ధోని నాకు తండ్రి లాంటోడు.. CSK స్టార్ ప్లేయర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

మహేంద్ర సింగ్ ధోని తనకు తండ్రి లాంటోడని ఓ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ అన్నాడు. చాలా విషయాల్లో మాహీ తనకు సపోర్ట్​గా ఉంటాడని తెలిపాడు.

మహేంద్ర సింగ్ ధోని తనకు తండ్రి లాంటోడని ఓ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ అన్నాడు. చాలా విషయాల్లో మాహీ తనకు సపోర్ట్​గా ఉంటాడని తెలిపాడు.

ఎంఎస్ ధోని.. ఈ పేరు చెప్పగానే పరుగులు, సెంచరీలు, రికార్డుల కంటే కూడా ట్రోఫీలు, విజయాలే ఎక్కువగా గుర్తుకొస్తాయి. ఎందుకంటే బ్యాటర్​గా కంటే కెప్టెన్​గానే ధోని ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. బ్యాట్స్​మన్​గా అతడికి తిరుగు లేదు. టీమిండియాతో పాటు ఐపీఎల్​లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కూడా పరుగుల వరద పారించాడతను. అయితే ధోని గురించి ఎవర్ని అడిగినా కెప్టెన్​గా అతడి ఘనతలే చెబుతారు. తాను సారథ్యం వహించే టీమ్​లోని ఆటగాళ్ల మీద అతడు భరోసా ఉంచే విధానం, జట్టును నడిపించే తీరు, ప్లేయర్లను ఎంకరేజ్ చేస్తూ వారిలోని బెస్ట్ గేమ్​ను బయటకు తీసే తీరుకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అలాంటి ధోని తనకు తండ్రితో సమానమని ఓ సీఎస్​కే స్టార్ అన్నాడు.

ఇంటర్నేషనల్ క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మాహీ ఐపీఎల్​ మీదే ఫోకస్ చేస్తూ వస్తున్నాడు. తన తర్వాత కూడా చెన్నై జట్టు విజయవంతంగా ముందుకు వెళ్లాలనే దృష్టితో కొత్త తరం జట్టును సిద్ధం చేస్తున్నాడు. అందులో భాగంగా చాలా మంది యంగ్​స్టర్స్​ను తీర్చిదిద్దుతున్నాడు. వాళ్లకు వరుస అవకాశాలు ఇస్తూ టీమ్​లో స్థానాన్ని సుస్థిరం చేసుకునేలా మోటివేట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడి ఎంకరేజ్​మెంట్​తో స్టార్​గా ఎదిగాడో ఆటగాడు. అతడే పేసర్ మతీష పతిరానా. ఐపీఎల్​తో పాటు ఇంటర్నేషనల్ క్రికెట్​లోనూ పతిరానా ఈ స్థాయిలో చెలరేగుతున్నాడంటే అందులో ధోని పాత్ర ఎంతగానో ఉంది. స్వయంగా ఈ విషయాన్ని పతిరానా బయటపెట్టాడు. మాహీ తనకు తండ్రి లాంటోడని అన్నాడు.

‘నా తండ్రి తర్వాత నా క్రికెట్​ లైఫ్​లో అంత కీలక పాత్ర పోషించింది అంటే ధోని అనే చెప్పాలి. అతడు నా తండ్రి లాంటోడు. నా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. అవసరమైన సమయంలో నాకు తగిన సలహాలు, సూచనలు ఇస్తూ ముందుకు నడిపిస్తుంటాడు. నేను ఇంట్లో ఉన్నప్పుడు మా నాన్న నా విషయంలో ఎలా వ్యవహరిస్తాడో అదే రోల్ సీఎస్​కేలో ఉన్నప్పుడు ధోని నిర్వర్తిస్తాడు. నా లైఫ్​లో మాహీ పాత్ర ఎంత కీలకమో ఇంతకంటే ఎక్కువ చెప్పలేను’ అంటూ పతిరానా ఎమోషనల్ అయ్యాడు. ధోని ప్రోత్సాహం, సపోర్ట్ వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని పతిరానా పేర్కొన్నాడు. మరి.. ధోని తనకు తండ్రి లాంటోడు అంటూ పతిరానా చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments