SNP
New Zealand, Afghanistan: ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు ఇండియాలో ల్యాండైపోయింది. అయితే.. మ్యాచ్ ఎవరితో.. ఏంటి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
New Zealand, Afghanistan: ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు ఇండియాలో ల్యాండైపోయింది. అయితే.. మ్యాచ్ ఎవరితో.. ఏంటి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు.. ఇండియాలో ల్యాండ్ అయిపోయింది. గురువారం ఉదయం ఢిల్లీలో దిగిన కివీస్ జట్టు.. అక్కడి నుంచి గ్రేటర్ నోయిడాకు పయనమైంది. ఈ నెల 9 నుంచి నోయిడా వేదికగా టెస్ట్ మ్యాచ్ ఆడనుంది న్యూజిలాండ్. అయితే.. ఆ టెస్ట్ మ్యాచ్ మనతోని కాదులేండి.. ఆఫ్ఘనిస్థాన్‌తో. అదేంటి.. మన దేశానికి వచ్చి.. టీమిండియాతో కాకుండా.. ఆఫ్ఘనిస్థాన్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడటం ఏంటి? పైగా ఐసీసీ ట్రోఫీ కూడా ఏం జరగడం లేదు కదా? అని అనుకోవచ్చు. కానీ, మీరు విన్నది నిజమే.. ఇండియాలోనే న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ టెస్ట్ మ్యాచ్.
ఇండియా చాలా కాలంగా ఆఫ్ఘనిస్థాన్‌కు సెకండ్ హోంగా ఉంది. క్రికెట్ విషయంలో బీసీసీఐ.. ఆఫ్ఘనిస్థాన్‌కు చాలా సాయం చేస్తున్న విషయం తెలిసిందే. ఆఫ్ఘాన్‌లో పరిస్థితి బాగా లేనప్పుడు.. ఆ దేశానికి విదేశీ టీమ్స్ రానప్పుడు.. మన దేశంలోనే ఆఫ్ఘాన్ మ్యాచ్‌లు నిర్వహించేలా చూస్తోంది బీసీసీఐ. ఇప్పుడు మళ్లీ.. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇండియాలో వేరే టీమ్‌తో మ్యాచ్‌లు ఆడనుంది ఆఫ్ఘనిస్థాన్. గ్రేటర్ నోయిడా ఒక విధంగా ఆఫ్ఘాన్‌కు హోమ్ గ్రౌండ్‌గా భావించవచ్చు. ఇక్కడే చాలా మ్యాచ్‌లు ఆడింది ఆఫ్ఘాన్ టీమ్. ఇప్పుడు ఈ నెల 9 నుంచి న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు రెడీ అయింది.
ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం.. న్యూజిలాండ్ జట్టు ఈ రోజు ఇండియాకి వచ్చింది. ఆఫ్ఘాన్ మాత్రం కొన్ని రోజుల ముందుగానే నోయిడాకు చేరుకుని.. ప్రాక్టీస్ మొదలుపెట్టింది. వర్షం కారణంగా.. తొలి రోజు ప్రాక్టీస్ చేయలేకపోయింది ఆఫ్ఘాన్ జట్టు. ఆ సమయంలో.. ఆఫ్ఘాన్ ఆటగాళ్లు అసహనం వ్యక్తం చేశారు. ఇంత భారీ వర్షం వస్తే సరైన జాగ్రత్తలు తీసుకోలేదని, గ్రౌండ్ మొత్తం నీళ్లు నిలిచిపోయాయని, అందులో తాము ఈత కూడా కొట్టొచ్చని అన్నారు. ప్రస్తుతం అక్కడ వర్షాలు తగ్గడంతో.. గ్రౌండ్ స్టాఫ్ ఎంతో శ్రమించి.. మైదానాన్ని రెడీ చేశారు. మరి ఇండియాలో.. ఆఫ్ఘాన్-న్యూజిలాండ్ మ్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#WATCH | New Zealand cricket team arrives at Delhi Airport.
New Zealand will play a one-off Test against Afghanistan and a three-match Test series against India. pic.twitter.com/jWi5ZvX08w
— ANI (@ANI) September 5, 2024