iDreamPost
android-app
ios-app

MS Dhoni: ఆ క్షణం నా గుండె బద్ధలైంది.. ధోని నుంచి ఇలాంటి మాట ఊహించలేదు!

  • Published Aug 02, 2024 | 10:54 AM Updated Updated Aug 02, 2024 | 10:54 AM

తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ధోని తన కెరీర్ లో ఎక్కువ బాధపెట్టిన విషయాల గురించి వెల్లడించాడు. ఆ క్షణాన నా గుండె ముక్కలైందంటూ.. ఎవ్వరూ ఊహించని కామెంట్స్ చేశాడు.

తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ధోని తన కెరీర్ లో ఎక్కువ బాధపెట్టిన విషయాల గురించి వెల్లడించాడు. ఆ క్షణాన నా గుండె ముక్కలైందంటూ.. ఎవ్వరూ ఊహించని కామెంట్స్ చేశాడు.

MS Dhoni: ఆ క్షణం నా గుండె బద్ధలైంది.. ధోని నుంచి ఇలాంటి మాట ఊహించలేదు!

మహేంద్రసింగ్ ధోని.. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన ఘనుడు. ఇక తన క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికిన తర్వాత కేవలం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు. ఇక తనకు లభించిన ఖాళీ సమయాల్లో పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ధోని తన కెరీర్ లో ఎక్కువ బాధపెట్టిన విషయాల గురించి వెల్లడించాడు. ఆ క్షణాన నా గుండె ముక్కలైందంటూ.. ఎవ్వరూ ఊహించని కామెంట్స్ చేశాడు. మిస్టర్ కూల్ నుంచి ఈ మాట బహుశా ఎవ్వరు కూడా ఎక్స్ పెక్ట్ చేసి ఉండరు.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైయ్యాడు. ఈ ఈవెంట్ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపిగ్గా సమాధానాలు చెబుతూ వచ్చాడు. ఈ క్రమంలోనే తన కెరీర్ లో అత్యంత బాధపడిన సంఘటన గురించి చెప్పుకొచ్చాడు. “2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓటమితో చాలా బధపడ్డాను. ఆ ఓటమితో ఆ క్షణం నా గుండె ముక్కలైంది. అది నాకు చివరి వరల్డ్ కప్ అని తెలుసు. అందుకే విజయంతో ముగించాలనుకున్నాను. కానీ.. కుదరలేదు. ఇది నన్ను ఎంతో బాధించింది. దాన్నుంచి బయటపడాలని ఎంతో ట్రై చేశాను కూడా. అయితే ఫలితాన్ని అంగీకరించి ముందుకు సాగినప్పుడే.. భవిష్యత్ లో మంచి ఫలితాను అందుకుంటాం” అంటూ ఆ చేదు సంఘటనను గుర్తు చేసుకున్నాడు ధోని. ఈ సెమీ ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే.

Dhoni

కాగా.. 2019 వరల్డ్ కప్ తర్వాత ధోని అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడలేదు. తన క్రికెట్ కెరీర్ కు వీడ్కలు పలికి, కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడుతున్న ధోని.. నెక్ట్స్ సీజన్ ఆడతాడా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక మరికొన్ని నెలల్లో ఐపీఎల్ మెగావేలం జరగనున్న నేపథ్యంలో ధోనిని చెన్నై రిటైన్ చేసుకుంటుందా? లేదా? అన్నది ఇంట్రెస్టింగ్ కాగా మారింది. అయితే సీఎస్కే యాజమాన్యం మాత్రం ధోనిని వదులుకోమని చెప్పుకొస్తోంది. ఇప్పటి వరకైతే రిటైర్మెంట్ పై ఎలాంటి ప్రకటనా ఇవ్వని ధోని.. మరికొన్ని రోజులు ఐపీఎల్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు.