Nidhan
మహేంద్ర సింగ్ ధోని తనకు తండ్రి లాంటోడని ఓ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ అన్నాడు. చాలా విషయాల్లో మాహీ తనకు సపోర్ట్‌గా ఉంటాడని తెలిపాడు.
మహేంద్ర సింగ్ ధోని తనకు తండ్రి లాంటోడని ఓ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ అన్నాడు. చాలా విషయాల్లో మాహీ తనకు సపోర్ట్‌గా ఉంటాడని తెలిపాడు.
Nidhan
ఎంఎస్ ధోని.. ఈ పేరు చెప్పగానే పరుగులు, సెంచరీలు, రికార్డుల కంటే కూడా ట్రోఫీలు, విజయాలే ఎక్కువగా గుర్తుకొస్తాయి. ఎందుకంటే బ్యాటర్‌గా కంటే కెప్టెన్‌గానే ధోని ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. బ్యాట్స్‌మన్‌గా అతడికి తిరుగు లేదు. టీమిండియాతో పాటు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కూడా పరుగుల వరద పారించాడతను. అయితే ధోని గురించి ఎవర్ని అడిగినా కెప్టెన్‌గా అతడి ఘనతలే చెబుతారు. తాను సారథ్యం వహించే టీమ్‌లోని ఆటగాళ్ల మీద అతడు భరోసా ఉంచే విధానం, జట్టును నడిపించే తీరు, ప్లేయర్లను ఎంకరేజ్ చేస్తూ వారిలోని బెస్ట్ గేమ్‌ను బయటకు తీసే తీరుకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అలాంటి ధోని తనకు తండ్రితో సమానమని ఓ సీఎస్కే స్టార్ అన్నాడు.
ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మాహీ ఐపీఎల్ మీదే ఫోకస్ చేస్తూ వస్తున్నాడు. తన తర్వాత కూడా చెన్నై జట్టు విజయవంతంగా ముందుకు వెళ్లాలనే దృష్టితో కొత్త తరం జట్టును సిద్ధం చేస్తున్నాడు. అందులో భాగంగా చాలా మంది యంగ్‌స్టర్స్‌ను తీర్చిదిద్దుతున్నాడు. వాళ్లకు వరుస అవకాశాలు ఇస్తూ టీమ్‌లో స్థానాన్ని సుస్థిరం చేసుకునేలా మోటివేట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడి ఎంకరేజ్‌మెంట్‌తో స్టార్‌గా ఎదిగాడో ఆటగాడు. అతడే పేసర్ మతీష పతిరానా. ఐపీఎల్‌తో పాటు ఇంటర్నేషనల్ క్రికెట్లోనూ పతిరానా ఈ స్థాయిలో చెలరేగుతున్నాడంటే అందులో ధోని పాత్ర ఎంతగానో ఉంది. స్వయంగా ఈ విషయాన్ని పతిరానా బయటపెట్టాడు. మాహీ తనకు తండ్రి లాంటోడని అన్నాడు.
‘నా తండ్రి తర్వాత నా క్రికెట్ లైఫ్‌లో అంత కీలక పాత్ర పోషించింది అంటే ధోని అనే చెప్పాలి. అతడు నా తండ్రి లాంటోడు. నా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. అవసరమైన సమయంలో నాకు తగిన సలహాలు, సూచనలు ఇస్తూ ముందుకు నడిపిస్తుంటాడు. నేను ఇంట్లో ఉన్నప్పుడు మా నాన్న నా విషయంలో ఎలా వ్యవహరిస్తాడో అదే రోల్ సీఎస్కేలో ఉన్నప్పుడు ధోని నిర్వర్తిస్తాడు. నా లైఫ్‌లో మాహీ పాత్ర ఎంత కీలకమో ఇంతకంటే ఎక్కువ చెప్పలేను’ అంటూ పతిరానా ఎమోషనల్ అయ్యాడు. ధోని ప్రోత్సాహం, సపోర్ట్ వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని పతిరానా పేర్కొన్నాడు. మరి.. ధోని తనకు తండ్రి లాంటోడు అంటూ పతిరానా చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.