iDreamPost
android-app
ios-app

Sarfaraz Khan: వాడు నాకంటే బెటర్‌ ప్లేయర్‌.. వాడ్ని చూసే నేర్చుకుంటా: సర్పరాజ్ ఖాన్

  • Published Jan 30, 2024 | 11:52 AM Updated Updated Jan 30, 2024 | 11:52 AM

ఆధునిక బ్రాడ్ మన్ గా పేరుగాంచిన సర్ఫరాజ్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు నా కంటే బెటర్ బ్యాటర్ అని, ఎన్నో టెక్నిక్స్ అతడి నుంచి నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు ఈ స్టార్ ప్లేయర్.

ఆధునిక బ్రాడ్ మన్ గా పేరుగాంచిన సర్ఫరాజ్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు నా కంటే బెటర్ బ్యాటర్ అని, ఎన్నో టెక్నిక్స్ అతడి నుంచి నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు ఈ స్టార్ ప్లేయర్.

Sarfaraz Khan: వాడు నాకంటే బెటర్‌ ప్లేయర్‌.. వాడ్ని చూసే నేర్చుకుంటా: సర్పరాజ్ ఖాన్

సర్ఫరాజ్ ఖాన్.. ఇండియన్ క్రికెట్ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు. దేశవాళీ క్రికెట్ లో పరుగులవరద పారిస్తూ.. మోడ్రన్ బ్రాడ్ మన్ గా పేరుగాంచాడు ఈ ముంబై ఆటగాడు. అయితే సెంచరీల మీద సెంచరీలు సాధిస్తున్నా గానీ.. సెలెక్టర్లు తనను టీమిండియాకు ఎంపిక చేయకపోవడంతో.. వారిపై తన యాటిట్యూడ్ చూపించాడు. దీంతో బీసీసీఐ ఆగ్రహానికి గురై.. జట్టుకు దూరమైయ్యాడు. అయినప్పటికీ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటూ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు సెలెక్టర్ల నుంచి సర్ఫరాజ్ కు పిలుపొచ్చింది. ఇంగ్లాండ్ తో జరగనున్న రెండో టెస్ట్ కు టీమిండియాకి అతడిని ఎంపిక చేసింది. దీంతో సర్ఫరాజ్ నిరీక్షణ ఫలించింది. ఈ నేపథ్యంలోనే పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఈ స్టార్ బ్యాటర్.

టీమిండియాలోకి రావాలన్న స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ కల ఫలించింది. ఇంగ్లాండ్ తో విశాఖ వేదికగా జరగనున్న రెండో టెస్ట్ కు భారత స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు గాయం కారణంగా దూరమైయ్యారు. దీంతో వారి ప్లేస్ లో సర్ఫరాజ్, సుందర్, సౌరభ్ కుమార్ లను జట్టులోకి తీసుకున్నాడు. రాహుల్ ప్లేస్ లో సర్ఫరాజ్ కచ్చితంగా జట్టులో ఉంటాడు. జట్టులో తన కొడుకు చోటు సంపాదించడంతో.. ఎమోషనల్ అయ్యాడు సర్పరాజ్ తండ్రి. ఇదిలా ఉండగా.. తాజాగా తన తమ్ముడు ముషీర్ ఖాన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు సర్ఫరాజ్. ప్రస్తుతం ఆ కామెంట్స్ క్రికెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

sarfrak khan comments about his brother 2

సర్పరాజ్ ఖాన్ తన తమ్ముడు ముషీర్ ఖాన్ గురించి మాట్లాడుతూ.. “నా తమ్ముడు నా కంటే అద్భుతమైన బ్యాటర్. నేను బ్యాటింగ్ లో స్ట్రగుల్ అవుతున్నప్పుడు వాడి నుంచి కొన్ని టెక్నిక్స్ నేర్చుకుంటాను. వాటిని తర్వాతి మ్యాచ్ లో అప్లై చేస్తుంటాను. నేను విఫలం అవుతున్నప్పుడు వాడి ఆటను చూసి నేర్చుకుంటూ ఉంటాను. అది నాకు పూర్తిగా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది” అని చెప్పుకొచ్చాడు ఈ స్టార్ బ్యాటర్. కాగా.. ప్రస్తుతం జరుగుతున్న అండర్ 19 వరల్డ్ కప్ లో అద్బుతమైన సెంచరీతో అదరగొట్టాడు ముషీర్ ఖాన్. ఒకేరోజు ఇద్దరు అన్నదమ్ములు సెంచరీలు చేసి ఆశ్చర్యపరిచారు. ఇక రంజీల్లో తిరుగులేని రికార్డులతో దూసుకెళ్తున్నాడు. ఇప్పటి వరకు 45 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన ఇతడు.. 69.85 సగటుతో 3,912 పరుగులు చేశాడు. అందులో 14 శతకాలు, 11 అర్దశతకాలు ఉండటం విశేషం. డొమెస్టిక్ క్రికెట్ లో అంచనాలను మించి రాణిస్తున్న సర్ఫరాజ్ అభినవ బ్రాడ్ మన్ గా ప్రశంసలు అందుకుంటున్నాడు. మరి అలాంటి ఆటగాడు తన తమ్ముడి నుంచి టెక్నిక్స్ నేర్చుకుంటానని చెప్పడం మీకేవిధంగా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.