iDreamPost
android-app
ios-app

MI vs PBKS: అతడి భవిష్యత్ కు ఢోకా లేదు.. పంజాబ్ బ్యాటర్ పై పాండ్యా ప్రశంసలు!

  • Published Apr 19, 2024 | 10:36 AM Updated Updated Apr 19, 2024 | 10:36 AM

ముంబైతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ప్లేయర్ చెలరేగిన తీరు హార్దిక్ పాండ్యాను ఫిదా చేసింది. సిక్సర్ల మోత మోగించిన ఆ ఆటగాడిపై మ్యాచ్ అనంతరం పొగడ్తల వర్షం కురిపించాడు ముంబై కెప్టెన్.

ముంబైతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ప్లేయర్ చెలరేగిన తీరు హార్దిక్ పాండ్యాను ఫిదా చేసింది. సిక్సర్ల మోత మోగించిన ఆ ఆటగాడిపై మ్యాచ్ అనంతరం పొగడ్తల వర్షం కురిపించాడు ముంబై కెప్టెన్.

MI vs PBKS: అతడి భవిష్యత్ కు ఢోకా లేదు.. పంజాబ్ బ్యాటర్ పై పాండ్యా ప్రశంసలు!

IPL పుణ్యమాని కొత్త కొత్త యువ క్రికెటర్లు వెలుగులోకి వస్తున్నారు. తమలో ఉన్న టాలెంట్ ను నిరూపించుకునేందుకు ఆ ఆటగాళ్లు ఐపీఎల్ ను ఓ వారధిగా వాడుకుంటున్నారు. ఇక ఈ సీజన్ లో కూడా భారత యంగ్ గన్స్ పేలుతున్నాయి. తమ ఆటతీరుతో అదరగొడుతూ.. ఎప్పుడెప్పుడు టీమిండియా జట్టులోకి అడుగుపెడదామా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ముంబైతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ప్లేయర్ చెలరేగిన తీరు హార్దిక్ పాండ్యాను ఫిదా చేసింది. సిక్సర్ల మోత మోగించిన ఆ ఆటగాడిపై మ్యాచ్ అనంతరం పొగడ్తల వర్షం కురిపించాడు.

ముంబైతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ టార్గెట్ 193. కానీ 13 బంతుల్లో 14 పరుగులు 4 వికెట్లు ఈ స్టేజిలో ఉంది పంజాబ్ టీమ్. దీంతో ఎవరైనా ఆ టీమ్ గెలవడం కష్టమని ఇట్టే చెప్పేస్తారు. కానీ అప్పుడప్పుడు అసాధ్యాలను సుసాధ్యం చేయడానికే కొంత మంది పుడతారు. ముంబై విజయం లాంఛనమే అని భావించిన వారంతా అతడు బ్యాటింగ్ చేస్తుంటే.. తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు అంటే అతిశయోక్తికాదేమో. ముంబై బౌలర్లపై సిక్సర్ల వర్షం కురిపించాడు ఆ ప్లేయర్. అతడి పేరే అశుతోష్ శర్మ. తన అసాధారణ బ్యాటింగ్ తో పంజాబ్ ను గెలుపు ముంగిట వరకు తీసుకొచ్చాడు.. కానీ గెలిపించలేకపోయాడు. అయితేనేం.. ప్రేక్షకుల హృదయాలతో పాటుగా ప్రత్యర్థి టీమ్ కెప్టెన్ మనసును కూడా గెలుచుకున్నాడు.

Pandya praises Punjab batter!

అశుతోష్ శర్మ.. ముంబైతో జరిగిన మ్యాచ్ లో కేవలం 28 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సులతో 61 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చివరి వరకు అతడు క్రీజ్ లో ఉంటే పంజాబ్ విజయం ఖయమని అందరూ భావించారు. కానీ కొయెట్జీ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు అశుతోష్. దీంతో ముంబై విజయం ఖాయమైంది. కాగా.. అశుతోష్ విధ్వంసకర బ్యాటింగ్ కి ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫిదా అయ్యాడు. మ్యాచ్ అనంతరం అతడిపై ప్రశంసలు కురిపించాడు. “ఈ మ్యాచ్ లో అశుతోష్ తన బ్యాటింగ్ తో నన్ను ఆకట్టుకున్నాడు. అతడి షాట్ సెలెక్షన్ కు నేను ఫిదా అయ్యాను. ప్రతీ బాల్ ను బ్యాట్ మిడిల్ చేస్తూ ఆడిన విధానం అద్భుతం. అతడు ఇలాగే రాణిస్తే.. ఫ్యూచర్ బాగుటుంది. అశుతోష్ భవిష్యత్ గురించి నేను హ్యాపీగా ఉన్నాను” అంటూ మాట్లాడాడు. మరి ముంబై కెప్టెన్ పాండ్యా యంగ్ ప్లేయర్ పై పొగడ్తలు కురిపించడం మీకేవిధంగా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.