క్రికెటర్లను ఇష్టపడటం, వారిని సోషల్ మీడియాలో ఫాలో అవ్వడం మామూలే. కానీ వారి మీద పిచ్చి ప్రేమ చూపించడం, ఆ లవ్‌తో పిచ్చి చేష్టలకు దిగడం మాత్రం సరికాదని చెప్పాలి.
క్రికెటర్లను ఇష్టపడటం, వారిని సోషల్ మీడియాలో ఫాలో అవ్వడం మామూలే. కానీ వారి మీద పిచ్చి ప్రేమ చూపించడం, ఆ లవ్‌తో పిచ్చి చేష్టలకు దిగడం మాత్రం సరికాదని చెప్పాలి.
క్రికెటర్లకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా జెంటిల్మన్ గేమ్‌ను ఓ మతంగా భావించే మన దేశంలో ఇది మరీ ఎక్కువ. ఆన్ ఫీల్డే కాదు.. ఆఫ్ ది ఫీల్డ్ కూడా ఆటగాళ్ల ప్రతి కదలికలను అభిమానులు గమనిస్తుంటారు. వాళ్ల జీవితాల్లో జరిగే విశేషాలను తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. దీనికి కారణంగా వాళ్ల మీద ఉన్న అమితమైన ప్రేమ అనే చెప్పొచ్చు. భారత క్రికెటర్లలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నవారిలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఒకడు. ఒక ఆటగాడిగా, టీమిండియా కెప్టెన్‌గా అతడు సాధించిన రికార్డుల గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. భారత జట్టుకు ఏకంగా రెండు వరల్డ్ కప్స్ అందించాడు మాహీ. టీ20లు, వన్డేల్లో టైటిల్స్ అందించి చరిత్రను సృష్టించాడు. అలాగే టెస్టుల్లోనూ జట్టును నంబర్ వన్ స్థానానికి చేర్చాడు.
ఒక ఆటగాడిగా బ్యాట్‌తో దుమ్మురేపుతూనే, కెప్టెన్‌గా టీమ్‌ను ముందుండి ధోని నడిపిన తీరు అద్భుతం అనే చెప్పాలి. భారత జట్టును స్థిరంగా విజయాల బాట పట్టించి అన్ని ఫార్మాట్లలోనూ నంబర్ వన్ చేశాడు. రోహిత్ శర్మ, సురేష్ రైనా, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, శిఖర్ ధవన్ లాంటి ఎందరో ప్లేయర్లకు అండగా ఉన్నాడు. వారికి సపోర్ట్ ఇస్తూ ప్రోత్సహించాడు. వారి సక్సెస్‌లో ధోని రోల్ ఎంతో ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్లోనే కాదు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ ధోని చాలా సక్సెస్ఫుల్. అటు కెప్టెన్‌గానూ, ఇటు బ్యాటర్‌గా, కీపర్‌గానూ రాణించి ఈ మెగా లీగ్‌లో విజయవంతమైన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. ఫస్ట్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు ఆడుతూ వస్తున్నాడతను. ఆ టీమ్‌కు ఏకంగా 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీని అందించాడతను. అలాగే పది సార్లు ఫైనల్‌కు తీసుకెళ్లాడు. దీన్ని బట్టే మాహీ ఎంతగా సక్సెస్ అయ్యాడో అర్థం చేసుకోవచ్చు.
ఐపీఎల్లో గత కొన్నేళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ అండర్గాగ్స్గానే బరిలోకి దిగుతోంది. టీమ్‌లోకి ఒకరిద్దరు తప్పితే పెద్దగా స్టార్లు లేకపోవడం, కాస్త ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్లు ఉండటం, ఊరూ పేరు లేని యంగ్‌స్టర్స్‌ను తీసుకోవడంతో ఆ జట్టుపై ఎవరూ పెద్దగా అంచనాలు పెట్టుకోవడం లేదు. కానీ సీఎస్కే అద్భుతంగా రాణిస్తోంది. తనకు అందుబాటులో ఉన్న వనరుల్ని చక్కగా వాడుకుంటున్న ధోని.. ప్లేయర్ల నుంచి తనకు, టీమ్‌కు కావాల్సింది రాబట్టుకుంటున్నాడు. దీంతో ఆ టీమ్‌కు ఎదురే లేకుండా పోయిది. ఈ ఏడాది కూడా ఎల్లో ఆర్మీ కప్‌ను ఎగరేసుకుపోయింది. దీంతో ధోనీని ఆరాధించే వారి సంఖ్య మరింత పెరిగింది. అయితే మాహీని పిచ్చిపిచ్చిగా ప్రేమించే ఓ పిల్లాడు చేసిన ఒక పని తెగ వైరల్ అవుతోంది.
ఢిల్లీలో ఓ స్కూల్ పిల్లాడు మ్యాథ్స్ ఎగ్జామ్ పేపర్లో ప్రతి క్వశ్చన్‌కు ‘తల’ అని ఆన్సర్ రాశాడట. ధోనీని చెన్నై ఫ్యాన్స్ ముద్దుగా తల (నాయకుడు) అని పిలుస్తారనేది తెలిసిందే. అయితే ప్రశ్నాపత్రంలో ఇలా రాసినందుకు గానూ ఆ విద్యార్థిని స్కూల్ మేనేజ్మెంట్ సస్పెండ్ చేసిందని సమాచారం. ఇది తెలిసిన కొందరు నెటిజన్స్ ధోని లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఎదగాలని.. కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదని సూచిస్తున్నారు. మరి.. ధోనీ మీద పిచ్చి ప్రేమతో సస్పెండ్ అవ్వడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Yuvraj Singh: ABDని అవమానిస్తూ.. యువరాజ్ కి సెహ్వాగ్ బర్త్ డే విషెస్!
MS Dhoni Fan @ChennaiIPL @IPL pic.twitter.com/BlzGOkMp0e
— Nidhan Singh Pawar (@NidhanPawar) December 12, 2023