iDreamPost
android-app
ios-app

MPL 2023: భార్య జెర్సీతో బరిలోకి దిగిన రుతురాజ్.. తొలి మ్యాచ్ లోనే దంచికొట్టాడు!

  • Author Soma Sekhar Published - 05:43 PM, Fri - 16 June 23
  • Author Soma Sekhar Published - 05:43 PM, Fri - 16 June 23
MPL 2023: భార్య జెర్సీతో బరిలోకి దిగిన రుతురాజ్.. తొలి మ్యాచ్ లోనే దంచికొట్టాడు!

రుతురాజ్ గైక్వాడ్.. 2023 ఐపీఎల్ సీజన్ లో చెన్నై సైపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఈ టోర్నీలో అద్భుతమైన ఫామ్ ను చూపించడంతో.. రుతురాజ్ ను WTC ఫైనల్ మ్యాచ్ కు రిజర్వ్ ఆటగాడిగా సెలక్ట్ చేశారు. అయితే పెళ్లి కారణంగా అతడు ఈ మ్యాచ్ కు దూరం అయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు, లేడీ క్రికెటర్ అయిన ఉత్కర్ష పవార్ ను రుతురాజ్ వివాహం చేసుకున్నాడు. ఇక పెళ్లి అనంతరం ఆడుతున్న తొలి మ్యాచ్ లో దుమ్మురేపాడు ఈ యంగ్ స్టర్. అయితే ఈ ఇన్నింగ్స్ కు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రుతురాజ్ గైక్వాడ్.. 2023 ఐపీఎల్ టోర్నీ చెన్నై సూపర్ కింగ్స్ గెలవడంతో కీలక పాత్రను పోషించాడు. అనంతరం మహిళా క్రికెటర్ అయిన ఉత్కర్ష పవార్ ను పెళ్లి చేసుకున్నాడు రుతురాజ్. ఇక వివాహం అనంతరం రుతురాజ్ గైక్వాడ్ మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్(MPL 2023)లో బరిలోకి దిగాడు. ఇక లీగ్ లో తొలి మ్యాచ్ పూణేరి బప్పా వర్సెస్ కొల్హాపూర్ టస్కర్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కొల్హాపూర్ టస్కర్స్ 144 పరుగులు చేసింది.

అనంతరం 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పుణేరి బప్పా జట్టు మరో 29 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. పూణేరి జట్టు కెప్టెన్ అయిన రుతురాజ్ 22 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్ ను అందుకున్నాడు. మెుత్తంగా 27 బంతుల్లో 5 సిక్సర్లు, 5 ఫోర్లతో 67 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ లో విశేషం ఏంటంటే? రుతురాజ్ తన భార్య ఉత్కర్ష జెర్సీ నెం 13తో బరిలోకి దిగాడు. అసలైతే రుతురాజ్ జెర్సీ నెంబర్ 31. కానీ తాజాగా జరిగిన మ్యాచ్ లో తన భార్యపై ప్రేమతో ఆమె జెర్సీ నెంబర్ తో బరిలోకి దిగాడు. దిగడమే కాకుండా తుపాన్ ఇన్నింగ్స్ తో టీమ్ ను గెలిపించాడు. కాగా పూణేరి బప్పా టీమ్ రుతురాజ్ ను రూ. 14.8 కోట్లకు కెప్టెన్ గా ఎంపిక చేసుకోవడం విశేషం.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş