iDreamPost
android-app
ios-app

Nuwan Thushara: ముంబై జట్టులోకి జూనియర్ మలింగ! ప్రత్యర్థికి చెమటలే..

శ్రీలంకకు చెందిన యంగ్ పేసర్ నువాన్ తుషారాను ముంబై ఇండియన్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. జూనియర్ మలింగగా పిలుచుకునే తుషారా జట్టులోకి రావడంతో.. ప్రత్యర్థి జట్లకు చెమటలే అంటున్నారు క్రీడా పండితులు.

శ్రీలంకకు చెందిన యంగ్ పేసర్ నువాన్ తుషారాను ముంబై ఇండియన్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. జూనియర్ మలింగగా పిలుచుకునే తుషారా జట్టులోకి రావడంతో.. ప్రత్యర్థి జట్లకు చెమటలే అంటున్నారు క్రీడా పండితులు.

Nuwan Thushara: ముంబై జట్టులోకి జూనియర్ మలింగ! ప్రత్యర్థికి చెమటలే..

ఐపీఎల్ 2024 వేలంలో స్టార్ క్రికెటర్లు రికార్డు స్థాయిలో ధరను సొంతం చేసుకుంటే.. మరికొందరు ప్లేయర్లు ఊహించని డబ్బును ఎగరేసుకుపోయారు. ఇక టీమిండియాకు చెందిన అన్ క్యాప్డ్ ప్లేయర్ల పంట పండిందనే చెప్పాలి. అనుభవం లేకున్నా, దేశవాళీ క్రికెట్ లో చూపించిన ప్రదర్శన కారణంగా వారిపై కోట్ల వర్షం కురిపించాయి ఫ్రాంచైజీలు. ఇక ఈ వేలంలో అందరిని ఆకర్షించిన ఓ ప్లేయర్ ఉన్నాడు. అతడి పేరే ‘నువాన్ తుషారా’. శ్రీలంకకు చెందిన ఈ పేసర్ కు ముద్దుపేరు ఇంకోటి ఉంది. తుషారాను క్రికెట్ ప్రేమికులు జూనియర్ మలింగా అని పిలుచుకుంటారు. మలింగ స్టైల్లోనే బౌలింగ్ చేస్తూ.. ప్రపంచ క్రికెట్ ను తనవైపు ఆకర్షించుకున్నాడు. ఇక తాజాగా జరిగిన వేలంలో ముంబై ఇండియన్స్ అతడిని 4.8 కోట్లకు దక్కించుకుంది.

నువాన్ తుషారా.. ప్రస్తుతం ఈ పేరు ఐపీఎల్ క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారింది. శ్రీలంకకు చెందిన ఈ యువ పేసర్ ను ఐపీఎల్ 2024 వేలంలో ముంబై ఇండియన్స్ రూ. 4.8 కోట్లు పెట్టి కొనుక్కుంది. జూనియర్ మలింగగా పేరుగాంచిన ఈ యంగ్ పేసర్, కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు సంధించడంలో సిద్దహస్తుడు. వికెట్ టూ వికెట్ బంతులను వేగంతో వేయడంలో దిట్ట. అందుకే తక్కువ మ్యాచ్ లు ఆడిన అనుభవం ఉన్నాగానీ.. అతడిపై అంత మెుత్తం పెట్టుబడి పెట్టింది ముంబై. అదీకాక ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ను ముంబై వదులుకున్న విషయం తెలిసిందే. అతడిని 2022లో జరిగిన మెగా వేలంలో రూ.8 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ ఆ సీజన్ లో గాయాల కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు ఆర్చర్. ఇక 2023 సీజన్ లో కేవలం 5 మ్యాచ్ లే ఆడి 2 వికెట్లు మాత్రమే పడగొట్టి, రన్స్ దారాళంగా సమర్పించుకున్నాడు. వీటికి తోడు గాయాలు వెంటాడుతుండటంతో.. ఆర్చర్ ను ఐపీఎల్ 2024 వేలానికి ముందు ముంబై విడుదల చేసింది.

అయితే ఆర్చర్ 2024 వేలానికి అందుబాటులో ఉండటానికి ఆసక్తి చూపినా.. దానికి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అడ్డుచెప్పిందని సమాచారం. దీంతో అతడి లోటును నవాన్ తుషారా భర్తీ చేస్తాడని భావిస్తోంది ముంబై టీమ్. ఇటు బుమ్రాకి తోడు తుషారా కలిస్తే.. ఈ జోడీ ప్రత్యర్థులను తమ మెరుపు బంతులతో ఉక్కిరిబిక్కిరి చేయగలదు. ప్రారంభంలోనే ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి తేగల సత్తా ఈ పేస్ ద్వయానికి ఉంది. ఇక తుషారా తక్కువ మ్యాచ్ లే ఆడినప్పటికీ.. తన పేస్ పదునుకు చూసిన వారంతా ఫిదా కావాల్సిందే. అంతలా అతడు బంతులను సంధిస్తాడు. మరి ముంబై ఇండియన్స్ టీమ్ లోకి వచ్చిన జూనియర్ మలింగ ఏమేరకు రాణిస్తాడో వేచిచూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి