడుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు. టీమ్ మొత్తం ఒకచోట ఉండగా.. సర్ఫరాజ్ కాస్త కిందకు దిగి తన తమ్ముడిలో మరింత జోష్ నింపాడు. తాను సెంచరీ కొట్టినంత సంతోషంలో ఎస్ ఎస్ అంటూ అరిచాడు. క్లాప్స్ కొడుతూ ముషీర్​ను ఎంకరేజ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్.. ముషీర్​ అన్నను మించిన వాడిలా ఉన్నాడని.. అతడి బ్యాటింగ్ అదిరిపోయిందని మెచ్చుకుంటున్నారు. తమ్ముడ్ని అన్న ఎంకరేజ్ చేసిన తీరు సూపర్ అని ప్రశంసిస్తున్నారు. అతడు ఇలాగే ఆడితే త్వరలో టీమిండియా తలుపులు బద్దలు కొట్టడం ఖాయమని అంటున్నారు.

ఇక, స్టార్ బ్యాటర్లంతా విఫలమైనా.. టెయిలెండర్ నవ్​దీప్ సైనీ (74 బంతుల్లో 29) సాయంతో ఇవాళ ముషీర్ చెలరేగిపోయాడు. ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, ఆవేశ్ ఖాన్, ఆకాశ్​ దీప్ లాంటి టీమిండియా స్టార్ల బౌలింగ్​ను చిత్తు చేశాడు. అడ్డదిడ్డంగా ఆడకుండా క్లాసికల్ షాట్లతో అలరించాడు. చెత్త బంతుల్ని బౌండరీకి తరలించిన ముషీర్.. మంచి బంతులకు రెస్పెక్ట్ ఇచ్చాడు. అలాగని ఫోర్లు, సిక్సులను నమ్ముకోకుండా స్ట్రైక్ రొటేషన్​కు ఇంపార్టెన్స్ ఇచ్చాడు. వికెట్లు పడుతున్నాయని చెప్పి హిట్టింగ్​కు వెళ్లలేదు. ఒక ఎండ్​ను కాపాడుకుంటూ మెళ్లిగా స్కోరు బోర్డును కదిలించాడు. సింగిల్స్, డబుల్స్​తో ఇన్నింగ్స్​ను ముందుకు తీసుకెళ్లాడు. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాక బౌలర్లను బాదిపారేశాడు. ఆవేశ్, కుల్దీప్ వంటి స్టార్లను ఏమాత్రం లెక్కచేయకుండా ఫోర్ల మీద ఫోర్లు కొట్టాడు. మొత్తంగా 10 బౌండరీలు, 2 సిక్సులు బాదాడతను. ప్రస్తుతం ఇండియా బీ 7 వికెట్లకు 202 పరుగులతో ఉంది. ముషీర్-సైనీ జోడీ ఎంతసేపు క్రీజులో ఉంటారనే దాని మీదే ఆ టీమ్ భారీ స్కోరు ఆశలు ఆధారపడి ఉన్నాయి. మరి.. ముషీర్ నాక్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Show comments