SNP
MS Dhoni, Andhra Pradesh: టీమిండియా మాజీ కెప్టెన్ ధోనికి ప్రపంచ వ్యాప్తంగా కోట్ల కొద్ది అభిమానులున్నారు. అందులో తెలుగు వాళ్ల సంఖ్య కూడా ఎక్కువే. అయితే.. తాజాగా తెలుగు వాళ్లు ధోనిపై తమ వంద అడుగుల అభిమానం కురిపించారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం..
MS Dhoni, Andhra Pradesh: టీమిండియా మాజీ కెప్టెన్ ధోనికి ప్రపంచ వ్యాప్తంగా కోట్ల కొద్ది అభిమానులున్నారు. అందులో తెలుగు వాళ్ల సంఖ్య కూడా ఎక్కువే. అయితే.. తాజాగా తెలుగు వాళ్లు ధోనిపై తమ వంద అడుగుల అభిమానం కురిపించారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం..
SNP
ఒక సినిమాలో.. ‘మీ తెలుగు ప్రజలు ఒక మనిషిని ఆరాధిస్తే.. ఇంతలా ఆరాధిస్తారా?’ అనే డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని విషయంలో నిజం అవుతోంది. తెలుగు ప్రజలు రాజకీయ నాయకులను, సినిమా హీరోలను ఎక్కువగా అభిమానిస్తారు. ఆ తర్వాత.. భారత క్రికెటర్లదే స్థానం. టీమిండియా తరఫున ఆడి గొప్ప గొప్ప రికార్డులు, కప్పులు సాధించిన క్రికెటర్లపై అమితమైన ప్రేమాభిమానాలు చూపిస్తుంటారు. ఒక్కసారి అభిమానిస్తే ఎన్ని ఏళ్లు గడిచినా.. ఆ అభిమానం అలాగే ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోని ఎప్పుడో రిటైర్ అయినా.. ఇప్పటికీ అతనిపై తెలుగు ప్రజల్లో ఉన్న అభిమానం చెక్కుచెదరలేదు. ధోని పుట్టిన రోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో వంద అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేసి.. ధోనిపై తమ అభిమానం చాటుకున్నారు.
ఏపీలోని నందిగామలో తెలుగు ధోని ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ధోని బర్త్ డేకు ఒక రోజు ముందు అంటే జులై 6(శనివారం) నాడు ఈ కటౌట్‌ను ఆశిష్కరించారు. జులై 7(ఆదివారం) ధోని పుట్టిన రోజు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్ పుట్టిన రోజు అది. పైగా ధోని అంటే నంబర్ 7.. నంబర్ 7 అంటే ధోని. ఆయన అభిమానులు ఏది మర్చిపోయినా.. ధోని బర్త్‌డేను మర్చిపోరు. ఆ రోజున దేశవ్యాప్తంగా ఉన్న ధోని అభిమానులు స్వీట్లు పంచడం, అన్నదానం చేయడం లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అయితే.. నందిగామ తెలుగు అభిమానులు ఒక అడుగు ముందుకేసి.. వంద అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేయడం విశేషం.
ఇప్పటికే రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన సంతోషంలో ఉన్న భారత క్రికెట్ అభిమానులకు ఈ భారీ కటౌట్ మరింత సంతోషం ఇవ్వనుంది. ఎందుకంటే.. టీమిండియాకు మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ ధోనినే. 2007లో సౌతాఫ్రికా వేదికగా జరిగిన మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్‌ను ధోని సారథ్యంలోని యంగ్ టీమిండియా కైవసం చేసుకుంది. ధోని అప్పుడే కొత్తగా కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. అయినా కూడా టీమ్‌ను అద్భుతంగా నడిపించి.. తొలి టీ20 వరల్డ్ కప్‌ను ఇండియాకు అందించాడు. దాంతో పాటే 2011లో వన్డే వరల్డ్ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా టీమిండియా ధోని కెప్టెన్సీలోనే గెలిచింది. అంతటి ఘనత సాధించిన ధోనికి తెలుగు క్రికెట్ అభిమానులు వంద అడుగుల కటౌట్ పెట్టి గౌరవించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
100 FEET CUT-OUT OF MS DHONI BY TELUGU FANS. 🥶
– Birthday celebration begins for Thala…!!!! pic.twitter.com/QatZw2Jb7Q
— Johns. (@CricCrazyJohns) July 6, 2024