Somesekhar
తాజాగా ధోని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. 'అలా కూర్చోవడం చాలా బోరింగ్ గా ఉంది.. కానీ ఫ్యాన్స్ కోసం ఆ కష్టాన్ని భరిస్తున్నా అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
తాజాగా ధోని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. 'అలా కూర్చోవడం చాలా బోరింగ్ గా ఉంది.. కానీ ఫ్యాన్స్ కోసం ఆ కష్టాన్ని భరిస్తున్నా అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Somesekhar
మహేంద్రసింగ్ ధోని.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక అభిమానగణాన్ని సంపాదించుకున్నాడు. కేవలం క్రికెట్ తోనే కాకుండా తన వ్యక్తిత్వంతో కోట్ల సంఖ్యలో అభిమానుల మనసు కొల్లగొట్టాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్ కోసం సిద్దమవుతున్నాడు. కాగా.. 42 ఏళ్ల ధోనికి ఇదే చివరి ఐపీఎల్ టోర్నీ అని అందరూ అనుకుంటున్నారు. ఇక ధోనికి సంబంధించిన ఏ చిన్న విషయం అయినా.. క్షణాల్లో వైరల్ గా మారుతుంది. తాజాగా ధోని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ‘అలా కూర్చోవడం చాలా బోరింగ్ గా ఉంది.. కానీ ఫ్యాన్స్ కోసం ఆ కష్టాన్ని భరిస్తున్నా అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
మహేంద్రసింగ్ ధోని.. టీమిండియా క్రికెట్ లో ఓ ట్రెండ్ సెట్టర్. భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్ గా ఘనత వహించాడు ధోని. కాగా తన క్రికెట్ కెరీర్ లో రకరకాల హెయిర్ స్టైల్స్ లో అభిమానులను అలరిస్తూ.. ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు. చాలా సంవత్సరాల తర్వాత ధోని తొలినాళ్లలో కనిపించిన జులపాల హెయిర్ స్టైల్లో కనిపించి సందడి చేశాడు. ధోని కొత్త హెయిర్ స్టైల్ కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోని తన హెయిర్ స్టైల్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
ధోని మాట్లాడుతూ..”గతంలో నేను యాడ్ ఫిల్మ్ షూట్ లకు వెళ్లినప్పుడు నా హెయిర్ స్టైల్, మేకప్ కోసం కేవలం 20 నిమిషాలు మాత్రమే టైమ్ పట్టేది. కానీ ఇప్పుడు ఈ జులపాల జుట్టుకు గంటకు పైగానే పడుతోంది. హెయిర్ స్టైల్ కోసం గంటల పాటు అలానే కదలకుండా కూర్చోవడం చాలా కష్టంగా, బోరింగ్ గా ఉంది. అయితే నా ఫ్యాన్స్ మాత్రం ఈ హెయిర్ స్టైల్ అద్భుతంగా ఉందంటున్నారు. వారికోసమే ఎంత కష్టాన్నైనా భరిస్తాను. వారికోసం మరికొంత కాలం ఈ స్టైల్లోనే ఉండేందుకు ప్రయత్నిస్తా.. కానీ ఏదో ఒకరోజు మారుస్తా” అంటూ చెప్పుకొచ్చాడు ధోని. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇటీవలే ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోని క్రికెట్ తర్వాత నెక్ట్స్ ప్లానింగ్ ఏంటని ప్రశ్నించగా.. ఎక్కువ టైమ్ ను ఆర్మీకి కేటాయిస్తానని సమాధానం చెప్పి అందరిని ఆకర్షించాడు. మరి ధోని తన అభిమానుల కోసం ఇంత కష్టాన్ని భరించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
MS Dhoni said, “maintaining this hairstyle is very difficult. Earlier I used to get ready in 20 mins, now it takes 1 hour 10 minutes. I’m doing because fans are liking it, but someday I wakes up and decide it’s enough, I’ll cut it down”.pic.twitter.com/qknk36Spop
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 27, 2023