iDreamPost
iDreamPost
ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ కి, సన్ రైజర్స్ హైదరాబాద్ కి మధ్య జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ టీం 20 ఓవర్లకి 195 రన్స్ కొట్టగా, గుజరాత్ టీం చివరి బాల్ కి సిక్స్ కొట్టి గెలిచింది. చివరి ఓవర్ ముందు వరకూ అందరూ హైదరాబాద్ గెలుస్తుందని అనుకున్నారు. చివరి ఓవర్లో గుజరాత్ విజయానికి 22 పరుగులు అవసరం కాగా రషీద్, తెవాటియాలు వరుస సిక్స్ లు, ఫోర్లతో విధ్వంసం సృష్టించారు.
ఆ చివరి ఓవర్ లో, సన్ రైజర్స్ బౌలర్ మార్కో జాన్సెన్ బౌలింగ్ వేశాడు. వరుసగా వైడ్ యార్కర్, బౌన్సర్, స్ట్రెయిట్ యార్కర్, లో ఫుల్ టాస్.. ఇలా వైవిధ్యమైన బాల్స్ వేశాడు. అయితే రషీద్ ఖాన్, తెవాటియాలు వాటిని బాగా ఆడారు. ప్రతి బాల్ ని ఫోర్, సిక్స్ గా కొట్టడంతో మార్కో ఏమి చేయలేకపోయాడు. చివరి ఓవర్ లో 22 పరుగులు ఇవ్వడంతో మార్కో సన్ రైజర్స్ ఓటమికి కారణమయ్యాడు అని అంతా అంటున్నారు.
గెలుస్తామన్న మ్యాచ్ ఇలా ఓడిపోవడంతో, అందులోనూ చివరి ఓవర్ లో దారుణమైన బౌలింగ్ తో సన్ రైజర్స్ బౌలింగ్ కోచ్ మురళీధరన్ కు బాగా కోపం వచ్చింది. రషీద్ ఖాన్ వరుసగా సిక్సర్లు కొడుతుండటంతో మురళీధరన్ లో ఫ్రస్ట్రేషన్. ”అవసరమైన సమయంలో అలాంటి చెత్త బౌలింగ్ ఏంటి, మైండ్ దొబ్బిందా, అసలేం బౌలింగ్ చేస్తున్నాడు” అంటూ మార్కో జాన్సన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మురళీధరన్ ఆవేశంగా అరుస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.