SNP
SNP
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఎంత గొప్ప క్రికెటర్‌గా ఎదిగా చాలా ఒదిగి ఉంటాడనే విషయం అందరికీ తెలిసిందే. హంగు ఆర్భాటలకు ఎప్పుడూ దూరంగా ఉండే ధోని.. తాజాగా తన పుట్టిన రోజు వేడుకలను సైతం ఎవరూ ఊహించనంత సాదా సీదాగా జరుపుకున్నాడు. తన పెంపుడు కుక్కలతో కలిసి బ్రెడ్ కట్ చేసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు.
ఆ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ధోని.. ‘నా పుట్టిన రోజును ఇలా జరుపుకున్నాను’ అంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ధోని సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కొన్ని కోట్ల ఆస్తి, అంతులేని అభిమాన బలం ఉన్నా ఆటగాడు ఇంత సింపుల్‌గా ఎలా ఉండగలుగుతున్నాడంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘నువ్వు దేవుడివి స్వామీ’ అంటూ కామెంట్ చేస్తున్నారు.
అయితే.. ఈ వీడియోను చూస్తే ధోనికి మూగజీవాలపై ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందని క్రికెట్ అభిమానుల పేర్కొంటున్నారు. నాలుగు పెంపుడు కుక్కల ఎదుట కేక్ కట్ చేసిన ధోని వాటికి ఎంతో ప్రేమగా తినిపించాడు. అదే కేక్‌ను తాను కూడా తినడం విశేషం. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలనే విషయం సింపుల్‌గా ధోనిని చూస్తే అర్థమైపోతుంది. మరి ధోని బర్త్‌డే సెలబ్రేషన్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
MS Dhoni celebrating his 42nd birthday.
What a beautiful video! pic.twitter.com/lXQGg1N3bW
— Johns. (@CricCrazyJohns) July 8, 2023