Nidhan
టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీపై సంచలన ఆరోపణలు చేసిన ఓ ఐపీఎస్ ఆఫీసర్‌కు జైలు శిక్ష పడింది. అసలు ఆ అధికారి ఎవరు? ధోనీపై ఆయన చేసిన ఆరోపణలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీపై సంచలన ఆరోపణలు చేసిన ఓ ఐపీఎస్ ఆఫీసర్‌కు జైలు శిక్ష పడింది. అసలు ఆ అధికారి ఎవరు? ధోనీపై ఆయన చేసిన ఆరోపణలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మళ్లీ గ్రౌండ్లో ఎప్పుడెప్పుడు దిగుతాడా అని ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేషనల్ టీమ్‌కు ఎప్పుడో గుడ్‌బై చెప్పేసిన మాహీ.. కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే. పెద్దగా స్టార్లు లేకపోయినా యంగ్‌స్టర్స్‌తో నిండిన చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌ను కెప్టెన్‌గా అద్భుతంగా నడిపిస్తున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లో అంతగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా బరిలోకి దిగిన సీఎస్కే విన్నర్‌గా నిలిచింది. టీమ్ ఆరోసారి టైటిల్ గెలవడంలో ధోని రోల్ ఎంతగానో ఉంది. అలాంటి ధోని మీద ఓ ఐపీఎస్ ఆఫీసర్ సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. 2013 ఐపీఎల్ టైమ్‌లో మాహీ బెట్టింగ్‌కు, మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడంటూ సంపత్ కుమార్ అనే అధికారి తీవ్ర ఆరోపణలు చేశారు.
ఐపీఎల్-2013 బెట్టింగ్ స్కాండల్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్ కారణంగానే చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలను బ్యాన్ కూడా చేశారు. ఈ స్కామ్‌కు సంబంధించి అప్పట్లో సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మీద తమిళనాడుకు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జీ సంపత్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ధోని బెట్టింగ్‌కు, మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని అన్నారు. ఈ ఆరోపణల మీద సీరియస్ అయిన ధోని.. తన పరువుకు నష్టం కలిగించినందుకు గానూ సంపత్తో పాటు టీవీ ఛానల్‌పై 2014లో పరువు నష్టం దావా వేశారు. పరిహారంగా రూ.100 కోట్లు చెల్లించాలని, తనపై పరువు నష్టం కలిగించే ప్రకటనలు జారీ చేయకుండా నిషేధించాలని కోర్టును కోరాడు మాహీ.
ఈ కేసును తాజాగా విచారించిన మద్రాస్ హైకోర్టు సంపత్ కుమార్‌కు 15 రోజుల జైలు శిక్ష విధించింది. జస్టిస్ సుందర్ మోహన్, జస్జిస్ ఎస్ఎస్ సుందర్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. పదిహేను రోజుల శిక్ష మీద అప్పీలు చేసుకోవడానికి సంపత్ కుమార్‌కు కోర్టు 30 రోజుల గడువు ఇచ్చింది. అలాగే ధోనీపై పరువు నష్టం కలిగించే ప్రకటనలు ఇవ్వొద్దని రిటైర్డ్ ఆఫీసర్‌తో పాటు ఆ మీడియా సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. ధోనీకి అనుకూలంగా తీర్పు రావడంపై అతడ్ని అభిమానించే వాళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గత ఐపీఎల్ టైమ్‌లో గాయపడిన మాహీ.. నెక్స్ట్ సీజన్లో ఆడతాడో లేదో డౌట్‌గా మారింది. కానీ ఇటీవల జరిగిన ప్లేయర్ల రిటెన్షన్ టైమ్‌లో దీనిపై క్లారిటీ వచ్చింది. వచ్చే ఐపీఎల్లో ధోని ఆడటం ఖాయం కావడంతో అతడి ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. అదే టైమ్‌లో తాజాగా పరువు నష్టం కేసులోనూ అతడికి అనుకూలంగా తీర్పు రావడంతో వాళ్ల ఆనందం రెట్టింపు అయింది. మరి.. ధోని కేసులో మాజీ ఐపీఎస్‌కు జైలు శిక్ష పడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Hardik Pandya: ముంబై ఇండియన్స్ సంచలన ప్రకటన! కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా!
Madras High Court Sentences IPS Officer Sampath Kumar To 15 Days Imprisonment In Contempt Plea By MS Dhoni, Suspends It To Allow Appeal | @UpasanaSajeev#MadrasHighCourt #MSDhoni https://t.co/qy2tOxEV9F
— Live Law (@LiveLawIndia) December 15, 2023