Somesekhar
టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని, ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ ఐపీఎల్ 2024 ఆక్షన్ కు హాజరైయ్యారు. ఇక వీరిద్దరు అక్కడ కొత్త అవతారంలో అభిమానులకు దర్శనమిచ్చారు.
టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని, ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ ఐపీఎల్ 2024 ఆక్షన్ కు హాజరైయ్యారు. ఇక వీరిద్దరు అక్కడ కొత్త అవతారంలో అభిమానులకు దర్శనమిచ్చారు.
Somesekhar
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. గత 16 సీజన్లలో బద్దలు కాని రికార్డులు తాజాగా జరిగిన వేలంలో బ్రేక్ అయ్యాయి. ఆసీస్ స్టార్ ఆటగాళ్లు అయిన మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్ లకు రికార్డు స్థాయిలో కోట్లు కుమ్మరించాయి కోల్ కత్తా, సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీలు. స్టార్క్ కు కోల్ కత్తా రూ.24.75 కోట్లు, కమ్మిన్స్ ను రూ.20.50 కోట్లు పెట్టి సన్ రైజర్స్ దక్కించుకున్నాయి. ఇక ఈ వేలం కోసం స్టార్ క్రికెటర్లందరూ దుబాయ్ చేరుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని, ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ లు కూడా ఆక్షన్ కు హాజరైయ్యారు. ఇక వీరిద్దరు అక్కడ కొత్త అవతారంలో అభిమానులకు దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఐపీఎల్ 2024 వేలంలో టీమిండియా స్టార్ ప్లేయర్లు సందడి చేశారు. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో పాటుగా టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ దుబాయ్ లో సందడి చేశారు. చెన్నై తరఫున ఆక్షన్ లో పాల్గొనడానికి ధోని రాగా.. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున రిషబ్ పంత్ వచ్చాడు. ఇక కారు ప్రమాదం నుంచి కోలుకున్న పంత్ తిరిగి బ్యాట్ పట్టేందుకు సిద్దంగా ఉన్నాడు. అందులో భాగంగానే ఐపీఎల్ వేలానికి వచ్చి.. ఆటగాళ్ల కొనుగోలు ఎలా జరుగుతుందో పరిశీలించాడు. ఈ క్రమంలోనే ఎంఎస్ ధోనితో కలిసి రిషబ్ పంత్ టెన్నిస్ ఆడాడు. వీరిద్దరితో పాటుగా మరో ఇద్దరు కూడా టెన్నిస్ ఆడారు. ధోని, పంత్ ఆడుతుంటే అభిమానులు కేరింతలు కొడుతూ.. వీడియోలు, ఫొటోలు తీసుకున్నారు. చూట్టూ నీరు మధ్యలో టెన్నిస్ కోర్టు.. దాంట్లో పంత్, ధోనీలు టెన్నిస్ ఆడి అభిమానులను అలరించారు.
ఈ క్రమంలోనే పంత్ భారీ షాట్ కొట్టగా.. అభిమానులు ఒక్కసారిగా అరిచారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఐపీఎల్ ఆక్షన్ ముగిసిన తర్వాత సరదాగా ఇలా సేదతీరారు ధోని, పంత్. అదీకాక ధోనికి టెన్నిస్ అంటే ఎంత ఇష్టమో మనందరికి తెలిసిన విషయమే. రిషబ్ పంత్ ఫుల్ ఫిట్ నెస్ లో కనిపిస్తున్నాడు. దీంతో అతడు ఈ ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను ముందుండి నడిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ధోని, పంత్ లు టెన్నిస్ ఆడటం మీకేవిధంగా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
MS Dhoni and Rishabh Pant playing Tennis in Dubai. 🔥pic.twitter.com/1RRqqsrT5S
— Johns. (@CricCrazyJohns) December 20, 2023