Nidhan
MS Dhoni-Ravichandran Ashwin: ఐపీఎల్ నెక్స్ట్ సీజన్‌కు ఇంకా చాలా టైమ్ ఉంది. కానీ బీసీసీఐతో ఫ్రాంచైజీలు ఇటీవల సమావేశం కావడంతో క్యాష్ రిచ్ లీగ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.
MS Dhoni-Ravichandran Ashwin: ఐపీఎల్ నెక్స్ట్ సీజన్‌కు ఇంకా చాలా టైమ్ ఉంది. కానీ బీసీసీఐతో ఫ్రాంచైజీలు ఇటీవల సమావేశం కావడంతో క్యాష్ రిచ్ లీగ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.
Nidhan
ఐపీఎల్ నెక్స్ట్ సీజన్‌కు ఇంకా చాలా టైమ్ ఉంది. కానీ బీసీసీఐతో ఫ్రాంచైజీలు ఇటీవల సమావేశం కావడంతో క్యాష్ రిచ్ లీగ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ ఏడాది చివర్లో మెగా ఆక్షన్ జరగనున్న నేపథ్యంలో ఆర్టీఎం (రైట్ టు మ్యాచ్), రిటెన్షన్ విధానం, రిటెయిన్ చేసుకునే ప్లేయర్ల పరిమితి లాంటి అంశాలపై ఇటీవల జరిగిన మీటింగ్‌లో ఫ్రాంచైజీలతో బోర్డు చర్చించింది. ఈ అంశంపై తాజాగా భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రియాక్ట్ అయ్యాడు. ఆర్టీఎం రూల్ వల్ల ఫ్రాంచైజీలకు మంచి జరుగుతుందని, కానీ ఆటగాళ్లకు మాత్రం తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నాడు. ఇదే క్రమంలో లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ధోనీని అన్క్యాప్డ్ ప్లేయర్‌గా ఆడించడంలో తప్పేమీ లేదంటూ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి సపోర్ట్ ఇచ్చాడు అశ్విన్. ధోనీని ఆడించొచ్చు అంటూనే అంతటి స్థాయి ఆటగాడ్ని అన్క్యాప్డ్ ప్లేయర్‌గా తీసుకోవడం కరెక్ట్ కాదేమో అని మెలిక పెట్టాడు. ‘ధోని అన్క్యాప్డ్ ప్లేయర్‌గా ఆడతాడా? అనేది బిగ్ క్వశ్చన్. అయితే అతడ్ని ఇలా ఆడించాలనే పాయింట్లో తప్పేం లేదు. అతడు చాన్నాళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. ఎప్పుడో రిటైర్ అయ్యాడు. ఆ లెక్కన చూసుకుంటే అతడు అన్క్యాప్డ్ ప్లేయరే. కానీ ధోని స్థాయి ఆటగాడు అన్క్యాప్డ్ ప్లేయర్‌గా ఆడతాడా? అనేది ఆసక్తికరమైన అంశం’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
ధోని గురించి చర్చ మొదలైతే అందరూ దాని మీదే ఫోకస్ చేస్తారని అశ్విన్ తెలిపాడు. కాగా, ఫ్రాంచైజీలతో బీసీసీఐ మీటింగ్ టైమ్‌లో ధోని అంశం కూడా ప్రస్తావనకు వచ్చిందని ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైరై 5 ఏళ్లు దాటిన ప్లేయర్‌ను అన్క్యాప్డ్ ప్లేయర్‌గా ప్రకటించాలని ఐపీఎల్లో రూల్ ఉండేది. దాన్ని 2021లో తీసేశారు. ఇప్పుడు ధోని కోసం ఆ నిబంధనను మళ్లీ తీసుకురావాలని సీఎస్కే పట్టుబట్టిందట. అయితే మాహీ లాంటి దిగ్గజాన్ని అన్క్యాప్డ్ ప్లేయర్‌గా ప్రకటించడం అతడ్ని అవమానించడమేనని.. ధోనీని వేలంలోకి తీసుకురావాల్సిందేనని సన్‌రైజర్స్ హైదరాబాద్ కో-ఓనర్ కావ్యా మారన్ సీరియస్ అవ్వడంతో ఈ చర్చకు అక్కడే ఫుల్స్టాప్ పడిందని వినికిడి. ఈ నేపథ్యంలోనే తాజాగా ధోని గురించి అశ్విన్ కామెంట్స్ చేయడం గమనార్హం. మరి.. ధోనీని అన్క్యాప్డ్ ప్లేయర్‌గా ప్రకటించడం కరెక్టా? కాదా? మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Ravichandran Ashwin has sparked intrigue regarding MS Dhoni’s future in the IPL.#IPL2025 #RavichandranAshwin #MSDhoni #CSK #CricketTwitter pic.twitter.com/CUwDpeC1xo
— InsideSport (@InsideSportIND) August 10, 2024