Nidhan
Axar Patel, Duleep Trophy 2024, IND D vs IND C: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ మరోమారు సత్తా చాటాడు. తన బ్యాట్ పవర్ ఏంటో ఇంకోమారు చూపించాడు. దులీప్ ట్రోఫీ స్టార్టింగ్ మ్యాచ్‌లోనే విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు.
Axar Patel, Duleep Trophy 2024, IND D vs IND C: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ మరోమారు సత్తా చాటాడు. తన బ్యాట్ పవర్ ఏంటో ఇంకోమారు చూపించాడు. దులీప్ ట్రోఫీ స్టార్టింగ్ మ్యాచ్‌లోనే విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు.
Nidhan
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఎక్కువగా బంతితో మెరుస్తుంటాడు. అయితే అవసరమైన సమయంలో బ్యాట్‌తోనూ మ్యాజిక్ చేస్తుంటాడు. అవకాశం ఇవ్వాలే గానీ తోపు బ్యాటర్ల రేంజ్లో ఆడతాడు. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో ఇది చూశాం. ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా మీద అతడు ఆడిన ఇన్నింగ్స్‌ను అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. పొట్టి ప్రపంచ కప్‌తో పాటు ఐపీఎల్, ఇతర సిరీస్‌ల్లోనూ బ్యాట్‌తో గర్జించిన అక్షర్.. బ్యాటింగ్‌లో తన రేంజ్ ఏంటో మరోమారు ప్రూవ్ చేశాడు. దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా డీ-ఇండియా సీ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో థండర్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు అక్షర్. స్టార్లంతా విఫలమైనా అతడు ఒక్కడే యోధుడిలా నిలబడి ప్రత్యర్థులను చీల్చి చెండాడాడు.
118 బంతుల్లో 86 పరుగుల మెమరబుల్ ఇన్నింగ్స్ ఆడాడు అక్షర్. ఇందులో 6 బౌండరీలతో పాటు 6 భారీ సిక్సులు ఉన్నాయి. స్పిన్నర్లు, పేసర్లు అనే తేడా లేకుండా అందర్నీ ఉతికి ఆరేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా అతడు మాత్రం క్రీజులో స్తంభంలా నిలబడిపోయాడు. ఇతర బ్యాటర్ల నుంచి సహకారం అందకున్నా నిరాశ చెందకుండా అపోజిషన్ టీమ్ మీద దాడికి దిగాడు. వరుసగా భారీ షాట్లు బాదుతూ ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టించాడు. క్రీజులో ఉన్నంత సేపు ఎడాపెడా షాట్లు కొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే ఇంకో ఎండ్‌లో క్రమంగా వికెట్లు పడుతూ పోవడంతో ఇండియా డీ 164 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు సాధించిన పరుగులల్లో సగం రన్స్ అక్షర్ బ్యాట్ నుంచే వచ్చాయి. ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు బాపూ. అయితే జట్టు కోసం చివరి వరకు తాను చేయాల్సిందంతా చేశాడు. టెస్టుల్లో టీ20 తరహా బాదుడుతో ప్రత్యర్థిని వణికించాడు.
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు దేవ్‌దత్ పడిక్కల్, రికీ భుయ్, శ్రీకర్ భరత్, అధర్వ టైడే లాంటి స్టార్ బ్యాటర్లు అంతా చేతులెత్తేసిన వేళ తాను ఉన్నానంటూ నిలబడ్డాడు అక్షర్. అతడికి ఇంకో ఎండ్ నుంచి సహకారం అంది ఉంటే సిచ్యువేషన్ వేరేలా ఉండేది. ఇక, ఇండియా సీ బౌలర్లలో అంకుష్ కాంబోజ్, హిమాన్షు మనోజ్ చౌహాన్ చెరో 2 వికెట్లతో సత్తా చాటారు. మరో పేసర్ వైశాఖ్ విజయ్ కుమార్ 3 వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. మానవ్ సుతార్, హృతిక్ షోకీన్ తలో వికెట్ తీసి అపోజిషన్‌ను ఆలౌట్ చేయడంలో తమ వంతు సహకారం అందించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా సీ ప్రస్తుతం 8.1 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 15 పరుగులతో ఉంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (5), మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (7)ను పేసర్ హర్షిత్ రాణా వెనక్కి పంపించాడు. ఆర్యన్ జుయల్ (3 నాటౌట్), రజత్ పాటిదార్ (0 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఇండియా డీ బౌలర్లు చెలరేగి బౌలింగ్ చేస్తుండటంతో మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా సాగుతోంది. మరి.. అక్షర్ ఇన్నింగ్స్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
TAKE A BOW, AXAR PATEL…!!! 🙇♂️
– 86 (118) when India D were 48/6, the crisis man once again steps up and takes the responsibility. A top class team man! 🌟 pic.twitter.com/pDYpGSXVK8
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 5, 2024