iDreamPost
android-app
ios-app

Musheer Khan: ముషీర్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. టీమిండియా స్టార్లను బాదిపారేశాడు!

  • Published Sep 05, 2024 | 4:59 PM Updated Updated Sep 05, 2024 | 5:08 PM

Musheer Khan Smashes Century: టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ చెలరేగిపోయాడు. భారత జట్టులోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న ఈ యంగ్ సెన్సేషన్ దులీప్ ట్రోఫీ ఓపెనర్​లో సెంచరీతో కదం తొక్కాడు.

Musheer Khan Smashes Century: టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ చెలరేగిపోయాడు. భారత జట్టులోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న ఈ యంగ్ సెన్సేషన్ దులీప్ ట్రోఫీ ఓపెనర్​లో సెంచరీతో కదం తొక్కాడు.

  • Published Sep 05, 2024 | 4:59 PMUpdated Sep 05, 2024 | 5:08 PM
Musheer Khan: ముషీర్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. టీమిండియా స్టార్లను బాదిపారేశాడు!

టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ గురించి క్రికెట్ లవర్స్​కు బాగా తెలుసు. అన్నలా భారత జట్టులోకి వచ్చి సత్తా చాటాలని తహతహలాడుతున్న ఈ యంగ్ సెన్సేషన్ డొమెస్టిక్ క్రికెట్​లో అదరగొడుతున్నాడు. తనకు అవకాశం వచ్చిన ప్రతిసారి దుమ్మురేపుతున్నాడు. తాజాగా మరోమారు అతడు తన ప్రతాపం చూపించాడు. దులీప్ ట్రోఫీ-2024 ఫస్ట్ డేనే ఈ కుర్రాడు బ్యాట్​తో వీరవిహారం చేశాడు. ఇండియా ఏతో జరుగుతున్న మ్యాచ్​లో సెంచరీతో కదం తొక్కాడు. సోదరుడు సర్ఫరాజ్ ఖాన్ (9) సహా యశస్వి జైస్వాల్ (30), కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (13), రిషబ్ పంత్ (7), నితీష్​ కుమార్ రెడ్డి (0) లాంటి స్టార్లంతా విఫలమైన చోట ముషీర్ మాత్రం రెచ్చిపోయి ఆడాడు. ప్రత్యర్థి జట్టులో స్టార్ బౌలర్లు ఉన్నా లెక్కచేయకుండా జూలు విదిల్చి బ్యాటింగ్ చేశాడు.

94 పరుగులకే 7 మంది బ్యాటర్లు ఔట్ అయ్యారు. ప్రత్యర్థి జట్టులో ఖలీల్ అహ్మద్, ఆకాశ్​ దీప్, ఆవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్ లాంటి టీమిండియా స్టార్ బౌలర్లు ఉన్నారు. అయినా ముషీర్ తొణకలేదు, బెణకలేదు. తన బ్యాటింగ్ తాను చేసుకుంటూ పోయాడు. మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన అతడు 222 బంతుల్లో 10 బౌండరీలు, 2 సిక్సుల సాయంతో 105 పరుగులు చేశాడు. అవతలి ఎండ్ నుంచి సపోర్ట్ లేకపోయినా ఒక్కడే జట్టును కష్టాల కడలి నుంచి బయటపడేశాడు. వికెట్లు పడుతున్నాయని అడ్డగోలు షాట్లు ఆడకుండా క్లాసికల్ బ్యాటింగ్​తో అందరి మనసులు గెలుచుకున్నాడు. టెయిలెండర్ నవ్​దీప్ సైనీ (68 బంతుల్లో 25 నాటౌట్) అండతో చెలరేగిపోయాడు ముషీర్. ఖలీల్, కుల్దీప్, ఆవేశ్ బౌలింగ్​లో ధారాళంగా పరుగులు రాబట్టాడు. ముఖ్యంగా కుల్దీప్ బౌలింగ్​లో ఎక్కువ రన్స్ వెళ్లాయి.

ముషీర్-సైనీ జోడీ ఇండియా ఏ బౌలర్లకు కఠిన సవాల్ విసురుతున్నారు. ఒకవైపు ముషీర్ సింగిల్స్, డబుల్స్​తో స్ట్రైక్ రొటేట్ చేస్తుండగా.. మరోవైపు సైనీ వికెట్లకు అడ్డంగా నిలబడుతున్నాడు. ఒక ఎండ్​ను తాను కాపాడితే చాలు.. మరోవైపు ముషీర్ పరుగులు చేస్తాడనే భరోసాతో డిఫెన్స్​కు ప్రాధాన్యం ఇస్తున్నాడు. అతడే గనుక సహకారం అందించకపోయి ఉంటే ఇండియా బీ ఎప్పుడో కుప్పకూలేది. స్టార్ బ్యాటర్లంతా విఫలమైనా సైనీ లాంటి బౌలర్ ఇచ్చిన సపోర్ట్​తో ఇన్నింగ్స్​ను ఇక్కడి వరకు తీసుకొచ్చాడు ముషీర్. అతడు ఇంకా క్రీజులోనే ఉన్నాడు. ఇప్పటికే 8వ వికెట్​కు ముషీర్-సైనీ జంట 108 పరుగులు జోడించారు. ఈ జోడీ ఎంత సేపు క్రీజులో ఉంటే ఇండియా బీకి అంత మంచిది. భారీ స్కోరు ఆశలన్నీ వీరి మీదే ఉన్నాయి. అటు ఇండియా ఏ మాత్రం వీళ్లను త్వరగా ఔట్ చేసి బ్యాటింగ్​కు రావాలని చూస్తోంది. మరి.. ముషీర్ బ్యాటింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.