SNP
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించడంపై రోహిత్, ముంబై అభిమానులు.. ఆ జట్టు యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ నిరసన ఏకంగా అంబానీ కుటుంబానికి నేరుగా తాకింది. ఇంతకీ ఏం జరిగిందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించడంపై రోహిత్, ముంబై అభిమానులు.. ఆ జట్టు యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ నిరసన ఏకంగా అంబానీ కుటుంబానికి నేరుగా తాకింది. ఇంతకీ ఏం జరిగిందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
ఐపీఎల్ 2024 సీజన్‌కి ముందు ముంబై ఇండియన్స్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. అందుకు కారణం.. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడమేనని అందరికి తెలిసిందే. ముంబై ఇండియన్స్‌కి కెప్టెన్ అయిన తర్వాత రోహిత్ శర్మ.. ఆ జట్టును ఏకంగా ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపాడు. అంత సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మను సడెన్‌గా కెప్టెన్సీ నుంచి తప్పించి.. హార్ధిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇచ్చారు. 2021 సీజన్ తర్వాత.. ఐపీఎల్ 2022 సీజన్ కోసం గుజరాత్ టైటాన్స్ జట్టుకు మారిన పాండ్యా.. తొలి సీజన్‌లోనే ఆ జట్టుకు టైటిల్ అందించాడు. ఏమైందో తెలియదు కానీ.. ఐపీఎల్ 2024 కోసం తిరిగి ముంబైకి వచ్చేశాడు. వచ్చి రావడంతోనే కెప్టెన్సీ బాధ్యతలు కూడా అతనికే అప్పగిస్తున్నట్లు ముంబై మేనేజ్‌మెంట్ వెల్లడించింది.
ఈ నిర్ణయంతో రోహిత్ శర్మ అభిమానులు ముంబై ఇండియన్స్‌పై మండిపడ్డారు. చాలా మంది అభిమానులు.. ముంబై ఇండియన్స్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ను అన్‌ఫాలో కొట్టేశారు. దాదాపు 10 లక్షల మందికి పైగా ముంబై ఇండియన్స్ పేజ్‌ను అన్‌ఫాలో చేశారు. అయితే.. ఈ నిరసన సెగ నేరుగా ముంబై ఇండియన్స్ ఓనర్ ఆకాశ్ అంబానీకి తాకింది. తాజాగా ఐపీఎల్ 2024 సీజన్ కోసం దుబాయ్‌లోని కోకాకోలా ఎరినాలో ఐపీఎల్ మినీ వేలం జరిగింది. ఈ వేలంలో తొలి సారి కొంతమంది అభిమానులను సైతం అనుమతించారు. దీంతో.. ఎంతో కోలాహలంగా మినీ వేలం సాగింది.
అయితే.. ఈ వేలం సందర్భంగా వచ్చిన కొంతమంది ముంబై ఇండియన్స్ అభిమానులు.. రోహిత్ శర్మను తిరిగి కెప్టెన్ చేయాలని కోరుతూ గట్టిగా అరిచారు. వారి అరుపులకు స్పందించిన ఆకాశ్ అంబానీ.. ‘చింతించకండి.. రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తాడు’ అని బదులిచ్చాడు. రోహిత్ శర్మను కెప్టెన్‌గా తప్పిస్తే.. ఫ్యాన్స్ ఎదురుతిరుగుతారని తెలిసినా కూడా ముంబై యాజమాన్యం పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించిందని ఆకాశ్ అంబానీ రియాక్షన్ చూస్తే తెలుస్తుంది. ఎంతో కామ్ అండ్ కూల్‌గా అభిమానులు హర్ట్ అవ్వకుండా ఆకాశ్ అంబానీ వారికి సమాధానం ఇచ్చాడు. ఏది ఏమైనా రోహిత్ శర్మను ముంబై కెప్టెన్‌గా తప్పించడాన్ని మాత్రం చాలా మంది అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. విధేయత అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి కోసం.. రోహిత్ శర్మను బాధపెడుతున్నారంటూ మండిపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Mumbai Indians’ owner Aakash Ambani reacts to a fan during the IPL 2024 auction.
📸: IPL pic.twitter.com/HoEvfuM3K5
— CricTracker (@Cricketracker) December 20, 2023