iDreamPost
android-app
ios-app

ధోని జిడ్డు బ్యాటింగ్‌ వల్లే ఆ వరల్డ్‌ కప్‌ను పోగొట్టుకున్నాం: దాదా

  • Published Jul 16, 2024 | 9:45 AM Updated Updated Jul 16, 2024 | 8:05 PM

MS Dhoni, Sourav Ganguly: భారత క్రికెట్‌ అభిమానుల హృదయాలను ముక్కలు చేసిన ఓటములు చాలా ఉన్నాయి. కానీ, ఓ వరల్డ్‌ కప్‌ ఓటమికి కారణం మాత్రం ధోని అంటూ సౌరవ్‌ గంగూలీ పేర్కొన్నాడు. మరి ఆ వరల్డ్‌ కప్‌ ఏది? ధోని ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..

MS Dhoni, Sourav Ganguly: భారత క్రికెట్‌ అభిమానుల హృదయాలను ముక్కలు చేసిన ఓటములు చాలా ఉన్నాయి. కానీ, ఓ వరల్డ్‌ కప్‌ ఓటమికి కారణం మాత్రం ధోని అంటూ సౌరవ్‌ గంగూలీ పేర్కొన్నాడు. మరి ఆ వరల్డ్‌ కప్‌ ఏది? ధోని ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Jul 16, 2024 | 9:45 AMUpdated Jul 16, 2024 | 8:05 PM
ధోని జిడ్డు బ్యాటింగ్‌ వల్లే ఆ వరల్డ్‌ కప్‌ను పోగొట్టుకున్నాం: దాదా

2023 వన్డే వరల్డ్‌ కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌లో టీమిండియా ఓటమి భారత క్రికెట్‌ అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది. కానీ, అంతకంటే ముందు 2019లో వన్డే వరల్డ్‌ కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన గెలిచే సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఓటమి ఇప్పటికీ చాలా మంది క్రికెట్‌ అభిమానులను బాధపెడుతూ ఉంటుంది. ఆ మ్యాచ్‌లో ధోని రనౌట్‌ను చూస్తే ఇప్పటికీ వరల్డ్‌ కప్‌ మిస్‌ అయిన ఫీలింగ్‌ కలుగుతోంది. అయితే.. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి ఓ ఆటగాడి జిడ్డు బ్యాటింగ్‌ కారణం అంటూ.. భారత దిగ్గజ మాజీ కెప్టెన్‌, బీసీసీఐ మాజీ ఛైర్మన్‌ సౌరవ్‌ గంగూలీ సంచలన స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. మరి జిడ్డు బ్యాటింగ్‌ చేసి టీమిండియా ఓటమికి కారణమైన ఆటగాడు ఎవరో ఇప్పుడు చూద్దాం..

వర్షం కారణంగా ఆ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ రెండు రోజుల పాటు జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 239 పరుగులు చేసింది. అనంతరం టార్గెట్‌ ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియాను మ్యాట్ హెన్రీ దారుణంగా దెబ్బ కొట్టాడు. అతని ధాటికి 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది భారత జట్టు. రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. కానీ భారీ షాట్స్ ఆడే క్రమంలో ఇద్దరూ ఔటయ్యారు. 92 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి టీమిండియా ఓటమికి దగ్గరైంది. ఈ పరిస్థితుల్లో రవీంద్ర జడేజా సూపర్‌ బ్యాటింగ్‌తో విజయం దక్కుతుందనే ఆశలు రేపాడు. కానీ, ధోని చాలా క్రీజ్‌లో ఉన్నా.. కాస్త స్లోగా ఆడాడు. సులువైన బంతులను సైతం వదిలేశాడు. ధోని బాల్‌ను స్కిప్‌ చేస్తుంటే.. న్యూజిలాండ్‌ బౌలర్‌ లూకీ ఫెర్గుసన్‌ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ధోని అలా ఎందుకు చేశాడో ఎవరికీ అర్థం కాలేదు. ఒక ఎండ్‌లో జడేజా ఫాస్ట్‌గా ఆడుతూ.. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. మరోవైపు ధోనీ మాత్రం రన్ రేట్ పెరుగుతున్నా సింగిల్స్‌కే పరిమితమయ్యాడు.

రన్‌రేట్‌ పెరిగిపోవడంతో భారీ షాట్లు ఆడే క్రమంలో జడేజా క్యాచ్‌ అవుట్‌ అయ్యాడు. 12 బంతుల్లో 32 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో కూడా ధోనీ సింగిల్స్‌ తీయడం భారత క్రికెట్‌ అభిమానులను సైతం షాక్‌కు గురి చేసింది. 49వ ఓవర్ తొలి బంతిని సిక్సర్‌గా తరలించిన ధోనీ హాఫ్ సెంచరీ కంప్లీట్‌ చేసుకున్నాడు. అదే ఓవర్ మూడో బంతికి క్విక్ డబుల్ తీసే క్రమంలో రనౌటయ్యాడు. ఆ తర్వాత టీమిండియా 221 పరుగులకే కుప్పకూలి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆ సమయంలో ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన గంగూలీ.. ధోనీ ఏం చేస్తున్నాడో తనకు అర్థం కాలేదని, అతని జిడ్డు బ్యాటింగ్ కారణంగానే టీమిండియా ఓటమిపాలైందని చెప్పుకొచ్చాడు. వేగంగా ఆడాల్సిన సమయంలో సింగిల్స్‌ తీస్తూ ఒత్తిడి పెంచాడంటూ మండిపడ్డాడు. కాగా, ఆ టోర్నీలో టీమిండియా విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీలో ఆడిన విషయం తెలిసిందే. మరి 2019 వరల్డ్‌ కప్‌ సెమీస్‌లో ధోని జిడ్డు బ్యాటింగ్‌ కారణంగానే టీమిండియా ఓడిందని దాదా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.