Nidhan
సిసలైన బ్యాటింగ్ అంటే ఎలా ఉంటుందో చూపించింది ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్. తుఫాన్ ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి జట్టు బౌలర్ల మీద విరుచుకుపడింది.
సిసలైన బ్యాటింగ్ అంటే ఎలా ఉంటుందో చూపించింది ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్. తుఫాన్ ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి జట్టు బౌలర్ల మీద విరుచుకుపడింది.
Nidhan
విమెన్స్ ప్రీమియర్ లీగ్-2024లో ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. శనివారం రాత్రి గుజరాత్ జియాంట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జియాంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 19.5 ఓవర్లలో 3 వికెట్లకు 191 పరుగులు చేసింది. మ్యాచ్ మొత్తంలో ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (48 బంతుల్లో 95 నాటౌట్) బ్యాటింగ్ మెయిన్ హైలైట్ అని చెప్పాలి. సంచలన బ్యాటింగ్‌తో రెచ్చిపోయిందామె. ఆకాశమే హద్దుగా బౌండరీలు, సిక్సులతో విరుచుకుపడుతూ సింగిల్ హ్యాండ్‌తో టీమ్‌ను గెలిపింది. ఒక దశలో మ్యాచ్ జియాంట్స్దేనని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ ఆ టైమ్‌లో సంచలన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్టు బౌలర్లపై విరుచుకుపడింది హర్మన్.
ముంబై గెలుపునకు చివరి 4 ఓవర్లలో 64 పరుగులు కావాలి. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. కానీ ఓవర్‌కు 16 పరుగుల చొప్పున చేస్తే గానీ గెలవలేదు. నిలకడగా అంత రన్స్ చేయడం సులువు కాదు. వేగంగా ఆడే క్రమంలో వికెట్లు కోల్పోతే మొదటికే మోసం వస్తుంది. ఈ టైమ్‌లో జూలు విదిల్చింది హర్మన్‌ప్రీత్ కౌర్. తన అనుభవాన్ని అంతా రంగరించి క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంది. అవతలి ఎండ్‌లో ఉన్న అమెలియా కెర్ (12 నాటౌట్) స్ట్రైక్ రొటేషన్ చేస్తూ తమ సారథికి ఎక్కువ బంతులు ఆడే ఛాన్స్ ఇచ్చింది. ఎలాగైనా నెగ్గాలనే కసితో కనిపించిన హర్మన్ బౌండరీల కంటే సిక్సులు బాదేందుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చింది. ఈ ఇన్నింగ్స్‌లో ఆమె బ్యాట్ నుంచి ఏకంగా 10 బౌండరీలతో పాటు 5 భారీ సిక్సులు వచ్చాయి. దీన్ని బట్టే హర్మన్ బ్యాటింగ్ విధ్వంసం ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు.
ప్రతి ఓవర్‌కు ఎంత రన్స్ కొట్టాలనేది క్యాలిక్యులేట్ చేసుకుంటూ తన బ్యాట్‌ను ఝళిపించింది హర్మన్‌ప్రీత్. అలా చివరి వరకు నిలబడి మ్యాచ్‌ను ఫినిష్ చేసి ముంబైకి మర్చిపోలేని విజయాన్ని అందించింది. ఇంటర్నేషనల్ కెరీర్‌తో పాటు డబ్ల్యూపీఎల్‌లోనూ ఎన్నో మంచి ఇన్నింగ్స్‌లు ఆడింది హర్మన్. కానీ జియాంట్స్ మీద ఆడిన నిన్నటి ఇన్నింగ్స్ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. వీర విజృంభణతో ఓటమి కోరల్లో నుంచి జట్టును బయటపడేయడం, ఆఖరి వరకు నిలబడి మ్యాచ్‌ను ఫినిష్ చేయడం, అంత ప్రెజర్లోనూ పర్ఫెక్ట్ షాట్ మేకింగ్‌తో అలరించడం అంటే మాటలు కాదు. కానీ దీన్ని అలవోకగా చేసి చూపించిందామె. అందుకే ఇది స్పెషల్ ఇన్నింగ్స్‌గా నిలిచిపోతుంది. మరి.. హర్మన్ సంచలన బ్యాటింగ్ మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఇంగ్లండ్‌పై సిరీస్ విజయంతో ఏం సాధించాడు? రోహిత్ ప్లానేంటి? WC కంటే పెద్ద టార్గెట్!
Very few people can hit the ball as cleanly and purely as Harmanpreet Kaur can! ⚡️⚡️#TATAWPL #CricketTwitter pic.twitter.com/Nf2FItj7ki
— The Bridge (@the_bridge_in) March 10, 2024